Priyanka Kakkar | ఆప్‌కు షాక్.. కాంగ్రెస్‌లో చేరిన ప్రియాంక కక్కర్
Priyanka Kakkar | ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి గట్టి షాక్ తగిలింది. ఆప్ జాతీయ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ (Priyanka Kakkar) పార్టీని వీడారు. ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై ప్రశంసల వర్షం కురిపించారు. నేటి భారత రాజకీయాల్లో అత్యంత నిజాయితీ గల, ధైర్యవంతుడైన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది రాహుల్ గాంధీ మాత్రమేనని అన్నారు.
Priyanka Kakkar | త్రినేత్ర న్యూస్ : ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి గట్టి షాక్ తగిలింది. ఇప్పటికే పలువురు నేతలు ఆప్‌ను వీడిన విషయం తెలిసిందే. మరో కీలక నేత పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. ఆప్ జాతీయ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ (Priyanka Kakkar) పార్టీని వీడారు. ఆమె కాంగ్రెస్ (Congress) పార్టీలో చేరారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాజీవ్ శుక్లా, పవన్ ఖేరా, ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ దేవేందర్ యాదవ్ సమక్షంలో ప్రియాంక కక్కర్ ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. ఆమెతోపాటూ ఉత్తరప్రదేశ్ మాజీ ఎమ్మెల్యే శ్యామ్ సుందర్ శర్మ, రజత్ రాకేష్ తండన్‌లు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
ఈ సందర్భంగా ప్రియాంక కక్కర్ మాట్లాడుతూ.. ఢిల్లీని ప్రగతిశీల, సురక్షిత నగరంగా మార్చగల సామర్థ్యం కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని తాను నమ్ముతున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై ప్రశంసల వర్షం కురిపించారు. రాహుల్ నాయకత్వమే తనను ఆకర్షించిందని చెప్పుకొచ్చారు. నేటి భారత రాజకీయాల్లో అత్యంత నిజాయితీ గల, ధైర్యవంతుడైన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది రాహుల్ గాంధీ మాత్రమేనని అన్నారు. కెమెరాల ముందు కన్నీళ్లు కార్చకుండా ఎంతటి అవమానాలనైనా ఎదుర్కొని ధైర్యంగా నిలబడే నిజమైన నాయకుడని కొనియాడారు. అదే సమయంలో ఆప్ తీరుపై ఆమె తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
"ఒకప్పుడు ఆప్ పార్టీలో ఎవరూ బంగ్లాలు, కార్లు తీసుకోమని చెప్పారు. కానీ తర్వాత ప్రైవేట్ ప్రయాణాల కోసం హెలికాప్టర్లు వాడటం మొదలుపెట్టారు. బూత్ స్థాయిలో కూడా పనిచేయని కొత్త వ్యక్తులను రాజస్థాన్ నుండి తీసుకొచ్చారు. వారికి పంజాబ్‌లో సీనియర్ పదవులు కట్టబెట్టారు. బంగ్లాలు, కార్లు ఇచ్చారు. సమర్థించుకోలేని ఇలాంటి విషయాలను నేను ఎంతకాలం సమర్థించగలను..?" అని ఆప్ తీరుపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
అనంతరం కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ నసీర్ హుస్సేన్ మాట్లాడుతూ.. లడఖ్ నుంచి కన్యాకుమారి వరకు ప్రజలందరూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ నాయకత్వాన్ని నమ్మి పార్టీలో చేరుతున్నారని చెప్పారు. యూపీలో ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన శ్యామ్ సుందర్ శర్మ రాకతో పార్టీ మరింత బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read..
స్టాలిన్ సూట్‌కేట్ భామ వ్యాఖ్యలపై దుమారం.. భగ్గుమన్న నేతలు
రూ.35,990కే ప్రైమ్‌బుక్ 3 మ్యాక్స్.. ఏఐ ఫీచర్లతో కొత్త ల్యాప్‌టాప్..
తాజావార్తలు
- ●Director Shankar | తలకు బ్యాండేజ్‌తో శంకర్ స్టార్ డైరెక్టర్ ఆరోగ్యంపై అభిమానుల్లో ఆందోళన
- ●Copper Prices | రాగి ధరల దూకుడు.. ఈ మెటల్ స్టాక్స్‌కు భారీ లాభాల ఛాన్స్..
- ●Bolarum Arms Theft | బొల్లారం మిలిటరీ ఆయుధాల చోరీ కేసులో బిగ్ ట్విస్ట్: ముగ్గురు జవాన్లు సహా మరో ఏడుగురు అరెస్ట్.. అసలు స్కెచ్ అదే
- ●India Leprosy Cases 2026 | 2027 నాటికి కుష్టు రహిత భారత్ సాధ్యమేనా? చిన్నారుల్లో 3,800కు పైగా కొత్త కేసులు.. బయటపడుతున్న చేదు నిజాలు
- ●Prakash Raj | బీజేపీ అనుకూల ఓట్లు మాత్రమే ఉంటున్నయ్
- ●Telangana Express | ఢిల్లీ బాటలో ఐదు దశాబ్దాలు.. ‘బ్లూ బుల్లెట్’ గోల్డెన్ రన్!

Director Shankar | తలకు బ్యాండేజ్‌తో శంకర్ స్టార్ డైరెక్టర్ ఆరోగ్యంపై అభిమానుల్లో ఆందోళన

Copper Prices | రాగి ధరల దూకుడు.. ఈ మెటల్ స్టాక్స్‌కు భారీ లాభాల ఛాన్స్..

Bolarum Arms Theft | బొల్లారం మిలిటరీ ఆయుధాల చోరీ కేసులో బిగ్ ట్విస్ట్: ముగ్గురు జవాన్లు సహా మరో ఏడుగురు అరెస్ట్.. అసలు స్కెచ్ అదే

India Leprosy Cases 2026 | 2027 నాటికి కుష్టు రహిత భారత్ సాధ్యమేనా? చిన్నారుల్లో 3,800కు పైగా కొత్త కేసులు.. బయటపడుతున్న చేదు నిజాలు






