NTA | నీట్ రీటెస్టు.. అభ్యర్థుల కోసం అధికారిక వాట్సప్ సేవలు ప్రారంభించిన ఎన్టీఏ
NTA | నీట్ రీ-ఎగ్జామ్‌కు (NEET re test) రెండు రోజులే సమయం ఉండటంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. +91 78279 80287 నంబరుతో అధికారిక వాట్సప్ ఖాతాను అందుబాటులోకి తెచ్చింది.
NTA | నీట్ రీ-ఎగ్జామ్‌కు (NEET re test) రెండు రోజులే సమయం ఉండటంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షకు సంబంధించిన అధికారిక సమాచారాన్ని అభ్యర్థులకు వేగంగా అందించే ఉద్దేశంతో +91 78279 80287 నంబరుతో అధికారిక వాట్సప్ ఖాతాను అందుబాటులోకి తెచ్చింది. 'నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ' పేరుతో ఉండే ఈ ఖాతాకు బ్లూ టిక్ గుర్తింపు ఉంటుంది.
పరీక్షా కేంద్రాల వివరాలు, రీటెస్టుకు సంబంధించిన ముఖ్యమైన ప్రకటనలు, ఇతర అధికారిక అప్‌డేట్‌లు ఈ ఖాతా ద్వారానే పంపించనున్నట్లు ఎన్టీఏ తెలిపింది. ఈ వాట్సాప్ సేవలు కేవలం అధికారిక ప్రసారాల కోసమేనని స్పష్టం చేసింది. ఇందులో రిప్లైలు ఇవ్వమని, ఓటీపీ, వ్యక్తిగత వివరాలు, నగదు చెల్లింపులు వంటివి తాము అడగమని వెల్లడించింది. ఇదే సమయంలో సోషల్ మీడియా, ఎస్‌ఎంఎస్‌లు, ఈ-మెయిళ్ల ద్వారా వ్యాప్తి చెందుతున్న నకిలీ సందేశాల విషయంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇతర నంబర్లు లేదా ఈ-మెయిల్ ఐడీల నుంచి వచ్చే సమాచారాన్ని విశ్వసించవద్దని సూచించింది. ఈ మేరకు ఎన్టీయే ఎక్స్ వేదికగా పోస్టు పెట్టింది.
📢 NEET (UG) 2026 — Official WhatsApp Updates
NTA is now sending exam updates & centre information to candidates directly on WhatsApp for the re-examination on Sunday, 21 June 2026.
How to know it's really us:
✅ Only from our verified account: +91 78279 80287
✅ Look for the…
— National Testing Agency (@NTA_Exams) June 19, 2026
అలాగే మే 3న నిర్వహించాల్సిన పరీక్ష కోసం జారీ చేసిన అడ్మిట్ కార్డులు రీటెస్టుకు చెల్లుబాటు కావని ఎన్‌టీఏ మరోసారి గుర్తు చేసింది. రీటెస్టుకు హాజరయ్యే అభ్యర్థులు తాజా అడ్మిట్ కార్డులను తప్పనిసరిగా డౌన్‌లోడ్ చేసుకోవాలని స్పష్టం చేసింది. జూన్ 21వ తేదీన దేశవ్యాప్తంగా నీట్ రీ-ఎగ్జామ్‌ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
📢 NEET (UG) 2026 — Admit Card Reminder & Safety Advisory
NTA is sending reminder SMS and emails to candidates to download their admit cards for the re-examination on Sunday, 21 June 2026.
How to know a message is genuinely from NTA:
✅ SMS would come from the official sender…
— National Testing Agency (@NTA_Exams) June 19, 2026
Also Read..
టెలిగ్రామ్‌పై నిషేధం సరైన నిర్ణయమే : ఢిల్లీ హైకోర్టు
తాజావార్తలు
- ●Paddy Procure | ధాన్యం నిల్వకు 20 ప్రాంతాల్లో అత్యాధునిక ధాన్య సైలోలు
- ●N Ramchander Rao | నిజమైన ఓటరును తొలగించరు.. 'సర్'పై ఎన్ రామచందర్ రావు
- ●Kajal Aggarwal | డీ గ్లామర్ లుక్‌లో కాజల్ - బాలకృష్ణ సినిమా కోసం గెటప్ మార్చిన అందాల చందమామ
- ●KP Vivekananda | రేవంత్ రెడ్డి ఓ చీటర్, గజదొంగ, మోసగాడు
- ●Rangareddy | రంగారెడ్డి జిల్లాలో 10 ఆవులు మృతి.. యూరియానే కారణమా..?
- ●Mexico Vs South Korea | దక్షిణ కొరియాపై 1-0 తేడాతో విజయం.. నాకౌట్‌కు మెక్సికో..

Paddy Procure | ధాన్యం నిల్వకు 20 ప్రాంతాల్లో అత్యాధునిక ధాన్య సైలోలు

N Ramchander Rao | నిజమైన ఓటరును తొలగించరు.. 'సర్'పై ఎన్ రామచందర్ రావు

Kajal Aggarwal | డీ గ్లామర్ లుక్‌లో కాజల్ - బాలకృష్ణ సినిమా కోసం గెటప్ మార్చిన అందాల చందమామ

KP Vivekananda | రేవంత్ రెడ్డి ఓ చీటర్, గజదొంగ, మోసగాడు





