Supreme Court | నేరస్థుల్లో భయం పుట్టించాలి.. మహిళల భద్రతపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
Supreme Court | దేశంలో మహిళల భద్రతపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. లైంగిక చర్యలకు పాల్పడాలంటేనే నేరస్థుల ఒంట్లో వణుకు పెట్టేలా కఠిన చర్యలు ఉండాలని స్పష్టం చేసింది. ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలోని ప్రతి మహిళ రాత్రి 11 గంటలకు కూడా రోడ్లపై, మెట్రోలో స్వేచ్ఛగా, భద్రంగా తిరిగే పరిస్థితులు కల్పించాలని సూచించింది.
Supreme Court | త్రినేత్ర న్యూస్ : దేశంలో మహిళల భద్రతపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. మహిళలు, చిన్నారులపై జరిగే లైంగిక నేరాలను అరికట్టేందుకు మరింత కఠినమైన, పటిష్టమైన పోలీసు వ్యూహం అవసరమని అభిప్రాయపడింది. లైంగిక చర్యలకు పాల్పడాలంటేనే నేరస్థుల ఒంట్లో వణుకు పెట్టేలా కఠిన చర్యలు ఉండాలని స్పష్టం చేసింది. "సమాజంలోని అసాంఘిక శక్తుల మనసులో మీరు భయాన్ని సృష్టించాలి. నేరాలకు పాల్పడే ప్రయత్నం చేసినా చచ్చిపోతామనే భయం వారిలో కలగాలి" అని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అంతేకాదు, కేవలం కాగితాలపైనే భద్రతా చర్యలు పరిమితమైతే ఎలాంటి ప్రయోజనం ఉండదని స్పష్టం చేసింది. క్షేత్రస్థాయిలో అవి పటిష్టంగా అమలు కావాలని తేల్చిచెప్పింది.
ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో ఇటీవలే చోటుచేసుకున్న వరుస అత్యాచార ఘటనలపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ కేసును జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ కె. వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం ఇవాళ విచారించింది. మహిళలకు బహిరంగ ప్రదేశాలను మరింత సురక్షితంగా మార్చేందుకు, లైంగిక నేరాలను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించింది. ప్రస్తుతం ఉన్న భద్రతా వ్యవస్థలోని లోపాలు నేరగాళ్లకు అనుకూలంగా మారకూడదని స్పష్టం చేసింది. నేరం జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం కంటే, నేరం జరగకుండా ముందే నిరోధించడం చాలా ముఖ్యమని వ్యాఖ్యానించింది.
ఢిల్లీలోని సున్నితమైన ప్రాంతాలను (Vulnerable pockets) నిరంతరం పర్యవేక్షించడానికి, ఎక్కడైనా సంఘటన జరిగిన వెంటనే సత్వరమే స్పందించేందుకు అధికారుల వద్ద సరైన యంత్రాంగం ఉందా..? అని ధర్మాసనం ప్రశ్నించింది. విచారణ సందర్భంగా ఢిల్లీలోని ఓ పార్కులో బాలికపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటనను ప్రస్తావించింది. అక్కడికి సమీపంలోనే బాలికల కాలేజీ ఉన్న విషయాన్ని గుర్తుచేసింది. కాలేజీకి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఇలాంటి ఘటన జరగడంపై పోలీసులను ప్రశ్నించింది.
ప్రజా భద్రతను నిర్ధారించడంలో పెట్రోలింగ్ అత్యంత కీలకమని దర్మాసనం నొక్కి చెప్పింది. పోలీసులు ఒకే ప్రాంతంలో సంచరించకుండా.. సిబ్బంది తమకు కేటాయించిన ప్రాంతాల్లో నిరంతరం గస్తీ తిరిగేలా చూడాలని ఢిల్లీ పోలీసులను ధర్మాసనం ఆదేశించింది. రాబోయే పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని.. దుర్గాపూజ, దీపావళి వంటి సందర్భాల్లో ఈ అసాంఘిక శక్తులు మరింత రెచ్చిపోయే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అప్రమత్తత, గస్తీని మరింత పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని తేల్చి చెప్పింది. చీకటిగా, సరిగ్గా వెలుతులు లేని ప్రాంతాలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలోని ప్రతి మహిళ రాత్రి 11 గంటలకు కూడా రోడ్లపై, మెట్రోలో స్వేచ్ఛగా, భద్రంగా తిరిగే పరిస్థితులు కల్పించాలని స్పష్టం చేసింది.
ఢిల్లీలో అత్యాచార ఘటనలు
కాగా, ఇటీవలే కాలంలో రాజధాని ప్రాంతంలో మహిళలు, చిన్నారులు, మైనర్లపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. సెప్టెంబర్ 13న వాయువ్య ఢిల్లీలోని స్వరూప్ నగర్ ప్రాంతంలో 17 ఏళ్ల బాలికపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసి ఆపై హత్య చేశారు. మృతదేహాన్ని బహిరంగ ప్రదేశంలో పడేశారు. దీంతో యువతి మృతదేహాన్ని వీధి కుక్కలు పీక్కుతిన్నాయి. ఆ తర్వాత మూడు రోజులకే అంటే సెప్టెంబర్ 16న ఉత్తర ఢిల్లీలోని సదర్ బజార్ ప్రాంతంలో ఆరో తరగతి చదువుతున్న 10 ఏళ్ల బాలిక చేతులు, కాళ్లు కట్టేసి ఓ దుకాణంలో లైంగిక దాడికి పాల్పడ్డారు. సెప్టెంబర్ 20 కిషన్ గంజ్ ప్రాంతంలో ఆరేళ్ల చిన్నారిపై 34 ఏళ్ల వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. సెప్టెంబర్ 21న కల్కాజీ మందిర్ సమీపంలోని ఓ పార్కులో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది.
అంతకుముందు ఆగస్టు 4న ఉత్తరప్రదేశ్ మైన్‌పురి జిల్లాకు (Mainpuri district) చెందిన 16 ఏళ్ల బాలికపై ఢిల్లీలో అత్యాచారం జరిగింది. కదిలే బస్సులో బాలికపై డ్రవర్, క్లీనర్ అఘాయిత్యానికి పాల్పడ్డారు. అంతకుముందు మే నెలలో ఓ మహిళపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్, కండక్టర్ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ రెండు ఘటనలు 2012 డిసెంబర్ 16న ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటనను గుర్తు చేస్తున్నాయి. ఇలా వరుస ఘటనలతో రాజధానిలో మహిళలు, బాలికల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆయా ఘటనలపై సుప్రీంకోర్టు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. 16 ఏళ్ల బాలికపై కదిలే బస్సులో జరిగిన సామూహిక అత్యాచార ఉదంతాన్ని ప్రముఖంగా ప్రస్తావించింది. ఇది 2012 నాటి నిర్భయ ఘటన తాలూకు చేదు జ్ఞాపకాలను గుర్తుచేస్తోందని సుప్రీం ధర్మాసనం ఇప్పటికే వ్యాఖ్యానించింది.
Also Read..
135 ఏళ్ల చరిత్ర కలిగిన సెంట్రల్ సెక్రటేరియట్ లైబ్రరీ తరలింపు.. కేంద్రానికి సుప్రీం నోటీసులు
బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు జరగాలి : మల్లికార్జున ఖర్గే
రైల్వేలో 99.6 శాతం విద్యుదీకరణ.. అయినా తగ్గని డీజిల్ ఇంజిన్ల అవసరం..
సంబంధిత వార్తలు

