Anupama Parameswaran | విలన్‌గా అనుపమ పరమేశ్వరన్ – సడెన్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ మూవీ
అనుపమ పరమేశ్వరన్ విలన్‌గా నటించిన తెలుగు మూవీ మరీచిక థియేటర్లలో రిలీజైన ఇరవై రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చింది. శుక్రవారం సడెన్‌గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజైంది. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్‌తో పాటు రెజీనా మరో హీరోయిన్‌గా నటించింది.
Entertainment | Published On Jun 19, 2026, 6.31 pm IST
Anupama Parameswaran | మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ విలన్‌గా నటించిన తెలుగు మూవీ మరీచిక ఓటీటీలోకి వచ్చింది. శుక్రవారం అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైంది. ఎలాంటి ముందస్తు అనౌన్స్‌మెంట్ లేకుండా మేకర్స్ ఈ సినిమాను సడెన్‌గా ఓటీటీలోకి తీసుకొచ్చారు.
ఇళయరాజా మ్యూజిక్...
క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్‌తో పాటు రెజీనా మరో హీరోయిన్‌గా నటించింది. విరాజ్ అశ్విన్ కథానాయకుడిగా కనిపించాడు. సతీష్ కాశెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఇళయరాజా మ్యూజిక్ అందించాడు.
ఇరవై రోజుల్లోనే...
మే నెలాఖరున థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఇరవై రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చింది. కథ బాగున్నా థ్రిల్లింగ్‌గా చెప్పడంలో దర్శకుడు విఫలం కావడం, రిలీజ్ ఆలస్యం కారణంగా మరీచిక ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. 2022లో ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. 2026లో రిలీజైంది. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్‌లో కనిపించింది.
మరీచిక దయ్యమా?
గవర్నమెంట్ కాలేజీలో క్యాంటిన్ రన్ చేసే సంజును ఇష్టపడుతుంది వెంకటలక్ష్మి. కానీ సంజు మాత్రం అమెరికా నుంచి వచ్చిన వెంకటలక్ష్మి ఫ్రెండ్ మరీచిక వెంటపడతాడు. ఆమెను పెళ్లిచేసుకుంటాడు. పెళ్లైన తర్వాత రోజు సంజును మరీచిక చంపేసిందంటూ పోలీసులకు కంప్లైంట్ ఇస్తుంది వెంకటలక్ష్మి. కానీ సంజు మాత్రం బతికే ఉంటాడు. మరీచిక అనేవాళ్లు ఎవరూ లేరని పోలీసులకు తెలుస్తుంది. అసలు మరీచిక ఎవరు? దయ్యమై సంజు, వెంకటలక్ష్మి వెంట ఎందుకు పడింది? వారిపై ప్రతీకారంతో రగిలిపోవడానికి కారణం ఏమిటి అన్నదే ఈ మూవీ కథ.ప్రస్తుతం తెలుగులో భోగి తో పాటు క్రేజీ కళ్యాణం సినిమాలు చేస్తోంది అనుపమ పరమేశ్వరన్. ఈ రెండు సినిమాలు తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లోనే తెరకెక్కుతోన్నాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Jannaram | ఇంటి నెంబర్ కోసం డబ్బులు డిమాండ్.. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి
- ●Supreme Court | యూపీ గ్యాంగ్స్టర్స్ చట్టంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
- ●Revanth Reddy | తరుణ్ గొగోయ్.. కేజ్రీవాల్.. అర్జున్ ముండా.. రేవంత్ రెడ్డి
- ●Malaria | ఇక దోమకాటుతో మలేరియాకు అడ్డుకట్ట.. సైంటిస్టుల వినూత్న ప్రయోగం..
- ●Ramchandar Rao | అమెరికా టూర్‌కు రేవంత్ రెడ్డికి పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదంటే.. రాంచందర్‌రావు ఏమన్నారంటే..
- ●Trisha | పొలిటికల్ లీడర్‌గా త్రిష - రియల్ లైఫ్‌లో కాదు రీల్ లైఫ్‌లో...

Jannaram | ఇంటి నెంబర్ కోసం డబ్బులు డిమాండ్.. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

Supreme Court | యూపీ గ్యాంగ్స్టర్స్ చట్టంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

Revanth Reddy | తరుణ్ గొగోయ్.. కేజ్రీవాల్.. అర్జున్ ముండా.. రేవంత్ రెడ్డి

Malaria | ఇక దోమకాటుతో మలేరియాకు అడ్డుకట్ట.. సైంటిస్టుల వినూత్న ప్రయోగం..






