త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mamata Banerjee | మ‌మ‌త వ‌ర్గానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ‌

Mamata Banerjee | మ‌మ‌తా బెన‌ర్జీ (Mamata Banerjee) నేతృత్వంలోని తృణ‌మూల్ కాంగ్రెస్ వర్గానికి దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ త‌గిలింది. డెబిట్ ఫ్రీజ్ చేసిన నాలుగు బ్యాంకు ఖాతాల‌ను (four debit frozen bank accounts) తిరిగి ఆప‌రేట్ చేయ‌డానికి అనుమ‌తి కోరుతూ దాఖ‌లైన పిటిష‌న్‌ను సుప్రీం ధ‌ర్మాస‌నం కొట్టివేసింది.

D

National | Published On Oct 1, 2026, 2.40 pm IST

Mamata Banerjee | మ‌మ‌త వ‌ర్గానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ‌
Advertisement

Mamata Banerjee | మ‌మ‌తా బెన‌ర్జీ (Mamata Banerjee) నేతృత్వంలోని తృణ‌మూల్ కాంగ్రెస్ వర్గానికి దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ త‌గిలింది. సుమారు రూ.804 కోట్ల నిధులు క‌లిగి ఉన్న డెబిట్ ఫ్రీజ్ చేసిన నాలుగు బ్యాంకు ఖాతాల‌ను (four debit frozen bank accounts) తిరిగి ఆప‌రేట్ చేయ‌డానికి అనుమ‌తి కోరుతూ దాఖ‌లైన పిటిష‌న్‌ను సుప్రీం ధ‌ర్మాస‌నం కొట్టివేసింది. పార్టీ ఎన్నిక‌ల గుర్తు, పేరుకు సంబంధించిన ప్ర‌ధాన‌ కేసు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నందున కలకత్తా హైకోర్టు ఉత్త‌ర్వుల్లో జోక్యం చేసుకోలేమ‌ని జ‌స్టిస్ ఎంఎం సుంద‌రేశ్‌, జ‌స్టిస్ పీబీ వ‌రాలేల‌తో కూడిన ధ‌ర్మాస‌నం స్ప‌ష్టం చేసింది. అయితే, ఈ కేసుకు సంబంధించిన విచార‌ణ‌ను వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని హైకోర్టును సుప్రీం ఆదేశించింది.

మనీ లాండరింగ్ (Money laundering), నిధుల మళ్లింపు ఆరోపణల నేప‌థ్యంలో కేసు ద‌ర్యాప్తులో భాగంగా ఈ ఏడాది జులై 7న సైబర్ క్రైమ్ పోలీసులు తృణ‌మూల్‌కు చెందిన బ్యాంకు ఖాతాల‌ను ఫ్రీజ్ చేసిన విష‌యం తెలిసిందే. ఆయా ఖాతాల్లో సుమారు రూ.804 కోట్లు ఉన్నాయి. ఖాతాల‌ను ఫ్రీజ్ చేయ‌డాన్ని మ‌మ‌తా బెన‌ర్జీ వ‌ర్గం క‌ల‌క‌త్తా హైకోర్టులో స‌వాల్ చేసింది. ఈ పిటిష‌న్‌పై విచార‌ణ జ‌రిపిన హైకోర్టు.. ఈ నాలుగు ఖాతాలను ఆపరేట్ చేయ‌డానికి మధ్యంతర ఉత్తర్వు ఇచ్చేందుకు నిరాక‌రించింది. అయితే, పార్టీ రోజువారీ ఖర్చుల నిమిత్తం కొన్ని ఖాతాల నుంచి నిధులు వాడుకునేందుకు అనుమ‌తించింది. ఇందుకోసం కోర్టు ఒక ప్ర‌త్యేక అధికారిని నియ‌మించింది. దీంతో ఉప ఎన్నిక‌ల నేప‌థ్యంలో దీదీ వ‌ర్గం సుప్రీంను ఆశ్ర‌యించాల్సి వ‌చ్చింది. అక్క‌డ కూడా ఊర‌ట ద‌క్క‌లేదు.

Also Read..

సిటిజన్ ఫస్ట్ అనేది సివిల్ సర్వీస్ ఉద్యోగుల ప్రథమ లక్ష్యం కావాలి : ప్ర‌ధాని మోదీ

హైద‌రాబాద్ అంటే బిర్యానీ మాత్ర‌మే కాదు.. 200 ఏళ్ల నాటి నిజామీ మిఠాయి గురించి తెలుసా..?

మెడ్‌ప్ల‌స్‌లో బంగారు న‌గ‌లు మాయం..

Advertisement
Advertisement