Supreme Court | 135 ఏళ్ల చరిత్ర కలిగిన సెంట్రల్ సెక్రటేరియట్ లైబ్రరీ తరలింపు.. కేంద్రానికి సుప్రీం నోటీసులు
అక్టోబర్ 5, 2026

Supreme Court | సుప్రీంకోర్టులో జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలు.. 250 పోస్టులతో నోటిఫికేషన్
అక్టోబర్ 4, 2026

One Nation One Election JPC | ‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’ కమిటీ, సుప్రీంకోర్టు జడ్జీల భేటీ?: రాజ్యాంగ విరుద్ధమంటూ కపిల్ సిబల్ ఫైర్
అక్టోబర్ 1, 2026
తాజావార్తలు
- ●Maruti Suzuki | మారుతి షేర్లకు భారీ కరెక్షన్.. 34 శాతం పతనం తర్వాత మళ్లీ పుంజుకుంటుందా?
- ●Suicide attempt at Bheemgal PS | భీమ్‌గల్ పీఎస్‌లో నిప్పంటించుకొని వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. కారణం ఏంటంటే
- ●Stock Markets | మార్కెట్ పతనాలు కొత్త కాదు.. భారత్ ఎన్నో భారీ క్రాష్లను చూసింది..
- ●Tammineni Veerabhadram | రేవంత్ రెడ్డి మళ్లీ అధికారంలోకి రావడం భ్రమ: సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం
- ●Kiran Abbavaram | నాకు ఒక్క రూపాయి అప్పు లేదు - కిరణ్ అబ్బవరం "రియాలిటీ" గ్లింప్స్ రిలీజ్
- ●Objectionable posts targeting CM Revanth and actress Surekha Vani | సీఎం రేవంత్, నటి సురేఖావాణిలపై అసభ్యకర పోస్టింగ్.. x అకౌంట్‌పై కేసు నమోదు

Maruti Suzuki | మారుతి షేర్లకు భారీ కరెక్షన్.. 34 శాతం పతనం తర్వాత మళ్లీ పుంజుకుంటుందా?

Suicide attempt at Bheemgal PS | భీమ్‌గల్ పీఎస్‌లో నిప్పంటించుకొని వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. కారణం ఏంటంటే

Stock Markets | మార్కెట్ పతనాలు కొత్త కాదు.. భారత్ ఎన్నో భారీ క్రాష్లను చూసింది..

Tammineni Veerabhadram | రేవంత్ రెడ్డి మళ్లీ అధికారంలోకి రావడం భ్రమ: సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం



