త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

SIR | 95 ల‌క్ష‌ల ఓట్లు తొల‌గించార‌నే వార్త అవాస్త‌వం

SIR | తెలంగాణ( Telangana )లో 95 లక్షల ఓట్లు( Votes ) తొలగించారంటూ వచ్చిన వార్తలో వాస్తవం లేదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి( CEC ) స్పష్టం చేశారు.

S

Telangana | Published On Oct 9, 2026, 2.07 pm IST

SIR | 95 ల‌క్ష‌ల ఓట్లు తొల‌గించార‌నే వార్త అవాస్త‌వం
Advertisement

స్ప‌ష్టం చేసిన రాష్ట్ర ప్ర‌ధాన ఎన్నిక‌ల అధికారి

SIR | త్రినేత్ర న్యూస్ : తెలంగాణ( Telangana )లో 95 లక్షల ఓట్లు( Votes ) తొలగించారంటూ వచ్చిన వార్తలో వాస్తవం లేదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి( CEC ) స్పష్టం చేశారు. SIR ప్రక్రియలో భాగంగా 73,39,235 మంది ఓటర్లను ASDD (గైర్హాజరు, ఇతర ప్రాంతాలకు మారినవారు, డూప్లికేట్, మరణించినవారు) కేటగిరీలో చేర్చినట్లు వెల్లడించారు.

మొత్తం 92,88,187 నోటీసులు జారీ చేశారు. 92,23,486 నోటీసులు పంపిణీ చేయగా, మరో 64,701 నోటీసుల పంపిణీ పెండింగ్‌లో ఉంది. ఇప్పటివరకు 82,11,205 విచారణలు పూర్తయ్యాయి. తుది ఓటర్ల జాబితాలో ఉండేందుకు 74,62,851 మంది అర్హులుగా గుర్తించారు. 12,969 మంది ఓటర్లు అనర్హులుగా గుర్తింపు పొందారు. మరో 18,12,367 మంది ఓటర్లపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ ప్రక్రియపై తుది నిర్ణయాలు 2026 న‌వంబ‌ర్ 5వ తేదీ లోపు తీసుకుంటామని ఎన్నికల అధికారి తెలిపారు. 95 లక్షల ఓట్లు తొలగించారనే వార్త వాస్తవానికి దూరంగా ఉందని ప్రెస్‌నోట్‌లో పేర్కొన్నారు.

Advertisement
Advertisement