Mallikarjun Kharge | బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు జరగాలి : మల్లికార్జున ఖర్గే
Mallikarjun Kharge | ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను తక్షణమే రద్దు చేయాలని, తిరిగి బ్యాలెట్ పేపర్ విధానం ద్వారానే ఎన్నికలు (elections on Ballot Paper) నిర్వహించాలన్న తమ డిమాండ్ల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడే ప్రసక్తే లేదని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) స్పష్టం చేశారు.
Mallikarjun Kharge | త్రినేత్ర న్యూస్ : ఎన్నికల విధానంలో మార్పులు కోరుతూ కాంగ్రెస్ (Congress) పార్టీ తన ఆందోళనలను మరింత ఉద్ధృతం చేసింది. ఈ మేరకు ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) తాజాగా కీలక ప్రకటన చేశారు. తాము లేవనెత్తిన మూడు ప్రధాన డిమాండ్లు నాన్-నెగోషియబుల్ అని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ పెట్టారు.
"ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ (CEC Gyanesh Kumar) రాజీనామా చేయాలని, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను తక్షణమే రద్దు చేయాలని, తిరిగి బ్యాలెట్ పేపర్ విధానం ద్వారానే ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఈ మూడు డిమాండ్ల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడే ప్రసక్తే లేదు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు, ఇండీ (INDIA) కూటమి భాగస్వామ్య పక్షాలు ఈ డిమాండ్లపై రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈ అంశాలపై పోరాడుతున్న సివిల్ సొసైటీ సభ్యులు, యువజన సంఘాలకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుంది" అని ఖర్గే పేర్కొన్నారు.
అదే సమయంలో ఢిల్లీలో మహిళా జర్నలిస్టులను బీజేపీ వేధించడం అత్యంత దుర్మార్గమని అన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. "నియంతలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రజల దృష్టిని మరల్చేందుకు కొత్త ఎత్తుగడలకు సిద్ధమవుతున్నారు" అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
कांग्रेस पार्टी की 3 माँगे non-negotiable हैं।
पहली, ज्ञानेश कुमार का इस्तीफ़ा
दूसरी, SIR को रद्द करना
तीसरी, Ballot Paper पर चुनाव करानादेशभर में कांग्रेस कार्यकर्ता और INDIA गठबंधन के साथी इन तीन मुद्दों को लेकर सड़कों पर हैं।
जो भी Civil Society Members व Youth Organisations इन मुद्दों पर देश में जगह-जगह संघर्ष कर रहे हैं, हम उनके साथ हैं।
दूसरी ओर भाजपा ने दिल्ली में महिला पत्रकारों का उत्पीड़न किया, वो बेहद निंदनीय है।
तानाशाह बहुत घबराया हुआ है, ध्यान भटकाने के एक और अध्याय के लिए तैयार रहिए।
— Mallikarjun Kharge (@kharge) October 5, 2026
Also Read..
135 ఏళ్ల చరిత్ర కలిగిన సెంట్రల్ సెక్రటేరియట్ లైబ్రరీ తరలింపు.. కేంద్రానికి సుప్రీం నోటీసులు
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Supreme Court | 135 ఏళ్ల చరిత్ర కలిగిన సెంట్రల్ సెక్రటేరియట్ లైబ్రరీ తరలింపు.. కేంద్రానికి సుప్రీం నోటీసులు
- ●Diesel Locomotives | రైల్వేలో 99.6 శాతం విద్యుదీకరణ.. అయినా తగ్గని డీజిల్ ఇంజిన్ల అవసరం..
- ●MrBeast | రూ.9 కోట్ల కోసం.. మొత్తం గ్రాసరీ స్టోర్ తినేయాలట..
- ●Rakul Preet Singh | నేను ఎవరి బినామీని కాదు - నాకు ఎవరూ ఆస్తులను గిఫ్ట్‌గా ఇవ్వలేదు - ఐటీ సోదాలపై రకుల్ పోస్ట్
- ●Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో అనిశ్చితి.. మార్పు లేకుండా కొనసాగుతున్న బంగారం, వెండి ధరలు..
- ●CJP | దేశమంతా కదులుతుంది.. ఎంతమందిని అరెస్ట్ చేస్తారు..?

Supreme Court | 135 ఏళ్ల చరిత్ర కలిగిన సెంట్రల్ సెక్రటేరియట్ లైబ్రరీ తరలింపు.. కేంద్రానికి సుప్రీం నోటీసులు

Diesel Locomotives | రైల్వేలో 99.6 శాతం విద్యుదీకరణ.. అయినా తగ్గని డీజిల్ ఇంజిన్ల అవసరం..

MrBeast | రూ.9 కోట్ల కోసం.. మొత్తం గ్రాసరీ స్టోర్ తినేయాలట..

Rakul Preet Singh | నేను ఎవరి బినామీని కాదు - నాకు ఎవరూ ఆస్తులను గిఫ్ట్‌గా ఇవ్వలేదు - ఐటీ సోదాలపై రకుల్ పోస్ట్






