PM Modi | దేశాల మధ్య పోటీ కంటే పరస్పర సహకారం ఎంతో అవసరం : ప్రధాని మోదీ
PM Modi | ప్రపంచం ప్రస్తుతం అనేక సంక్షోభాలను ఎదుర్కొంటోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశాల మధ్య పోటీ కంటే పరస్పర సహకారం ఎంతో అవసరమని నొక్కి చెప్పారు. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా (Manila)లో 23వ ఆసియాన్ శిఖరాగ్ర సమావేశంలో (23rd ASEAN Summit) ప్రధాని పాల్గొని ప్రసంగించారు. భారత్, ఆసియాన్‌లు పోటీ కంటే సహకారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు.
PM Modi | త్రినేత్ర న్యూస్ : ప్రపంచంలో ప్రస్తుతం ఒకదాని తర్వాత మరొకటి సంక్షోభాలు ఎదురవుతున్నాయని ఇలాంటి పరిస్థితుల్లో దేశాల మధ్య పోటీ కంటే పరస్పర సహకారం ఎంతో అవసరమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అభిప్రాయపడ్డారు. 23వ ఆసియాన్ శిఖరాగ్ర సమావేశంలో (23rd ASEAN Summit) ప్రధాని మోదీ మాట్లాడుతూ... భారత్, ఆసియాన్‌లు పోటీ కంటే సహకారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. "మనకు పోటీ కాదు, సహకారం కావాలి" అని ఆయన స్పష్టం చేశారు.
భారత్ 'యాక్ట్ ఈస్ట్ పాలసీ' (Act East Policy) ఆసియాన్ (ASEAN) దేశాలతో సంబంధాలకు సరికొత్త ఊపునిచ్చిందని పేర్కొన్నారు. భారత్, ఆసియాన్ దేశాలు కలిసి ప్రపంచ జనాభాలో నాలుగో వంతుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయని గుర్తుచేశారు. "గత కొన్నేళ్లుగా భారతదేశం అమలు చేస్తున్న యాక్ట్ ఈస్ట్ విధానం భారత్-ఆసియాన్ దేశాల మధ్య (India-ASEAN Ties) సంబంధాలకు కొత్త శక్తిని ఇచ్చింది. మన భాగస్వామ్యం కేవలం ఉమ్మడి సంస్కృతి, వారసత్వానికి మాత్రమే పరిమితం కాలేదు. డిజిటల్, రక్షణ, అంతరిక్ష రంగాలకు విస్తరించింది. 2014 నుంచి ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి 100కు పైగా కార్యక్రమాలను చేపట్టాం. సుమారు 250 క్విక్ ఇంపాక్ట్ ప్రాజెక్టులను (Quick Impact Projects) ప్రారంభించాం. నైపుణ్యాభివృద్ధి కోసం 10,000 కంటే ఎక్కువ స్కాలర్‌షిప్‌లను (Scholarships) అందించాం. భారత్-ఆసియాన్ దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు పెరగడం, పర్యాటకం వృద్ధి చెందడం ఇరు దేశాల మధ్య బలపడుతున్న బంధాలకు నిదర్శనం" అని ప్రధాని వివరించారు.
ప్రపంచం వరుస సంక్షోభాలను ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో శాంతి, స్థిరత్వం అత్యవసరమని ప్రధాని నొక్కి చెప్పారు. భారతదేశ అభివృద్ధి, ఆసియాన్ దేశాల సమృద్ధి ఒకదానితో ఒకటి బలంగా ముడిపడి ఉన్నాయని గట్టిగా నమ్ముతున్నట్లు చెప్పారు. రాబోయే సంవత్సరాల్లో 'ఆసియాన్ కమ్యూనిటీ విజన్ 2045', భారతదేశ 'వికసిత్ భారత్ 2047' లక్ష్యాలు పరస్పర ఆకాంక్షలను నెరవేర్చుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాయని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.
గురుద్వారాను సందర్శించిన ప్రధాని
అంతకుముందు ప్రధాని ఫిలిప్పీన్స్‌లోని అత్యంత పురాతనమైన సిక్కు గురుద్వారాను మంగళవారం సందర్శించారు. గురుద్వారా పునరుభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ప్రధాని ఎక్స్‌లో షేర్ చేశారు. మనీలాలోని గురుద్వారా ఖల్సా దివాన్‌ను సందర్శించడం తనకు ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. తొలిసారిగా 1901లో స్థాపించిన ఈ గురుద్వారాను 1903లో అధికారికంగా ఏర్పాటు చేశారు. 1924లో 'ఖల్సా దివాన్'గా రిజిస్టర్ అయిన ఈ గురుద్వారా ఫిలిప్పీన్స్‌లోనే అత్యంత పురాతనమైనది.
Also Read..
నా తల్లిదండ్రులు కలుసుకున్న రెస్టారెంట్‌కు గర్ల్‌ఫ్రెండ్‌తో వెళ్లా : రాహుల్ గాంధీ
ఢిల్లీలో కుప్పకూలిన భవనం పైకప్పు.. చిన్నారి సహా ఇద్దరు మృతి
సంబంధిత వార్తలు

Kiren Rijiju | 1962 నాటి అవమానానికి కాంగ్రెస్ క్షమాపణలు చెబుతుందా..? : రాహుల్‌పై కేంద్ర మంత్రి ఫైర్
నవంబర్ 21, 2026

Kishan Reddy | తెలంగాణలో ఇక బీజేపీ ఆట షురూ.. కిషన్‌రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
నవంబర్ 20, 2026

Rahul Gandhi | రాజీపడిన ప్రధాని ఎప్పటికీ అక్కడ కూర్చోలేరు.. కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ విమర్శలు
నవంబర్ 20, 2026
తాజావార్తలు
- ●Nishikant Dubey | విదేశీ పౌరురాలై ఉండి.. మారుతీ ఎండీ ఎలా అయ్యారు.. సోనియా గాంధీపై బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణలు
- ●Sugar Free Mithai | షుగర్ ఫ్రీ స్వీట్లు తింటే డయాబెటిస్ నియంత్రణలో ఉంటుందా?
- ●TG SAFE Rides | హైదరాబాద్ రెస్టారెంట్లపై అధికారుల రైడ్స్.. ఆ హోటళ్ల నుంచి ఆన్లైన్ డెలివరీ బంద్!
- ●Damodar Raja Narasimha | ఐవీఎఫ్ ద్వారా ట్రిప్లెట్స్ జననం.. గాంధీ వైద్యులకు మంత్రి దామోదర అభినందనలు
- ●Rashmika Mandanna | గర్ల్‌ఫ్రెండ్ కాంబో రిపీట్ - దర్శకుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రష్మిక
- ●Ponnam Prabhakar | వేగంగా తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ: పొన్నం ప్రభాకర్

Nishikant Dubey | విదేశీ పౌరురాలై ఉండి.. మారుతీ ఎండీ ఎలా అయ్యారు.. సోనియా గాంధీపై బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణలు

Sugar Free Mithai | షుగర్ ఫ్రీ స్వీట్లు తింటే డయాబెటిస్ నియంత్రణలో ఉంటుందా?

TG SAFE Rides | హైదరాబాద్ రెస్టారెంట్లపై అధికారుల రైడ్స్.. ఆ హోటళ్ల నుంచి ఆన్లైన్ డెలివరీ బంద్!

Damodar Raja Narasimha | ఐవీఎఫ్ ద్వారా ట్రిప్లెట్స్ జననం.. గాంధీ వైద్యులకు మంత్రి దామోదర అభినందనలు



