Srinivas Goud | బీసీ కుల గణన చేసి.. రిజర్వేషన్లు కల్పించాలి
Srinivas Goud | బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలంటే సరైన కులాల గణాంకాలు అవసరమని, సమగ్ర కులగణన లేకపోవడం వల్ల రిజర్వేషన్లకు న్యాయపరమైన సమస్యలు ఎదురవుతున్నాయని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు.
- రాహుల్ ఇచ్చిన హామీ ఏమైంది?
- బీజేపీ సమగ్ర కుల గణన చేపట్టి రిజర్వేషన్లు కల్పించాలి
- జీవో ప్రతులను చించివేస్తున్నాం
- గన్‌పార్క్ వద్ద నిరసనలో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
Srinivas Goud | త్రినేత్ర న్యూస్: బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలంటే సరైన కులాల గణాంకాలు అవసరమని, సమగ్ర కులగణన లేకపోవడం వల్ల రిజర్వేషన్లకు న్యాయపరమైన సమస్యలు ఎదురవుతున్నాయని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించేంత వరకు దేశవ్యాప్త ఉద్యమానికి పూనుకుంటామని హెచ్చరించారు. రిజర్వేషన్లతో పాటు సమగ్ర కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా ఓబీసీ ప్రజా ప్రతినిధుల ఫోరం ఇచ్చిన పిలుపు మేరకు శనివారం గన్‌పార్క్ వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
స్వాతంత్య్రం వచ్చి దాదాపు 80 సంవత్సరాలు గడిచినా బీసీలకు సామాజిక న్యాయం పూర్తిస్థాయిలో అందలేదన్నారు. విద్య, ఉద్యోగాలు, రాజకీయ రంగాల్లో బీసీలు ఇప్పటికీ వెనుకబడి ఉన్నారని తెలిపారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలంటే సరైన కులాల గణాంకాలు అవసరమన్నారు. 1931లో బ్రిటిష్ ప్రభుత్వం బీసీ కులగణన చేపట్టిందని, స్వాతంత్య్రం తర్వాత బీసీల సమగ్ర కులగణనను నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ వర్గాలకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా, కులవృత్తులకే పరిమితం చేసి రాజ్యాధికారంలో తగిన వాటా, విద్యా-ఉద్యోగాల్లో సముచిత రిజర్వేషన్లు కల్పించలేదన్నారు.
ఎస్సీ, ఎస్టీల మాదిరిగానే బీసీలకు కూడా సమగ్ర కులగణన చేపట్టాలని, కులగణనలో ఎలాంటి తప్పులు లేకుండా పారదర్శకంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. రాజకీయ, విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీలకు చట్టబద్ధమైన రిజర్వేషన్లు కల్పించినప్పుడే బీసీలకు నిజమైన న్యాయం జరుగుతుందన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం దేశవ్యాప్తంగా ఉద్యమం కొనసాగుతోందని, అన్ని రాజకీయ పార్టీలు ఈ డిమాండ్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు. బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించేందుకు పార్లమెంటులో బీసీ రిజర్వేషన్ల బిల్లును తీసుకురావాలని, అవసరమైతే పార్లమెంటును స్తంభింపజేసి ఉద్యమించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి బీఆర్‌ఎస్ పార్టీ పార్లమెంటులో ప్రశ్నించడంతో పాటు మద్దతు ప్రకటించిందని గుర్తుచేశారు. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.
రాహుల్ గాంధీ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారని, ఆ హామీని అమలు చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ ముందుకు రావాలని అన్నారు. బీజేపీ కూడా సమగ్ర కులగణన చేపట్టి బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించేందుకు చర్యలు తీసుకుంటే బీసీలు వారికి మద్దతుగా నిలుస్తారని వి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు.
అంతకుముందు బీసీ ప్రజాప్రతినిధుల ఫోరం, బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం, బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో శ్రీనివాస్ గౌడ్, బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం కన్వీనర్ చిరంజీవులు, బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ్ తదితరులు పాల్గొని జీవో ప్రతులను చించివేసి నిరసన తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు వట్టే జానయ్య యాదవ్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ వైస్ చైర్మన్ ఎస్ దుర్గయ్య గౌడ్, రాష్ట్ర కన్వీనర్లు అయిలి వెంకన్న గౌడ్, ఎర్ర సత్యనారాయణ, బైర శేఖర్, అంబాల నారాయణ గౌడ్, బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ అధ్యక్షులు దామోదర్ గౌడ్, లింగేష్ యాదవ్, నీరజ గౌడ్, సుదర్శన్ నేత తదితరులు పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bathukamma | అక్టోబర్ 18న ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ
- ●Harish Rao | కళ్లెదుట నీళ్లున్నా కాలం తెచ్చిన కరువెట్లయితది?
- ●OnePlus Festive Sale | వన్‌ప్లస్ ఫెస్టివ్ సేల్.. రూ.14,999కే 5జి ఫోన్..
- ●Navaratri Brahmotsavam | తిరుమలకు మరోసారి బ్రహ్మోత్సవ శోభ.. నవరాత్రి ఉత్సవాల షెడ్యూల్ ఇదే
- ●Telangana Congress | గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు.. రెండు సీట్లైనా బీసీలకు ఇవ్వండి
- ●Russian army | రష్యా సైన్యం నుంచి 140 మంది భారతీయులకు విముక్తి.. ఆ 55 మంది ఆచూకీ కోసం ప్రయత్నాలు

Bathukamma | అక్టోబర్ 18న ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ

Harish Rao | కళ్లెదుట నీళ్లున్నా కాలం తెచ్చిన కరువెట్లయితది?

OnePlus Festive Sale | వన్‌ప్లస్ ఫెస్టివ్ సేల్.. రూ.14,999కే 5జి ఫోన్..

Navaratri Brahmotsavam | తిరుమలకు మరోసారి బ్రహ్మోత్సవ శోభ.. నవరాత్రి ఉత్సవాల షెడ్యూల్ ఇదే






