Telangana Youth | రాహుల్ గారూ.. మాకిచ్చిన హామీలు మర్చిపోయారు : తెలంగాణ నిరుద్యోగ యువత
Telangana Youth | కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై తెలంగాణ నిరుద్యోగ యువత (Telangana Youth) ఆగ్రహం వ్యక్తం చేసింది. నేడు రాహుల్ గాంధీ పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ నిరుద్యోగ యువత నిరసన శుభాకాంక్షలు తెలిపారు.
Telangana Youth | కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై విద్యార్థి సేన ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల సమయంలో యువతకు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని రాహుల్ హామీ ఇచ్చారని గుర్తు చేసింది. అయితే, ఆ హామీలను రాహుల్ మర్చిపోయారని విద్యార్థి సేన అధ్యక్షులు టీకే శివప్రసాద్ తెలిపారు. ఈ మేరకు నేడు రాహుల్ గాంధీ పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ నిరుద్యోగ యువత నిరసన శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణలో ఉన్న నిరుద్యోగ యువతకు ఆయన ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ రాహుల్ ప్రసంగాలు, బర్త్‌డే గిఫ్ట్‌గా హార్డ్ డిస్క్ రూపంలో పంపిస్తున్నట్లు చెప్పారు. "మీ మాట విని నిరుద్యోగ యువత ఓట్లు వేశారు. రేవంత్ రెడ్డిని చూసి కాదు. మళ్లీ మీరు ఇచ్చిన హామీలను గుర్తుతెచ్చుకొని నిరుద్యోగ నోటిఫికేషన్స్ వేసి జాబ్ క్యాలెండర్ విడుదల చేపించేలా కృషి చేయాలి" అని రాహుల్ గాంధీని విద్యార్థి సేన డిమాండ్ చేసింది. ఈ నిరసన కార్యక్రమంలో నవీన్ గౌడ్, పవన్, రామ్, విష్ణు తదితరులు పాల్గొన్నారు.
Also Read..
మైనర్ బాలుడికి కారు స్టీరింగ్ ఇచ్చి.. కటకటాలపాలైన తండ్రి
నీట్ రీటెస్టు.. అభ్యర్థుల కోసం అధికారిక వాట్సప్ సేవలు ప్రారంభించిన ఎన్టీఏ
తాజావార్తలు
- ●Qatar vs Canada | జోనాదన్ తీన్మార్
- ●Jio AI | జియో ఏఐ విప్లవం.. ఒక్క వాయిస్ కమాండ్ తో అనేక పనులు..
- ●Folk Dancer | హీరోయిన్గా తెలుగు ఫోక్ డ్యాన్సర్ - సుకుమార్ సినిమాలో ఛాన్స్
- ●Cockroach Janta Party | బాధిత కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇవ్వండి.. నీట్ విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రధాని మోదీకి కాక్రోచ్ పార్టీ లేఖ
- ●Dasoju Sravan | హిల్ట్ పేరుతో రూ.6 లక్షల కోట్ల దందా చేస్తున్నరు.. మేం ఛార్జ్ షీట్ రిలీజ్ చేస్తాం
- ●Stock Markets | భారీగా పతనమైన స్టాక్ మార్కెట్లు.. యాక్సెంచర్ హెచ్చరికలతో ఐటీ షేర్లు ఢమాల్..

Qatar vs Canada | జోనాదన్ తీన్మార్

Jio AI | జియో ఏఐ విప్లవం.. ఒక్క వాయిస్ కమాండ్ తో అనేక పనులు..

Folk Dancer | హీరోయిన్గా తెలుగు ఫోక్ డ్యాన్సర్ - సుకుమార్ సినిమాలో ఛాన్స్

Cockroach Janta Party | బాధిత కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇవ్వండి.. నీట్ విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రధాని మోదీకి కాక్రోచ్ పార్టీ లేఖ





