Supreme Court | విద్యార్థి నిరసనకారులపై హింసాత్మక చర్యలొద్దు.. సంయమనం పాటించాలి : సుప్రీంకోర్టు
Supreme Court | శాంతియుతంగా నిరసన తెలుపుతున్న యువ విద్యార్థుల పట్ల పోలీసులు, భద్రతా బలగాలు సంయమనంతో వ్యవహరించాలని సుప్రీంకోర్టు (Supreme Court) పేర్కొంది.
Supreme Court | త్రినేత్ర.న్యూస్ : శాంతియుతంగా నిరసన తెలుపుతున్న యువ విద్యార్థుల పట్ల పోలీసులు, భద్రతా బలగాలు సంయమనంతో వ్యవహరించాలని సుప్రీంకోర్టు (Supreme Court) పేర్కొంది. నిరసనలను అదుపు చేసే క్రమంలో అధికారుల నుంచి ఎలాంటి హింసాత్మక ప్రతిస్పందన వచ్చినా అది పరిస్థితిని మరింత దిగజారుస్తుందని సర్వోన్నత న్యాయస్థానం హెచ్చరించింది.
ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా జరిగిన విద్యార్థి ఆందోళనల్లో (CJP Protests) హింసాత్మక, రాళ్లదాడి ఘటనలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ (CJI Surya Kant) నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. విద్యార్థి నిరసనకారుల విషయంలో ప్రభుత్వాలు వెనక్కి తగ్గకూడదని, రాజకీయ లబ్ధికోసం వ్యవహరించడం ప్రమాదకరమని విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. ఈ సందర్భంగా రాజస్థాన్‌లో జరిగిన శాంతిభద్రతల సంఘటనను ప్రస్తావించారు. ఆందోళనకారులను సముదాయించేందుకు ప్రభుత్వాలు వెనక్కి తగ్గే ధోరణి అవలంభించకూడదన్నారు. రేపు ఇతర రాష్ట్రాల్లో విద్యార్థులు ఆందోళనకు దిగి, రాళ్లు రువ్వితే అక్కడి ప్రభుత్వాలు కూడా వెనక్కి తగ్గాల్సి వస్తుందన్నారు.
వాదనలు విన్న సీజేఐ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. దారి తప్పిన మూకలు రాళ్ల దాడులకు పాల్పడినప్పటికీ యువతను శాంతింపజేయడం చాలా ముఖ్యమని అభిప్రాయపడింది. వారికి సలహాలు, కౌన్సెలింగ్ అవసరమని పేర్కొంది. ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి దూకుడు చర్యలైనా సమాజంలో పరిస్థితిని మరింత దిగజార్చి హింసకు దారితీస్తాయని చెప్పింది. "ప్రజాస్వామ్యంలో ఇలాంటి శాంతియుత ప్రదర్శనల సమయంలో పోలీసులు, భద్రతా సిబ్బంది సంయమనం పాటించాలి. యువత హింస వైపు మళ్లకుండా అధికారులు పరిస్థితిని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. అధికారుల నుంచి హింసాత్మక ప్రతిస్పందన వస్తే అది పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మారుస్తుంది" అని ధర్మాసనం పేర్కొంది.
ముందు ఆందోళన చేస్తున్న యువత ఏం చెబుతుందో వినాలని పోలీసులు, భద్రతా సిబ్బందికి సీజేఐ ధర్మాసనం సూచించింది. ఆందోళ చేస్తున్న యువత ఎందుకు ఆందోళన చేస్తున్నారు..? వారు ఏమి చెబుతున్నారో వినడమే అత్యంత శక్తివంతమైన పరిష్కారామని వ్యాఖ్యానించింది. నిరసనల సమయంలో ఆగ్రహం, దూకుడు తగవని వ్యాఖ్యానించింది. పరిస్థితిని ఎలా చక్కదిద్దాలనే అంశాన్ని లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీల విజ్ఞతకే వదిలేస్తున్నామని పేర్కొంది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ వాదనలను కూడా పరిశీలిస్తామని తెలిపింది. ఈ మేరకు విచారణను వాయిదా వేసింది.
Also Read..
గూగుల్‌కు పోటీగా అదానీ భారీ ప్లాన్.. ఒడిశాలో రూ.1 లక్ష కోట్ల ఏఐ డేటా సెంటర్..
అసహ్యకరమైన కంటెంట్‌ను తొలగించండి.. ఈ20 వివాదంలో నితిన్ గడ్కరీకి ఊరట
సంబంధిత వార్తలు

Vande Mataram Supreme Court | వందేమాతరం పాడకపోతే క్రిమినల్ నేరమా? కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీం కోర్టు
సెప్టెంబర్ 22, 2026

Supreme Court | కావేరి జలాల వివాదం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
సెప్టెంబర్ 22, 2026

Dharmasthala Case | మరోసారి తెరపైకి ధర్మస్థల హత్యాచార కేసు.. సుప్రీం కీలక ఆదేశాలు
సెప్టెంబర్ 21, 2026
తాజావార్తలు
- ●High-Rise Apartment Struggles | "పక్షులు కూడా మనుషులను వింతగా చూస్తాయి!" - 20వ అంతస్తులో నివసించే వారి విచిత్ర కష్టాలపై వీడియో వైరల్
- ●Personal Loan | ఒకేసారి ఎన్ని వ్యక్తిగత రుణాలు తీసుకోవచ్చు? ఇలా చేస్తే ఆర్థిక భారం తప్పదు..
- ●Traffic Restrictions | గణేశ్ నిమజ్జనం.. కూకట్‌పల్లిలో ట్రాఫిక్ ఆంక్షలు
- ●Vinay Bhaskar | వరంగల్ ఎంజీఎం వద్ద తీవ్ర ఉద్రిక్తత.. తోపులాటలో వినయ్ భాస్కర్ కంటతడి
- ●IIT Bombay | ఐఐటీ బాంబే హాస్టల్ గదుల్లో సీలింగ్ ఫ్యాన్లు తొలగింపు.. విద్యార్థుల వరుస ఆత్మహత్యలతో యాజమాన్యం కీలక నిర్ణయం
- ●iPhone 18 Pro Snatching | 'ఇది కొత్త ఐఫోనా?' అని అడిగి.. ఆటోలో వెళ్తున్న యువతి చేతిలో నుంచి ఐఫోన్ 18 ప్రో లాక్కెళ్లిన దొంగలు

High-Rise Apartment Struggles | "పక్షులు కూడా మనుషులను వింతగా చూస్తాయి!" - 20వ అంతస్తులో నివసించే వారి విచిత్ర కష్టాలపై వీడియో వైరల్

Personal Loan | ఒకేసారి ఎన్ని వ్యక్తిగత రుణాలు తీసుకోవచ్చు? ఇలా చేస్తే ఆర్థిక భారం తప్పదు..

Traffic Restrictions | గణేశ్ నిమజ్జనం.. కూకట్‌పల్లిలో ట్రాఫిక్ ఆంక్షలు

Vinay Bhaskar | వరంగల్ ఎంజీఎం వద్ద తీవ్ర ఉద్రిక్తత.. తోపులాటలో వినయ్ భాస్కర్ కంటతడి



