త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rakul Preet Singh | నేను ఎవ‌రి బినామీని కాదు – నాకు ఎవ‌రూ ఆస్తుల‌ను గిఫ్ట్‌గా ఇవ్వ‌లేదు – ఐటీ సోదాల‌పై ర‌కుల్ పోస్ట్‌

ముంబైలోని హీరోయిన్ ర‌కుల్‌ప్రీత్‌సింగ్‌తో పాటు ఆమె భ‌ర్త వ‌సు భ‌గ్నానీ ఆఫీస్‌ల‌పై ఐటీ సోదాలు జ‌రిగాయి. ఈ ఐటీ సోదాల‌పై ర‌కుల్ ప్రీత్ సింగ్ రియాక్ట్ అయ్యింది. త‌ను ఎవ‌రికి బినామీని కాద‌ని అన్న‌ది. గాడ్‌ఫాద‌ర్‌లు ఎవ‌రూ లేకుండా క‌ష్ట‌ప‌డే తాను ఈ స్థాయికి చేరుకున్న‌ట్లు చెప్పింది.

N

Entertainment | Published On Oct 5, 2026, 11.54 am IST

Rakul Preet Singh | నేను ఎవ‌రి బినామీని కాదు –  నాకు ఎవ‌రూ ఆస్తుల‌ను గిఫ్ట్‌గా ఇవ్వ‌లేదు – ఐటీ సోదాల‌పై ర‌కుల్ పోస్ట్‌
Advertisement

Rakul Preet Singh |  ఇటీవ‌ల హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్‌తో ఆమె భ‌ర్త వ‌సు భ‌గ్నానీ ఆఫీసుల్లో ఐటీ సోదాలు జ‌రిగాయి. విదేశాల‌కు అక్ర‌మంగా నిధుల‌ను మ‌ళ్లించార‌నే అనుమానంతో ఐటీ అధికారులు ర‌కుల్ ఆఫీస్‌ల‌పై దాడులు నిర్వ‌హించిన‌ట్లు వార్త‌లు వినిపించాయి.

ఐటీ సోదాల‌పై...

ఈ ఐటీ సోదాల‌పై ర‌కుల్ ప్రీత్ సింగ్ రియాక్ట్ అయ్యింది. తాను ఎవ‌రికి బినామీని కాద‌ని అన్న‌ది. త‌న‌కు ఎవ‌రూ కోట్ల రూపాయ‌ల విలువైన ఆస్తుల‌ను బ‌హుమ‌తిగా ఇవ్వ‌లేద‌ని అన్న‌ది.

నిజాలు తెలుసుకోకుండా...

నిజానిజాలు నిర్ధారించుకోకుండా కొంద‌రు సంచ‌ల‌నం కోసం అబ‌ద్దాలు, క‌ల్పితాల‌ను వ్యాప్తి చేస్తున్నారు. ఈ ధోర‌ణి నిజంగా దుర‌దృష్ట‌క‌రం. ఐటీ సోదాలు నాపై జ‌ర‌గ‌లేదు. నేను ఆర్మీ బ్యాక్‌గ్రౌండ్ నుంచే వ‌చ్చాను. నా తండ్రి చాలా ఏళ్ల పాటు సైనికుడిగా దేశానికి సేవ చేశారు. నాకు ప‌రిశ్ర‌మ‌లో గాడ్‌ఫాద‌ర్‌లు అంటూ ఎవ‌రూ లేరు. సొంత క‌ష్టాన్ని న‌మ్ముకొనే ఉన్న‌త స్థాయికి వ‌చ్చాను. ప‌న్ను చెల్లింపుల విష‌యంలో ఎప్పుడూ నా బాధ్య‌త‌ను విస్మ‌రించ‌లేదు. ఇర‌వై ఏళ్ల వ‌య‌సు నుంచే క్ర‌మం త‌ప్ప‌కుండా ప‌న్నుల‌న్నింటిని స‌క్ర‌మంగా చెల్లిస్తున్నాను.

బినామీ కాదు...

వ్య‌క్తిగ‌తంగా, ఏ నిర్మాణ సంస్థ త‌రఫున నేను ఎలాంటి నిధుల అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్ప‌డ‌లేదు. విదేశాల‌కు అక్ర‌మంగా బ‌దిలీలు చేయ‌లేదు. ఈ ఆరోప‌ణ‌ల‌తో నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను ఎవ‌రికి బినామీని కాదు. నాకు కొంద‌రు కోట్ల రూపాయ‌ల విలువైన ఆస్తుల‌ను బ‌హుమ‌తిగా ఇచ్చిన‌ట్లు రాస్తున్నారు. అందులో ఎంత మాత్రం నిజంలేదు. నాకు ఎవ‌రూ ఎలాంటి ఆస్తుల‌ను గిఫ్ట్‌గా ఇవ్వ‌లేదు . ఖ‌రీదైన బ‌హుమ‌తుల‌ను స్వీక‌రించే అల‌వాటు నాకు లేదు. ఉద్దేశ‌పూర్వ‌కంగా ఇలాంటి అస‌త్య‌పు వార్త‌ల‌ను ప్ర‌చారం చేయ‌ద్ద‌ని కోరుతున్నాను అంటూ ఈ పోస్ట్‌లో పేర్కొన్న‌ది.

 

Advertisement
Advertisement