త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MLA Anirudh Reddy | అధికారులే క‌ర‌ప్ట్.. 15 వేల‌ లంచం ఇస్తేనే ప‌నైంది

MLA Anirudh Reddy | జ‌డ్చ‌ర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి (MLA Anirudh Reddy) మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాజ‌కీయ నాయ‌కులు క‌ర‌ప్ట్ కాద‌ని.. అధికారులే (Officials) అవినీతి (Corruption) చేస్తున్నార‌ని ఆరోపించారు.

S

Telangana | Published On Nov 17, 2026, 1.18 pm IST

MLA Anirudh Reddy | అధికారులే క‌ర‌ప్ట్.. 15 వేల‌ లంచం ఇస్తేనే ప‌నైంది
Advertisement
  • నేన్ చెప్పినా ఆ అధికారి చేయలే
  • రిజిస్ట్రేష‌న్ ఆఫీసులో రోజుకు లక్ష‌ల్లో వ‌సూలు చేస్తున్న‌రు
  • కాంట్రాక్ట‌ర్ల‌ను బెదిరిస్తే పారిపోతున్న‌రు
  • జ‌ర్న‌లిస్టులు ఇవ‌న్నీ రాస్తే వాళ్ల‌ను నేను శిక్షిస్తా
  • జ‌డ్చ‌ర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

MLA Anirudh Reddy |  త్రినేత్ర న్యూస్‌: జ‌డ్చ‌ర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి (MLA Anirudh Reddy) మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాజ‌కీయ నాయ‌కులు క‌ర‌ప్ట్ కాద‌ని.. అధికారులే (Officials) అవినీతి (Corruption) చేస్తున్నార‌ని ఆరోపించారు. తాను ఒక విరాస‌త్ చేయ‌మంటే 15 వేలు లంచం ఇస్తేనే ప‌ని జ‌రిగింద‌ని వ్యాఖ్యానించారు. రిజిస్ట్రేష‌న్ ఆఫీసులో రోజుకు ల‌క్ష‌ల్లో వ‌సూళ్ల‌కు పాల్ప‌డుతున్నార‌ని తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. ఈమేర‌కు ఆయ‌న జ‌ర్న‌లిస్టుల స‌మావేశంలో మాట్లాడుతూ ప్ర‌భుత్వ అధికారుల‌పై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు.

వ్య‌వ‌స్థ కింది నుంచి బాగ‌లే..

100 శాతం త‌ప్పులు జ‌రుగుతున్న‌య్‌. జ‌ర్న‌లిస్టులు, రాజ‌కీయ నాయ‌కులు క‌ర‌ప్ట్ కాదు. అధికారులే క‌రప్ట్‌. వ్య‌వ‌స్థ కింది నుంచి బాగ‌లేదు. ఉదాహ‌ర‌ణ‌కు మ‌న జ‌డ్చర్ల గురించే చెప్తున్న‌. నేను ఒక విరాస‌త్ (పూర్వికుల ఆస్తిని వార‌సుల పేరు మీద బ‌దిలీ చేయ‌డం) చేయ‌మ‌ని చెప్తే ఓ అధికారి చేయ‌లేదు. ఆ ఆఫీసులో వాడు 15 వేలు లంచం ఇస్తే ప‌ని జ‌రిగింది. ఇలాంటియి బ‌య‌ట పెట్టాలంటే జ‌ర్న‌లిస్టుల‌తోనే అయిత‌ది. మీరు పేప‌ర్ల హెడ్‌లైన్స్ రాస్తే ఆరోజు వారిని శిక్షించే ప‌ని నాది. నేన్ నిజాయితీగా ఉండాల‌నుకుంటే కింది వాళ్లు నిజాయితీ లేకుంటే ప‌నులు ఎలా జ‌రుగుతాయ్‌.

ఈ నిజాలు రాయండి.. మీ వెన‌క నేనుంటా

ఒక సిమెంట్ రోడ్డు బిల్లు రూ.5 ల‌క్ష‌ల‌కు 10 నుంచి 20 శాతం లంచాలు తీసుకుంటున్న‌రు. ఈ నిజాలు రాయండి. ఎందుకు ఎంబీలు అయితలేవో రాయండి. కాంట్రాక్ట‌ర్లు ఎందుకు పారిపోతున్న‌రో రాయండి. ప‌నులు ఎందుకు జ‌రుగుత‌లేవో రాయండి. క‌చ్చితంగా మీకు మ‌ద్ద‌తుగా నేనుంటా. కానీ కాంట్రాక్ట‌ర్ల ద‌గ్గ‌రికి పోయి వాళ్ల‌ను బెదిరిస్తే వ‌చ్చేటోడు కూడా రాడు. మ‌ట్టి కొట్టే కాంట్రాక్ట‌న్లు ప్ర‌భుత్వం ముందే తీసుకుంటది. ఇండ్లు క‌డుత‌రంటే వాన్ని బెదిరిచ్చే.. రోడ్లేస్త‌రంటే మాకు క‌మీష‌న్ ఎంత అనే.. ఈ అధికారులు.

ప్ర‌భుత్వంపైనే భారం ప‌డ్త‌ది..

ఇదంతా ఎవ‌రిపైన ప‌డుత‌ది. మా ప్ర‌భుత్వం పైన ప‌డుత‌ది. ఏ ఆఫీసులో ఏం జ‌రుగుతుందో రాయండి. రిజిస్ట్రేష‌న్ ఆఫీస్‌లో ఏం జ‌రుగుతుంది? ఇద్ద‌రు ముగ్గురు రైట‌ర్లు కూసోని రోజుకు ల‌క్ష రెండు ల‌క్ష‌ల రూపాయ‌లు వ‌సూళ్లు చేస్తున్న‌రు అని అనిరుధ్‌రెడ్డి ఆరోపించారు.

Advertisement
Advertisement