Supreme Court | బాణసంచాపై సంపూర్ణ నిషేధం కుదరదు : సుప్రీంకోర్టు
Supreme Court | ఢిల్లీలో బాణసంచా కాల్చడం (firecrackers)పై పూర్తి నిషేధం విధించే ప్రసక్తే లేదని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) స్పష్టం చేసింది. అలా అని రోజంతా 24 గంటలూ బాణసంచా కాల్చడానికి అనుమతించలేమని ధర్మాసనం పేర్కొంది.
Supreme Court | త్రినేత్ర న్యూస్ : దేశ రాజధాని ఢిల్లీలో బాణసంచా కాల్చడం (firecrackers)పై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. బాణసంచా వినియోగం విషయంలో పర్యావరణ పరిరక్షణకు, సాంప్రదాయాల కొనసాగింపునకు మధ్య సమతుల్యత అవసరమని స్పష్టం చేసింది. టపాసులు కాల్చడంపై పూర్తి నిషేధం విధిస్తే ప్రజల మనోభావాలు దెబ్బతింటాయని వ్యాఖ్యానించింది. అలా అని రోజంతా 24 గంటలూ బాణసంచా కాల్చడానికి అనుమతించలేమని ధర్మాసనం పేర్కొంది. ఈ సమస్యకు ఓ పరిష్కారం కనుగొనాలని వ్యాఖ్యానించింది.
ఢిల్లీలో వాయుకాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్న నేపథ్యంలో బాణసంచా కాల్చడంపై దాఖలైన పిటిషన్లపై జస్టిస్ ఎం.ఎం. సుందరేష్, జస్టిస్ పి.బి. వరాలేలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. "మేము ఈ విషయంలో స్పష్టతనిస్తున్నాం. సంపూర్ణ నిషేధానికి తావులేదు. అలాగని బాణసంచా కాల్చేందుకు రోజంతా అనుమతించే ప్రసక్తే లేదు. పూర్తిగా నిషేధిస్తే కొన్ని వర్గాల మనోభావాలు దెబ్బతింటాయి. అదే సమయంలో రోజంతా అనుమతిస్తే వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు, చిన్నారులు సహా ప్రతి ఒక్కరిపై తీవ్ర ప్రభావం పడుతుంది. అందుకే బాణసంచా కాల్చడానికి నిర్దిష్ట సమయాలను, అనుమతించదగిన బాణసంచా రకాలను నిర్ణయించడం ద్వారా ఈ సమస్యకు ఓ పరిష్కారాన్ని కనుగొనాలి" అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
Also Read..
జ్ఞానేశ్ రాజీనామా చేయాల్సిందే.. ‘సేవ్ డెమొక్రసీ’ నిరసనలకు పిలుపునిచ్చిన ఇండీ కూటమి
స్టాక్ మార్కెట్లు మళ్లీ పతనం.. తీవ్రమవుతున్న అమ్మకాల ఒత్తిడి..
తీవ్ర విషాదం: ముగ్గురు కొడుకులున్నా ఆదరణ కరవు.. బావిలో దూకి వృద్ధ దంపతుల ఆత్మహత్య
సంబంధిత వార్తలు

Uttam Kumar Reddy | కాళేశ్వర పునరుద్ధరణ పనుల్లో ఆర్మీ ఇంజినీర్ల సేవలు వినియోగిస్తాం
సెప్టెంబర్ 29, 2026

Supreme Court | స్కూళ్లలో ర్యాగింగ్‌పై పిల్.. విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణ
సెప్టెంబర్ 29, 2026

Rahul Gandhi | ఒత్తిడి తెస్తేనే ప్రభుత్వాలు స్పందిస్తాయ్.. రండి వీధుల్లోకి వచ్చి మీ గళాన్ని వినిపించండి.. యువతకు రాహుల్ పిలుపు
సెప్టెంబర్ 29, 2026
తాజావార్తలు
- ●Faria Abdullah | డైరెక్షన్ వైపు ఫరియా చూపు.. స్క్రిప్ట్ పనిలో చిట్టీ బిజీబిజీ..!
- ●Dead Rat in Dosa Mumbai | హోటల్లో మసాలా దోశ తింటుండగా షాక్: లోపల చచ్చిన ఎలుక.. వాంతులు చేసుకున్న కస్టమర్
- ●KTR | కేవలం ఎంపీ సీట్లను పెంచడంలో అంతర్యమేంటి..?
- ●KTR | బీజేపీతో పొత్తు ఉండదు.. కేసీఆరే మళ్లీ సీఎం
- ●CS Sanjay Jaju | గేమింగ్, యానిమేషన్‌కు గ్లోబల్ హబ్‌గా హైదరాబాద్ : సీఎస్ సంజయ్ జాజు
- ●Nitin Gadkari Flying Bus | గాల్లో ఎగిరే బస్సు.. నితిన్ గడ్కరీ సరికొత్త ప్లాన్!

Faria Abdullah | డైరెక్షన్ వైపు ఫరియా చూపు.. స్క్రిప్ట్ పనిలో చిట్టీ బిజీబిజీ..!

Dead Rat in Dosa Mumbai | హోటల్లో మసాలా దోశ తింటుండగా షాక్: లోపల చచ్చిన ఎలుక.. వాంతులు చేసుకున్న కస్టమర్

KTR | కేవలం ఎంపీ సీట్లను పెంచడంలో అంతర్యమేంటి..?

KTR | బీజేపీతో పొత్తు ఉండదు.. కేసీఆరే మళ్లీ సీఎం



