త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Supreme Court | ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయసు తగ్గింపుపై పిటిషన్.. విచార‌ణ‌కు సుప్రీం నో

Supreme Court | పార్లమెంటు, రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయ‌డానికి (contesting elections) ఉన్న కనీస వయోపరిమితిని తగ్గించాలని (minimum age for contesting elections) కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు (Supreme Court) నిరాక‌రించింది.

D

National | Published On Nov 28, 2026, 2.31 pm IST

Supreme Court | ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయసు తగ్గింపుపై పిటిషన్.. విచార‌ణ‌కు సుప్రీం నో
Advertisement

Supreme Court | త్రినేత్ర న్యూస్ : పార్లమెంటు, రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయ‌డానికి (contesting elections) ఉన్న కనీస వయోపరిమితిని తగ్గించాలని (minimum age for contesting elections) కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు (Supreme Court) నిరాక‌రించింది. నల్ల సురేష్ రెడ్డి అనే వ్య‌క్తి కేంద్ర ప్రభుత్వం, భారత ఎన్నికల సంఘాన్ని ప్రతివాదులుగా చేరుస్తూ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

విచార‌ణ సంద‌ర్భంగా పిటిష‌న‌ర్ త‌ర‌ఫు న్యాయ‌వాది వాద‌న‌లు వినిపిస్తూ.. రాజ్యాంగంలోని 61వ సవరణ ద్వారా ఓటు హక్కు కనీస వయసును 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించారని గుర్తు చేశారు. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి 25 ఏళ్లు, రాజ్యసభ, శాసనమండలికి పోటీ చేయడానికి 30 ఏళ్ల కనీస వయోపరిమితి కొనసాగుతోందని ధ‌ర్మాస‌నం దృష్టికి తీసుకెళ్లారు. దీన్ని కూడా తగ్గించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరారు.

స్పందించిన ధ‌ర్మాస‌నం.. ఇది విచారణకు తగిన పిటిషన్ కాదని అభిప్రాయ‌ప‌డింది. దీనిపై పిటిషనర్ తరఫు న్యాయవాది స్పందిస్తూ తాము గ‌తంలో ఇచ్చిన విన‌తిప‌త్రంపై (Representation) స్పందించేలా కేంద్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇవ్వాలని కోర‌గా.. ఆ విషయంలో ఆదేశాల కోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 కింద హైకోర్టును ఆశ్రయించవచ్చని సుప్రీంకోర్టు సూచించింది. దీంతో పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని న్యాయవాది కోరగా ధర్మాసనం అందుకు అనుమతిస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది (Dismissed as withdrawn).

Also Read..

నారీ శక్తికి ఇచ్చిన మాటను నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నాం.. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రధాని మోదీ

మోదీ స‌ర్కార్‌కు బూస్ట్‌.. డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు.. యూటర్న్ వెనుక అసలు కారణమిదే..!

మురుగ‌న్‌దే విజ‌యం.. దీపం వివాదం వేళ‌ ప్ర‌ధాని ఆస‌క్తిక‌ర పోస్ట్‌

Advertisement
Advertisement