Indian Railways | ఆర్ఏసీ ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్.. ఏసీ కోచ్‌లలో పూర్తి బెడ్‌రోల్ తప్పనిసరి..
Indian Railways | భారతీయ రైల్వేలు ఆర్‌ఏసీ (రిజర్వేషన్ అగైనెస్ట్ క్యాన్సిలేషన్) టికెట్‌పై ఏసీ కోచ్‌లలో ప్రయాణించే ప్రయాణికులకు కీలక స్పష్టత ఇచ్చాయి. ఇకపై ఆర్‌ఏసీ టికెట్‌తో ప్రయాణించే వారికి కూడా పూర్తి స్థాయి బెడ్‌రోల్ కిట్‌ను తప్పనిసరిగా అందించాలని అన్ని జోనల్ రైల్వేలకు ఆదేశాలు జారీ అయ్యాయి.
Indian Railways | భారతీయ రైల్వేలు ఆర్‌ఏసీ (రిజర్వేషన్ అగైనెస్ట్ క్యాన్సిలేషన్) టికెట్‌పై ఏసీ కోచ్‌లలో ప్రయాణించే ప్రయాణికులకు కీలక స్పష్టత ఇచ్చాయి. ఇకపై ఆర్‌ఏసీ టికెట్‌తో ప్రయాణించే వారికి కూడా పూర్తి స్థాయి బెడ్‌రోల్ కిట్‌ను తప్పనిసరిగా అందించాలని అన్ని జోనల్ రైల్వేలకు ఆదేశాలు జారీ అయ్యాయి. టికెట్ ఛార్జీలో ఇప్పటికే బెడ్‌రోల్ రుసుము వసూలు చేస్తున్నందున,ధ్రువీకరించిన టికెట్ ఉన్న ప్రయాణికులతో సమానంగా ఆర్‌ఏసీ ప్రయాణికులకూ అదే సౌకర్యాలు కల్పించాలని రైల్వే బోర్డు స్పష్టం చేసింది. ఆగస్టు 4న జారీ చేసిన లేఖలో అన్ని జోనల్ రైల్వేలు ఈ ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలని రైల్వే బోర్డు సూచించింది. ఏసీ చైర్ కార్ మినహా అన్ని ఏసీ తరగతుల్లో ప్రయాణించే ప్రతి ఆర్‌ఏసీ ప్రయాణికుడికి పూర్తి బెడ్‌రోల్ కిట్‌ను అందించాలని పేర్కొంది. ఈ కిట్‌లో బెడ్‌షీట్, దుప్పటి సహా అవసరమైన లినెన్ మొత్తం ఉండాలని తెలిపింది.
అప్పట్లోనే ప్రకటించినా..
వాస్తవానికి ఆర్‌ఏసీ ప్రయాణికులకు పూర్తి బెడ్‌రోల్ కిట్ అందించాలనే నిర్ణయాన్ని రైల్వే బోర్డు తొలిసారిగా 2009 సెప్టెంబర్ 23న విడుదల చేసిన కమర్షియల్ సర్క్యులర్ నంబర్ 50 ద్వారా ప్రకటించింది. ఆ సమయంలోనే టికెట్ ఛార్జీలో బెడ్‌రోల్ రుసుము ఉండటంతో, ఏసీ తరగతుల్లో ప్రయాణించే ఆర్‌ఏసీ ప్రయాణికులకు కూడా దుప్పటి, బెడ్‌షీట్ ఇవ్వాలని నిర్ణయించింది. అయితే ఇప్పటికీ పలు మార్గాల ద్వారా ఆర్‌ఏసీ ప్రయాణికులకు బెడ్‌రోల్ కిట్ ఇవ్వడం లేదని లేదా అసంపూర్ణంగా ఇస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయని రైల్వే బోర్డు వెల్లడించింది. దీంతో మరోసారి అన్ని జోనల్ రైల్వేలకు ఆదేశాలను పునరుద్ఘాటిస్తూ, ప్రతి ఆర్‌ఏసీ ప్రయాణికుడికి ధ్రువీకరించిన టికెట్ ఉన్న ప్రయాణికులతో సమానంగా పూర్తి బెడ్‌రోల్ కిట్ అందేలా చూడాలని సూచించింది.
ఆర్ఏసీ రూల్స్‌లో మార్పులు..
ఇక ఆర్‌ఏసీ ప్రయాణికుల వసతి విషయానికి వస్తే.. 2016లో రైల్వే శాఖ నిబంధనలను సవరించింది. కొత్త నిబంధనల ప్రకారం స్లీపర్ క్లాస్‌లో ఏడు సైడ్ లోయర్ బెర్త్‌లను ఉపయోగించి గరిష్టంగా 14 మంది ఆర్‌ఏసీ ప్రయాణికులను సర్దుబాటు చేయవచ్చు. థర్డ్ ఏసీ కోచ్‌లో నాలుగు సైడ్ లోయర్ బెర్త్‌ల ద్వారా 8 మంది ఆర్‌ఏసీ ప్రయాణికులకు అవకాశం ఉంటుంది. సెకండ్ ఏసీ కోచ్‌లో మూడు సైడ్ లోయర్ బెర్త్‌ల ద్వారా 6 మంది ఆర్‌ఏసీ ప్రయాణికులకు వసతి కల్పించవచ్చు.
సంబంధిత వార్తలు

Special Trains | దసరా, దీపావళి పండుగల రద్దీ.. చర్లపల్లి నుంచి దానాపూర్, బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు..
సెప్టెంబర్ 29, 2026

LNG Rail | దేశంలోనే తొలిసారిగా పట్టాలెక్కిన ఎల్ఎన్జీ రైలు..
సెప్టెంబర్ 27, 2026

Trains Cancelled | రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఆరు రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే..
సెప్టెంబర్ 26, 2026
తాజావార్తలు
- ●Chirumalla Rakhesh Kumar | ఓయూకు వెయ్యి కోట్లు, ఐలమ్మ యూనివర్సిటీకి ఇస్తామన్న 500 కోట్లు ఏవీ?
- ●Aman Sehrawat | అమన్ పసిడిపట్టు..! ఆసియా క్రీడల్లో చరిత్ర సృష్టించిన సెహ్రావత్..!
- ●Bathukamma | అక్టోబర్ 18న ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ
- ●Harish Rao | కళ్లెదుట నీళ్లున్నా కాలం తెచ్చిన కరువెట్లయితది?
- ●OnePlus Festive Sale | వన్‌ప్లస్ ఫెస్టివ్ సేల్.. రూ.14,999కే 5జి ఫోన్..
- ●Navaratri Brahmotsavam | తిరుమలకు మరోసారి బ్రహ్మోత్సవ శోభ.. నవరాత్రి ఉత్సవాల షెడ్యూల్ ఇదే

Chirumalla Rakhesh Kumar | ఓయూకు వెయ్యి కోట్లు, ఐలమ్మ యూనివర్సిటీకి ఇస్తామన్న 500 కోట్లు ఏవీ?

Aman Sehrawat | అమన్ పసిడిపట్టు..! ఆసియా క్రీడల్లో చరిత్ర సృష్టించిన సెహ్రావత్..!

Bathukamma | అక్టోబర్ 18న ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ

Harish Rao | కళ్లెదుట నీళ్లున్నా కాలం తెచ్చిన కరువెట్లయితది?



