Telangana Express | ఢిల్లీ బాటలో ఐదు దశాబ్దాలు.. ‘బ్లూ బుల్లెట్’ గోల్డెన్ రన్!
Telangana Express | ఐదు దశాబ్దాలుగా పట్టాలపై పరుగులు.. తరాలు మారినా చెక్కుచెదరని ప్రయాణం.. ఒకప్పుడు వేగానికి ‘బ్లూ బుల్లెట్’గా పేరు.. ఇప్పుడు తెలంగాణకు ఢిల్లీతో అనుబంధాన్ని మోసుకెళ్తున్నది. 1976 అక్టోబర్ 3న ‘ఆంధ్రప్రదేశ్ ఎక్స్‌ప్రెస్’గా మొదలైన హైదరాబాద్–ఢిల్లీ రైలు.. నేడు ‘తెలంగాణ ఎక్స్‌ప్రెస్’గా 50 ఏళ్ల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు శనివారం కేక్ కట్ చేసి సంబురాలు నిర్వహించారు.
- హైదరాబాద్–ఢిల్లీ రైలు ప్రయాణానికి 50ఏళ్ల అనుబంధం
- 1976లో ‘ఆంధ్రప్రదేశ్ ఎక్స్‌ప్రెస్’గా పట్టాలెక్కిన రైలు
- 2015లో ‘తెలంగాణ ఎక్స్‌ప్రెస్’గా నామకరణం
- తెలంగాణ ఎక్స్‌ప్రెస్ అద్భుత ప్రస్థానం ఇదీ..
Telangana Express | ఐదు దశాబ్దాలుగా పట్టాలపై పరుగులు.. తరాలు మారినా చెక్కుచెదరని ప్రయాణం.. ఒకప్పుడు వేగానికి ‘బ్లూ బుల్లెట్’గా పేరు.. ఇప్పుడు తెలంగాణకు ఢిల్లీతో అనుబంధాన్ని మోసుకెళ్తున్నది. 1976 అక్టోబర్ 3న ‘ఆంధ్రప్రదేశ్ ఎక్స్‌ప్రెస్’గా మొదలైన హైదరాబాద్–ఢిల్లీ రైలు.. నేడు ‘తెలంగాణ ఎక్స్‌ప్రెస్’గా 50 ఏళ్ల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు శనివారం కేక్ కట్ చేసి సంబురాలు నిర్వహించారు.

ఆంధ్రప్రదేశ్ ఎక్స్‌ప్రెస్‌గా తొలి అడుగు..
1976 అక్టోబర్ 3న అప్పటి కేంద్ర రైల్వే మంత్రి మధు దండావతే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ఈ రైలును ప్రారంభించారు. అప్పట్లో ఈ మార్గంలో నడిచిన అత్యంత వేగవంతమైన సూపర్‌ఫాస్ట్ రైళ్లలో ఇది ఒకటి. ఆక్స్‌ఫర్డ్ బ్లూ, గోల్డ్ రంగులతో ప్రత్యేకంగా కనిపించే కోచ్‌లు రైలుకు మరో గుర్తింపును తెచ్చాయి. దీంతో ప్రయాణికులు, రైల్వే అభిమానులు దీన్ని ముద్దుగా ‘బ్లూ బుల్లెట్’ అని పిలిచేవారు. రాజధాని ఎక్స్‌ప్రెస్ రాకముందు తెలుగు నేల నుంచి ఢిల్లీకి వెళ్లిన ఫాస్టెస్ట్, ప్రతిష్టాత్మక రైళ్లలో ఇదొకటిగా నిలిచింది. ప్రారంభంలో ఈ రైలుకు కాజీపేట జంక్షన్ మాత్రమే హాల్ట్‌గా ఉండేది. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా తర్వాత రామగుండం, 1991లో మంచిర్యాల, ఆపై బెల్లంపల్లి స్టాప్‌లు చేరాయి. ప్రస్తుతం ఈ మార్గంలో మరో కీలక స్టేషన్ పెద్దపల్లి జంక్షన్‌లో హాల్ట్ ఇవ్వాలన్న డిమాండ్లు ఉన్నాయి. ప్రస్తుతం ఈ రైలు హైదరాబాద్ డెక్కన్ (నాంపల్లి) నుంచి బయలుదేరి సికింద్రాబాద్, కాజీపేట జంక్షన్, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్‌నగర్, బల్హార్షా, నాగ్‌పూర్ జంక్షన్, ఇటార్సీ జంక్షన్, భోపాల్ జంక్షన్, వీరంగన లక్ష్మీభాయి ఝాన్సీ జంక్షన్, గ్వాలియర్ జంక్షన్, ఆగ్రా కాంట్, మధుర జంక్షన్, హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్ల మీదుగా ఢిల్లీకి చేరుతుంది.
14 బోగీల నుంచి 24.. వేగం కూడా మారింది..
రైలు రూపురేఖలు, సామర్థ్యంలోనూ కాలానుగుణంగా మార్పులు వచ్చాయి. తొలినాళ్లలో ఒక డీజిల్ లోకోతో 14 కోచ్‌లతో నడిచేది. ప్రయాణికుల సంఖ్య పెరగడంతో 1981 నాటికి రెండు డీజిల్ లోకోలతో 21 కోచ్‌లకు పెంచారు. ప్రస్తుతం 24 కోచ్‌లతో రైలు దూసుకుపోతున్నది. లాలాగూడ లోకో షెడ్‌కు చెందిన ఎలక్ట్రిక్ లోకో ఈ రైలును లాగుతోంది. సింగిల్ లైన్ ట్రాక్‌లు, పాత సిగ్నలింగ్ వ్యవస్థ ఉన్న రోజుల్లోనూ హైదరాబాద్–ఢిల్లీ ప్రయాణాన్ని ఈ రైలు 23 గంటల్లోపే పూర్తి చేసేది. ప్రస్తుతం సుమారు 1,677 కిలోమీటర్లు ప్రయాణిస్తూ 16 స్టాప్‌లలో ఆగుతోంది. న్యూఢిల్లీ చేరేందుకు దాదాపు 26 గంటల 30 నిమిషాలు పడుతోంది. కాలక్రమంలో పెరిగిన హాల్ట్‌లు ప్రయాణ సమయం పెరగడానికి కారణం.

