Telegram ban | టెలిగ్రామ్‌పై నిషేధం సరైన నిర్ణయమే : ఢిల్లీ హైకోర్టు
Telegram ban | ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ (Telegram)కు ఢిల్లీ హైకోర్టులో (Delhi High Court) చుక్కెదురైంది. ఈ యాప్‌పై కేంద్రం విధించిన తాత్కాలిక నిషేధాన్ని కోర్టు సమర్థించింది.
Telegram ban | ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ (Telegram)కు ఢిల్లీ హైకోర్టులో (Delhi High Court) చుక్కెదురైంది. ఈ యాప్‌పై కేంద్రం విధించిన తాత్కాలిక నిషేధాన్ని కోర్టు సమర్థించింది. యాప్ నిషేధానికి సంబంధించి కేంద్రం చెప్పిన కారణాలు సహేతుకమేనని నిర్ధరించింది. ఈ మేరకు టెలిగ్రామ్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.
జూన్ 21వ తేదీన దేశవ్యాప్తంగా నీట్ రీ-ఎగ్జామ్‌ను నిర్వహిస్తున్న నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) చేసిన సిఫార్సుల మేరకు దేశంలో టెలిగ్రామ్ యాప్‌పై కేంద్రం తాత్కాలిక నిషేధం విధించిన విషయం తెలిసిందే. జూన్ 22 వరకు టెలిగ్రామ్‌పై నిషేధం విధించింది. పరీక్షా పత్రాల లీకేజీ ప్రయత్నాలను అడ్డుకోవడం, తప్పుడు సమాచారం వ్యాప్తిని అరికట్టడమే లక్ష్యంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) చేసిన సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. అయితే, కేంద్రం నిర్ణయాన్ని టెలిగ్రామ్ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు బుధు, గురువారం విచారణ జరిపింది.
ఈ సందర్భంగా టెలిగ్రామ్‌పై కేంద్రం తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ యాప్ డార్క్ వెబ్‌గా మారుతున్నదని, ఈ యాప్‌ను వినియోగిస్తున్న నేరగాళ్లు, సైబర్ మోసగాళ్లు, తీవ్రవాద సమూహాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నదని ఢిల్లీ హైకోర్టుకు తెలియజేసింది. టెలిగ్రామ్ (Telegram) చట్టవిరుద్ధ కార్యకలాపాలకు, సైబర్ నేరాలకు ప్రధాన వేదికగా మారిందని ఆరోపించింది. ఇక రెండు రోజులపాటూ వరుసగా వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు వెకేషన్ బెంచ్.. గురువారం తన తీర్పును రిజర్వ్ చేసింది.
నేడు తీర్పు వెలువరించింది. కేంద్రం నిర్ణయాన్ని సమర్థించింది. తప్పుడు సమాచార వ్యాప్తి కట్టడికి టెలిగ్రామ్‌పై తాత్కాలిక ఆంక్షలు అవసరమేనని అభిప్రాయపడింది. టెలిగ్రామ్‌పై బ్యాన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం సమాచార సాంకేతిక (IT) చట్టంలోని సెక్షన్ 69A కింద నిర్దేశించిన విధానాన్ని అనుసరించిందని కోర్టు పేర్కొంది. ఈ మేరకు టెలిగ్రామ్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.
Also Read..
ఒక్క రోజులోనే రూ.36వేలు తగ్గిన బంగారం ధర.. కొనుగోళ్లకు చాన్స్ వచ్చిందా..?
జన్ జడ్ ఆకాంక్షల మేరకు రాహుల్ ప్రధాని కావాలి : మంత్రి పొన్నం
ఐటీ షేర్లు భారీగా పతనం.. తీవ్ర నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..
సంబంధిత వార్తలు

NTA | నీట్ రీటెస్టు.. అభ్యర్థుల కోసం అధికారిక వాట్సప్ సేవలు ప్రారంభించిన ఎన్టీఏ
జూన్ 19, 2026

NEET Aspirant Suicide | మళ్లీ పరీక్ష రాయాలంటే భయంగా ఉంది.. మరో నీట్ విద్యార్థిని ఆత్మహత్య
జూన్ 18, 2026

Pavel Durov Reliance | భారత్‌లో టెలిగ్రామ్ బ్యాన్పై రిలయన్స్, వాట్సప్ కుట్ర! సీఈఓ సంచలన ఆరోపణలు.. అసలు నిజమేంటి?
జూన్ 17, 2026
తాజావార్తలు
- ●Telangana Youth | రాహుల్ గారూ.. మాకిచ్చిన హామీలు మర్చిపోయారు : తెలంగాణ నిరుద్యోగ యువత
- ●WhatsApp | వాట్సాప్‌లో కొత్త వాయిస్ నోట్ విడ్జెట్.. యాప్ ఓపెన్ చేయకుండానే మెసేజ్ పంపే అవకాశం..
- ●Tunga Balu | ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి: తుంగ బాలు డిమాండ్
- ●Hyderabad | మైనర్ బాలుడికి కారు స్టీరింగ్ ఇచ్చి.. కటకటాలపాలైన తండ్రి
- ●Maharashtra Teachers Arrest | పాఠశాలలో పాకిస్థానీ పాట.. ప్రిన్సిపల్, ఇద్దరు టీచర్లపై కేసు
- ●Paraquat | పారాక్వాట్ గడ్డి మందుపై వైద్యుల ఆందోళన.. పూర్తిగా నిషేధించాల్సిందే అంటున్న నిపుణులు..

Telangana Youth | రాహుల్ గారూ.. మాకిచ్చిన హామీలు మర్చిపోయారు : తెలంగాణ నిరుద్యోగ యువత

WhatsApp | వాట్సాప్‌లో కొత్త వాయిస్ నోట్ విడ్జెట్.. యాప్ ఓపెన్ చేయకుండానే మెసేజ్ పంపే అవకాశం..

Tunga Balu | ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి: తుంగ బాలు డిమాండ్

Hyderabad | మైనర్ బాలుడికి కారు స్టీరింగ్ ఇచ్చి.. కటకటాలపాలైన తండ్రి



