Bhatti Vikramarka | వీకెండ్ హెలీకాప్టర్ టూరిజాన్ని డెవలప్ చేద్దాం
Bhatti Vikramarka | టెంపుల్, ఎకో, హెల్త్ టూరిజంలో దూకుడు పెంచుతూ వీకెండ్స్ హెలీకాప్టర్ పర్యాటకానికి ప్రణాళికలు రచించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. ప్రభుత్వానికి ఆదాయ వనరులు తెచ్చే రంగాలపై దృష్టి పెట్టాలని చెప్పారు. మన వనరులే మన పెట్టుబడి అని ఆయన పునరుద్ఘాటించారు.
- మన వనరులే మన పెట్టుబడి
- గోవా, కేరళ పర్యాటకాన్ని బాగా ఉపయోగించుకుంటున్నయి
- పొరుగు రాష్ట్రాలకు ఇసుక ఎగుమతిపై అధ్యయనం
- పీపీపీ మోడల్‌లో పర్యాటక ఆస్తుల అభివృద్ధి
- టెంపుల్, ఎకో, హెల్త్ టూరిజంతో ఖజానాకు ఆదాయమే లక్ష్యం
- మంత్రివర్గ ఉప సంఘం సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Bhatti Vikramarka | త్రినేత్ర.న్యూస్: టెంపుల్, ఎకో, హెల్త్ టూరిజంలో దూకుడు పెంచుతూ వీకెండ్స్ హెలీకాప్టర్ పర్యాటకానికి ప్రణాళికలు రచించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. ప్రభుత్వానికి ఆదాయ వనరులు తెచ్చే రంగాలపై దృష్టి పెట్టాలని చెప్పారు. మన వనరులే మన పెట్టుబడి అని ఆయన పునరుద్ఘాటించారు. శుక్రవారం అంబేద్కర్ సచివాలయంలో ఆదాయ వనరుల సమీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం సమావేశంలో ఆయన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్టారావుతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పర్యాటక సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోవాల్సిన అవరం ఉందన్నారు. పర్యాటక కేంద్రాల్లోని ప్రభుత్వ భూములు, స్థలాలను సమర్థవంతంగా వినియోగించి ఖజానాకు ఆదాయాన్ని తీసుకురావాలని సూచించారు. గోవా, కేరళ వంటి రాష్ట్రాలు పర్యాటకాన్ని సమర్థవంతంగా వినియోగించుకుంటున్నాయని చెప్పారు. జీడీపీ పెరుగుదలకు టూరిజం ఉపయోగపడుతోందని చెప్పారు.

