Supreme Court | 135 ఏళ్ల చరిత్ర కలిగిన సెంట్రల్ సెక్రటేరియట్ లైబ్రరీ తరలింపు.. కేంద్రానికి సుప్రీం నోటీసులు
Supreme Court | సెంట్రల్ సెక్రటేరియట్ లైబ్రరీ (Central Secretariat Library) తరలింపుపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) ఆందోళన వ్యక్తం చేసింది. లైబ్రరీ ప్రత్యామ్నాయ ఏర్పాటు కోసం కేటాయించదలచిన స్థలం ఎంత..? దాని వాస్తవ లేఅవుట్ ప్లాన్‌లు ఏమిటి..? అనే పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.
Supreme Court | త్రినేత్ర న్యూస్ : సెంట్రల్ విస్టా పునరాభివృద్ధి (Central Vista Plan) ప్రాజెక్ట్‌లో భాగంగా.. దాదాపు 8.5 లక్షలకు పైగా పుస్తకాలతో 135 ఏళ్ల చరిత్ర కలిగిన ఢిల్లీలోని 'సెంట్రల్ సెక్రటేరియట్ లైబ్రరీ' (Central Secretariat Library) తరలింపుపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది. లైబ్రరీ ప్రత్యామ్నాయ ఏర్పాటు కోసం కేటాయించదలచిన స్థలం ఎంత..? దాని వాస్తవ లేఅవుట్ ప్లాన్‌లు ఏమిటి..? అనే పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.
ప్రస్తుతం శాస్త్రి భవన్‌లో నాలుగు అంతస్తుల్లో దాదాపు 5,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ లైబ్రరీలో దాదాపు 8.5 లక్షలకు పైగా పుస్తకాలు, అరుదైన అధికారిక రికార్డులు ఉన్నాయి. అయితే కొత్తగా కర్తవ్య భవన్-2 లో కేవలం 300 చదరపు మీటర్ల పరిధిలోని రెండు చిన్న గదులను మాత్రమే కేటాయించారంటూ జాతీయ మీడియాలో వరుస కథనాలు వచ్చాయి. దీనిపై స్పందించిన ధర్మాసనం ఈ కేసును సుమోటోగా విచారణకు స్వీకరించింది. విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి (Additional Solicitor General Aishwarya Bhati) వాదనలు వినిపించారు. సెంట్రల్ విస్టా పునరాభివృద్ధి ప్రణాళికలోనే లైబ్రరీ కోసం తగిన స్థలాన్ని కేటాయించినట్లు కోర్టుకు తెలిపారు. ఇందుకు సంబంధించి నిర్మాణ ప్రక్రియ కొనసాగుతోందని స్పష్టం చేశారు.
స్పందించిన జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ సంజీవ్ సచ్‌దేవాలతో కూడిన ధర్మాసనం.. "ఇది 1891 నాటి లైబ్రరీ. ఇందులో 1802 నాటి రచనలు కూడా ఉన్నాయి. మనం డిజిటలైజేషన్ పేరుతో కాగితం వాడకాన్ని తగ్గించుకుంటున్నామని చెప్పడం వేరు.. అంత విలువైన చారిత్రక పత్రాలను నిర్లక్ష్యం చేయడం సరికాదు" అని స్పష్టం చేసింది. నాలుగు అంతస్తుల్లో విస్తరించి, సుమారు 8.5 లక్షల పుస్తకాలు, అరుదైన పత్రాలు కలిగిన అతిపెద్ద ప్రభుత్వ లైబ్రరీకి.. కర్తవ్య భవన్‌లో కేవలం రెండు గదులు మాత్రమే ఎలా కేటాయిస్తారు..? అని ప్రశ్నించింది. లైబ్రరీని భద్రపరచడానికి కేటాయించబోయే మొత్తం స్థలం వివరాలు, భవన లేఅవుట్ ప్లాన్‌ను తమ ముందు ఉంచాలని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఆదేశించింది. కొత్త లైబ్రరీకి సంబంధించి పూర్తి వివరాలతో మూడు వారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను నవంబర్ 16కు వాయిదా వేసింది.
Also Read..
దేశమంతా కదులుతుంది.. ఎంతమందిని అరెస్ట్ చేస్తారు..?
నేను ఎవరి బినామీని కాదు - నాకు ఎవరూ ఆస్తులను గిఫ్ట్‌గా ఇవ్వలేదు - ఐటీ సోదాలపై రకుల్ పోస్ట్
రైల్వేలో 99.6 శాతం విద్యుదీకరణ.. అయినా తగ్గని డీజిల్ ఇంజిన్ల అవసరం..
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Supreme Court | సుప్రీంకోర్టులో జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలు.. 250 పోస్టులతో నోటిఫికేషన్
అక్టోబర్ 4, 2026

One Nation One Election JPC | ‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’ కమిటీ, సుప్రీంకోర్టు జడ్జీల భేటీ?: రాజ్యాంగ విరుద్ధమంటూ కపిల్ సిబల్ ఫైర్
అక్టోబర్ 1, 2026

Mamata Banerjee | మమత వర్గానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ
అక్టోబర్ 1, 2026
తాజావార్తలు
- ●Diesel Locomotives | రైల్వేలో 99.6 శాతం విద్యుదీకరణ.. అయినా తగ్గని డీజిల్ ఇంజిన్ల అవసరం..
- ●MrBeast | రూ.9 కోట్ల కోసం.. మొత్తం గ్రాసరీ స్టోర్ తినేయాలట..
- ●Rakul Preet Singh | నేను ఎవరి బినామీని కాదు - నాకు ఎవరూ ఆస్తులను గిఫ్ట్‌గా ఇవ్వలేదు - ఐటీ సోదాలపై రకుల్ పోస్ట్
- ●Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో అనిశ్చితి.. మార్పు లేకుండా కొనసాగుతున్న బంగారం, వెండి ధరలు..
- ●CJP | దేశమంతా కదులుతుంది.. ఎంతమందిని అరెస్ట్ చేస్తారు..?
- ●Janhvi Kapoor | ఆమె శరీరం...ఆమె నిర్ణయం...డీప్‌ఫేక్ వీడియోలపై జాన్వీకపూర్ రియాక్షన్ - తెలుగు డైరెక్టర్లపై సెటైర్స్!

Diesel Locomotives | రైల్వేలో 99.6 శాతం విద్యుదీకరణ.. అయినా తగ్గని డీజిల్ ఇంజిన్ల అవసరం..

MrBeast | రూ.9 కోట్ల కోసం.. మొత్తం గ్రాసరీ స్టోర్ తినేయాలట..

Rakul Preet Singh | నేను ఎవరి బినామీని కాదు - నాకు ఎవరూ ఆస్తులను గిఫ్ట్‌గా ఇవ్వలేదు - ఐటీ సోదాలపై రకుల్ పోస్ట్

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో అనిశ్చితి.. మార్పు లేకుండా కొనసాగుతున్న బంగారం, వెండి ధరలు..



