త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Supreme Court | సీజేఐపై అనుచిత వ్యాఖ్యలు.. న్యాయవాదిపై ధిక్కార చర్యలు తీసుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిష‌న్

Supreme Court | ‘ఆ కుర్చీలో కూర్చోవడానికి మీరు అనర్హులు. మీకు ఆ అర్హత లేదు’ అంటూ ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ సూర్య‌కాంత్ (CJI Surya Kant)ని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్య‌లు చేసిన న్యాయ‌వాదిపై కోర్టు ధిక్కార (Criminal Contempt) చర్యలు తీసుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (SCBA) పిటిష‌న్ దాఖ‌లు చేసింది.

D

National | Published On Nov 17, 2026, 1.46 pm IST

Supreme Court | సీజేఐపై అనుచిత వ్యాఖ్యలు.. న్యాయవాదిపై ధిక్కార చర్యలు తీసుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిష‌న్
Advertisement

Supreme Court | త్రినేత్ర న్యూస్ : సుప్రీంకోర్టు (Supreme Court)లో అనూహ్య ఘటన చోటుచేసుకున్న విష‌యం తెలిసిందే. సోమ‌వారం ఓ కేసు విచార‌ణ సంద‌ర్భంగా ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ సూర్య‌కాంత్ (CJI Surya Kant)పై ఓ న్యాయవాది దూషణలకు దిగారు. ‘ఆ కుర్చీలో కూర్చోవడానికి మీరు అనర్హులు. మీకు ఆ అర్హత లేదు’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేప‌థ్యంలో సీజేఐపై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన స‌ద‌రు న్యాయ‌వాదిపై కోర్టు ధిక్కార (Criminal Contempt) చర్యలు తీసుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (SCBA) పిటిష‌న్ దాఖ‌లు చేసింది. ఈ పిటిష‌న్‌ను విచారించేందుకు మంగళవారం సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ పిటిషన్‌ను బుధవారం విచారించనున్న‌ట్లు తెలిపింది.

ఈ అంశాన్ని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ కార్యదర్శి ప్రగ్యా బాఘేల్, సంయుక్త కార్యదర్శి మీనేష్ దూబే.. సీజేఐ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. సదరు న్యాయవాది గతంలో కూడా సీజేఐపై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసిన వీడియో ఆధారాలు తమ వద్ద ఉన్నాయని కోర్టుకు తెలిపారు. న్యాయవాది వ్యాఖ్యలు అత్యంత అభ్యంతరకరమైనవని, క్షమించరానివని పేర్కొన్నారు. ఆయనపై క్రిమినల్ కోర్టు ధిక్కార చర్యలు ప్రారంభించేందుకు అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి చట్టబద్ధమైన అనుమతి ఇచ్చార‌ని కోర్టుకు తెలియ‌జేశారు.

ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే..?

సోమ‌వారం మధ్యాహ్నం సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం ముందు న్యాయవాది తన పిటిషన్‌పై అత్యవసర విచారణ జరపాలని కోరారు. నవంబర్ 2న సీజేఐ కార్యాలయంలో తాను ఒక అంశాన్ని సమర్పించానని 15 రోజులైనా స్పందన రాలేదని ఆయన ఆరోపించారు. అయితే, ముంద‌స్తు అనుమ‌తి లేకుండా కేసును ప్ర‌స్తావించ‌డాన్ని కోర్టు త‌ప్పుబ‌ట్టింది. వెంటనే రిజిస్ట్రార్‌ను సంప్రదించి ఎర్లీ లిస్టింగ్ కోసం అభ్యర్థించాలని న్యాయ‌వాదికి సూచించింది.

అయిన‌ప్ప‌టికీ స‌ద‌రు లాయ‌ర్ వినిపించుకోలేదు.. త‌న పిటిష‌న్ ఎందుకు లిస్ట్ కాలేదో తెలుసుకోవాల‌ని ప‌ట్టుబ‌ట్టారు. స్పందించిన సీజేఐ ఈ విషయాన్ని తానే స్వయంగా పరిశీలిస్తానని నిబంధనల ప్రకారం వేచి ఉండాలని సూచించారు. ఈ క్ర‌మంలో స‌హ‌నం కోల్పోయిన స‌ద‌రు న్యాయ‌వాది సీజేఐపై వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేశారు. “లేదు నేను వేచి ఉండను. ఆ కుర్చీలో కూర్చోవడానికి మీకు అర్హత లేదు” అంటూ సీజేఐని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.

Also Read..

దేశాల మధ్య పోటీ కంటే పరస్పర సహకారం ఎంతో అవ‌స‌రం : ప్ర‌ధాని మోదీ

నా త‌ల్లిదండ్రులు క‌లుసుకున్న రెస్టారెంట్‌కు గ‌ర్ల్‌ఫ్రెండ్‌తో వెళ్లా : రాహుల్ గాంధీ

అధికారులే క‌ర‌ప్ట్.. 15 వేల‌ లంచం ఇస్తేనే ప‌నైంది

Advertisement
Advertisement