మారింది పేరే.. అనుబంధం మాత్రం అదే
దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ‘ఆంధ్రప్రదేశ్ ఎక్స్‌ప్రెస్’గానే కొనసాగిన ఈ రైలు.. రాష్ట్ర విభజన తర్వాత కొత్త గుర్తింపును సంతరించుకుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో పేరు మార్చాలన్న డిమాండ్లు వెల్లువెత్తాయి. దీంతో 2015 నవంబర్ 15న రైల్వే శాఖ అధికారికంగా ‘తెలంగాణ ఎక్స్‌ప్రెస్’గా పేరు మార్చింది. తాజాగా ఈ రైలు ఐదు దశాబ్దాల ప్రయాణాన్ని పూర్తి చేసుకోవడం దక్షిణ మధ్య రైల్వేకు ప్రత్యేక మైలురాయిగా నిలిచింది. రైలును ఇన్నేళ్లుగా నడిపించడంలో రైల్వే ఉద్యోగుల సేవలను ఈ సందర్భంగా అధికారులు గుర్తు చేశారు. దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పీఆర్వో శ్రీధర్.. గోల్డెన్ జూబ్లీ సందర్భంగా ఈ ప్రయాణం తమ జోన్‌కు గర్వకారణమని పేర్కొన్నారు. ‘బ్లూ బుల్లెట్’గా మొదలై.. ‘తెలంగాణ ఎక్స్‌ప్రెస్’గా మారినా.. ఐదు దశాబ్దాలుగా హైదరాబాద్–ఢిల్లీ మధ్య సాగుతున్న ఈ రైలు ప్రయాణం మాత్రం కొనసాగుతూనే ఉన్నది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Director Shankar | తలకు బ్యాండేజ్‌తో శంకర్ స్టార్ డైరెక్టర్ ఆరోగ్యంపై అభిమానుల్లో ఆందోళన
- ●Copper Prices | రాగి ధరల దూకుడు.. ఈ మెటల్ స్టాక్స్‌కు భారీ లాభాల ఛాన్స్..
- ●Bolarum Arms Theft | బొల్లారం మిలిటరీ ఆయుధాల చోరీ కేసులో బిగ్ ట్విస్ట్: ముగ్గురు జవాన్లు సహా మరో ఏడుగురు అరెస్ట్.. అసలు స్కెచ్ అదే
- ●India Leprosy Cases 2026 | 2027 నాటికి కుష్టు రహిత భారత్ సాధ్యమేనా? చిన్నారుల్లో 3,800కు పైగా కొత్త కేసులు.. బయటపడుతున్న చేదు నిజాలు
- ●Prakash Raj | బీజేపీ అనుకూల ఓట్లు మాత్రమే ఉంటున్నయ్
- ●Srinivas Goud | బీసీ కుల గణన చేసి.. రిజర్వేషన్లు కల్పించాలి

Director Shankar | తలకు బ్యాండేజ్‌తో శంకర్ స్టార్ డైరెక్టర్ ఆరోగ్యంపై అభిమానుల్లో ఆందోళన

Copper Prices | రాగి ధరల దూకుడు.. ఈ మెటల్ స్టాక్స్‌కు భారీ లాభాల ఛాన్స్..

Bolarum Arms Theft | బొల్లారం మిలిటరీ ఆయుధాల చోరీ కేసులో బిగ్ ట్విస్ట్: ముగ్గురు జవాన్లు సహా మరో ఏడుగురు అరెస్ట్.. అసలు స్కెచ్ అదే

India Leprosy Cases 2026 | 2027 నాటికి కుష్టు రహిత భారత్ సాధ్యమేనా? చిన్నారుల్లో 3,800కు పైగా కొత్త కేసులు.. బయటపడుతున్న చేదు నిజాలు






