త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi | మురుగ‌న్‌దే విజ‌యం.. దీపం వివాదం వేళ‌ ప్ర‌ధాని ఆస‌క్తిక‌ర పోస్ట్‌

PM Modi | తిరుప్పరంకుండ్రం (Thiruparankundram) కొండపై నేడు కార్తీక దీపం వెలిగించి తీరాల్సిందేన‌ని దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు ఆదేశించిన నేప‌థ్యంలో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi) ఎక్స్‌లో ఆస‌క్తిక‌ర పోస్టు పెట్టారు. మురుగ‌న్‌దే (Lord Murugan) విజ‌యం అని అర్థం వ‌చ్చేలా తమిళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో "వెట్రివేల్ మురుగనుక్కు అరోగరా!" అని మూడుసార్లు పోస్ట్ చేశారు. ప్ర‌స్తుతం ఈ పోస్టు రాజకీయంగా, ఆధ్యాత్మికంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

D

National | Published On Nov 28, 2026, 12.57 pm IST

PM Modi | మురుగ‌న్‌దే విజ‌యం.. దీపం వివాదం వేళ‌ ప్ర‌ధాని ఆస‌క్తిక‌ర పోస్ట్‌
Advertisement

PM Modi | త్రినేత్ర న్యూస్ : మ‌దురై జిల్లా తిరుప్పరంకుండ్రం (Thiruparankundram) కొండపై ఉన్న వివాదాస్పద దీపతూన్ (Deepathoon) వ‌ద్ద కార్తీక దీపాన్ని (Karthigai Deepam lamp) వెలిగించ‌క‌పోవ‌డంపై వివాదం కొన‌సాగుతోంది. నవంబర్ 24న వివాదాస్ప‌ద దీప‌తూన్ వద్ద కార్తీక దీపాన్ని వెలిగించాల‌ని సుప్రీంకోర్టు ఆదేశించిన‌ప్ప‌టికీ ఆ ఆదేశాలు అమ‌లు కాలేదు. దీంతో ఇవాళ సాయంత్రం దీపాన్ని వెలిగించాల‌ని సుప్రీం ధ‌ర్మాస‌నం స్ప‌ష్టం చేసింది.

ఈ వివాదం నేప‌థ్యంలో మురుగన్‌ను (Lord Murugan) స్మ‌రించుకుంటూ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ఎక్స్‌లో ఆస‌క్తిక‌ర‌ పోస్టు పెట్టారు. సుప్రీం తీర్పును నేరుగా ప్ర‌స్తావించ‌కుండా మురుగ‌న్‌దే విజ‌యం అని అర్థం వ‌చ్చేలా తమిళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో "వెట్రివేల్ మురుగనుక్కు అరోగరా!" అని మూడుసార్లు పోస్ట్ చేశారు. ప్ర‌స్తుతం ఈ పోస్టు రాజకీయంగా, ఆధ్యాత్మికంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇవీ కోర్టు ఆదేశాలు

కాగా, కొండపై ఉన్న వివాదాస్పద దీపతూన్ (Deepathoon) రాతి స్తంభం వద్ద నవంబర్ 24న సాంప్ర‌దాయ కార్తీక దీపాన్ని (Karthigai Deepam lamp) వెలిగించ‌క‌పోవ‌డంపై దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు (Supreme Court) శుక్ర‌వారం తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే. త‌మ ఆదేశాల‌ను క‌చ్చితంగా పాటించి తీరాల్సిందేన‌ని తేల్చి చెప్పింది. కొండ‌పై ఉన్న రాతి స్తంభం వ‌ద్ద రేపు జ్యోతిని వెలిగించాల‌ని ఆదేశించింది. ఉచ్చిపిళ్లయార్ మండపంలో వెలిగించిన అఖండ జ్యోతితోనే.. దీపతూన్ వ‌ద్ద కార్తీక దీపం వెలిగించాలని అధికారుల‌ను ఆదేశించింది.

కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో విఫలమైనందుకు తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, మదురై జిల్లా కలెక్టర్, పోలీసు కమిషనర్, ఆలయ ట్రస్టీలకు సుప్రీంకోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది. ఆల‌య ట్ర‌స్టీల బోర్డుపై కూడా ధ‌ర్మాస‌నం తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ధిక్కరించినందుకు గానూ బోర్డును సస్పెండ్ చేస్తూ సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఆలయ నిర్వహణ, దీపం వెలిగించే ప్రక్రియను పర్యవేక్షించేందుకు మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ ఎస్. వైద్యనాథన్, జస్టిస్ ఎస్. పార్థిబన్‌లను రిసీవర్లుగా నియమించింది. ఆలయం, కొండ భద్రతా బాధ్యతలను CRPFకు అప్పగించింది. దర్గాకు వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని ఆదేశించింది.

Also Read..

మోదీ స‌ర్కార్‌కు బూస్ట్‌.. డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు.. యూటర్న్ వెనుక అసలు కారణమిదే..!

మోదీ కేబినెట్‌లోకి సుప్రియా సూలే..? డీలిమిటేష‌న్ మ‌ద్ద‌తు ప్ర‌తిఫ‌లంగా ఎన్సీపీకి కీల‌క ప‌ద‌వులు..!

ఎక్స్‌లో కొత్త ఫీచర్.. 18 నెలల ముందే పోస్టుల షెడ్యూలింగ్..

Advertisement
Advertisement