త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Prakash Raj | బీజేపీ అనుకూల ఓట్లు మాత్ర‌మే ఉంటున్న‌య్

Prakash Raj | ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై నటుడు ప్రకాశ్ రాజ్ తీవ్రంగా స్పందించారు. బీజేపీ అనుకూల ఓట్లు మాత్ర‌మే స‌ర్ జాబితాలో ఉంటున్నాయ‌ని ఆయ‌న ఆరోపించారు.

S

Telangana | Published On Oct 3, 2026, 4.15 pm IST

Prakash Raj | బీజేపీ అనుకూల ఓట్లు మాత్ర‌మే ఉంటున్న‌య్
Advertisement

ద‌ళితులు, ముస్లింల ఓట్లు తొల‌గిస్తున్నారు
స‌ర్ తీరుపై ప్ర‌కాశ్ రాజ్ ఫైర్

Prakash Raj | త్రినేత్ర న్యూస్ : ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై నటుడు ప్రకాశ్ రాజ్ తీవ్రంగా స్పందించారు. బీజేపీ అనుకూల ఓట్లు మాత్ర‌మే స‌ర్ జాబితాలో ఉంటున్నాయ‌ని ఆయ‌న ఆరోపించారు. అక్ర‌మంగా ఓట్ల‌ను తొల‌గిస్తున్న సీఈసీ జ్ఞానేశ్ కుమార్ త‌క్ష‌ణ‌మే రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేశారు. శ‌నివారం హైద‌రాబాద్‌లో ప్ర‌కాశ్ రాజ్ మీడియాతో మాట్లాడారు.

బతికుండగానే ఓట్లు తొలగించారని కొంత మంది ఓట‌ర్లు చెబుతున్నారు. ఎవరి ఓట్లు ఉంచాలన్నది బీజేపీ కార్యాలయం నుంచి లిస్ట్‌ వెళ్తోంది. ఆ పార్టీ అనుకూల ఓట్లు మాత్రమే ఉంటున్నాయి. అక్రమ చొరబాటుదారులుంటే ఇన్నేళ్లుగా ఏం చేశారు? కేంద్రహోంశాఖ ఏం చర్యలు తీసుకుంది? అని ప్ర‌కాశ్ రాజ్ నిల‌దీశారు.

ఓటర్ల షిఫ్టింగ్ జరిగితే.. మొత్తంగా ఓటర్ల సంఖ్య తగ్గొద్దు కదా అని అడిగారు. ప్రజలు అందుబాటులో లేకపోతే ఓటు తీసేస్తారా అంటూ ఫైర్ అయ్యారు. ఉపాధి కోసం వలస వెళ్తే.. ఇంట్లో లేరని ఓట్లు తొలగించారని ఆరోపించారు. దళితులు, ముస్లింల ఓట్లు తొలగించడమే వారి ప్రధాన అజెండా అంటూ ప్రకాశ్ రాజ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Advertisement
Advertisement