శ్రీశైలం, నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్‌లో పర్యటకాన్ని అభివృద్ధి చేసే ప్రాజెక్టులు చేపట్టాలి. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో టూరిజం ఆస్తులు పూర్తి స్థాయిలో వినియోగంలో లేవు. వాటిని పీపీపీ మోడల్లో అభివృద్ధి చేసి సంపద సృష్టించాలి. ఆదాయ సమీకరణలో పర్యాటక ప్రాంతాల్లో మౌలిక వసతులు, అభివృద్ధి కీలక పాత్ర పోషిస్తాయి. దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధి లక్ష్యాల సాధనలో పర్యాటకం కీలక పాత్ర పోషిస్తుంది. ఏకో టూరిజం, హెల్త్, టెంపుల్ టూరిజంలో అవకాశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. పీపీపీ ఆధారిత సమగ్ర పర్యాటక అభివృద్ధి కార్యాచరణ ప్రణాళిక రూపొందించి కేబినెట్ ముందుంచాలి. అందుకు సంబంధించిన విధానపరమైన అంశాలను కేబినెట్ ముందుంచాలి అని డిప్యూటీ సీఎం ఆదేశించారు.
తక్కువ ధరకే రోబో ఇసుక..
లోయర్ మానేరు, అప్పర్ మానేరు, మేడిగడ్డ తదితర ప్రాంతాల్లో జరుగుతున్న పూడికతీత పనులపై కేబినెట్ సబ్ కమిటీ సమీక్ష చేసింది. చట్టపరమైన నిబంధనలు పాటించే క్రషర్లకు అనుమతులు ఇవ్వాలని సబ్ కమిటీ అభిప్రాయపడింది. నిబంధనలు పాటించే క్రషర్ల నిర్వాహకులకు అనుమతులు ఇవ్వాలని సబ్ కమిటీ సూత్రప్రాయంగా నిర్ణయించింది. నది ఇసుకతో పోలిస్తే రోబో శాండ్ తక్కువ ధరకు లభిస్తోందని సబ్ కమిటీ గుర్తించింది. ఇరుగు పోరుగు రాష్ట్రాలకు ఇసుకను ఎగుమతి చేయడంపై సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు సూచించారు.
రాష్ట్రంలో రిజిష్ట్రేషన్ల సంఖ్య గణనీయంగా పెరిగిందని అధికారులు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా స్లాబ్ అధారిత భూముల విలువ సవరణ వల్ల మెరుగైన ఫలితాలు వస్తున్నాయని చెప్పారు. రవాణాశాఖకు సంబంధించి ఆదాయం... వసూళ్లు పెంచేలా తీసుకోవాల్సిన చర్యలపై కేబినెట్ సబ కమిటీ సమీక్షించింది. అందులో భాగంగా బీహెచ్ సిరీస్ రిజిస్ట్రేషన్ల విషయంలో పన్నులపై రాష్ట్ర అధికారాన్ని సమర్థిస్తూ కేరళకు అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చినట్లు సబ్ కమిటీ గుర్తించింది. భారత్ సిరీస్ రిజిస్ట్రేషన్లపై చట్టపరమైన, విధానపరంగా తీసుకోవల్సిన అంశాలపై సబ్ కమిటీ చర్చింది. బీహెచ్ సిరీస్ పన్నుల అంశంపై చర్చించేందుకు దక్షిణాది రాష్ట్రాల రవాణా మంత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. పరిశ్రమల శాఖకు సంబంధించి పారిశ్రామిక భూముల క్రమబద్ధీకరణ కార్యక్రమాల ద్వారా ఆదాయ సమీకరణను సమీక్షించారు.
ఈ సమావేశంలో ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ కమిషనర్ శశాంక, తెలంగాణ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వైస్ ఛైర్మన్-ఎండీ అనుదీప్ దురిశెట్టి, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రెటరీ కృష్ణ భాస్కర్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ స్పెషల్ సెక్రెటరీ రాజీవ్ గాంధీ హనుమంతు, ట్రాన్స్ పోర్ట్ కమిషన్ ఇళాంభర్తి, ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎన్. శ్రీధర్, స్పెషల్ చీఫ్ సెక్రెటరీ వాణి ప్రసాద్, ఇండస్ట్రీస్ డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి, స్పెషల్ సెక్రెటరీ కృష్ణ ఆదిత్య, స్పెషల్ చీఫ్ సెక్రెటరీ వికాస్ రాజ్ తదతరులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Peddapalli | రోడ్ల అభివృద్ధికి భారీగా నిధులు : మంత్రి కోమటిరెడ్డి
- ●Harish Rao | విద్యార్థుల గొంతు పిసికి చంపేస్తరా రేవంత్? వాళ్ల మీద చేయేస్తే చూస్తూ ఉండం
- ●CWC Meeting New Delhi | ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్ కీలక భేటీ: ఆ రెండు అస్త్రాలతో కేంద్రంపై పోరుకు మాస్టర్ ప్లాన్.. రేవంత్ హాజరు
- ●నబీన్ మార్క్ ‘షాక్ థెరపీ’… తెలంగాణ బీజేపీకి ఢిల్లీ పీఠంలో ‘జీరో’ దక్కడానికి 5 కారణాలు ఇవే!
- ●State Museum | వైఎస్సార్ స్టేట్ మ్యూజియానికి పూర్వ వైభవం
- ●Ritika Nayak | కథ నచ్చితేనే ఓకే.. రితికా నాయక్ ప్లాన్ ఇదే

Peddapalli | రోడ్ల అభివృద్ధికి భారీగా నిధులు : మంత్రి కోమటిరెడ్డి

Harish Rao | విద్యార్థుల గొంతు పిసికి చంపేస్తరా రేవంత్? వాళ్ల మీద చేయేస్తే చూస్తూ ఉండం

CWC Meeting New Delhi | ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్ కీలక భేటీ: ఆ రెండు అస్త్రాలతో కేంద్రంపై పోరుకు మాస్టర్ ప్లాన్.. రేవంత్ హాజరు

నబీన్ మార్క్ ‘షాక్ థెరపీ’… తెలంగాణ బీజేపీకి ఢిల్లీ పీఠంలో ‘జీరో’ దక్కడానికి 5 కారణాలు ఇవే!




