త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rahul Gandhi | నా త‌ల్లిదండ్రులు క‌లుసుకున్న రెస్టారెంట్‌కు గ‌ర్ల్‌ఫ్రెండ్‌తో వెళ్లా : రాహుల్ గాంధీ

Rahul Gandhi | త‌న త‌ల్లిదండ్రులు తొలిసారి క‌లుసుకున్న కేంబ్రిడ్జ్ (Cambridge)లోని వ‌ర్సిటీ రెస్టారెంట్ (Varsity Restaurant)కు గ‌ర్ల్‌ఫ్రెండ్‌తో వెళ్లిన‌ట్లు ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తెలిపారు. ఆమె ఇప్పుడు త‌న‌కు స్నేహితురాలు మాత్ర‌మేన‌ని స్ప‌ష్టం చేశారు.

D

National | Published On Nov 17, 2026, 12.22 pm IST

Rahul Gandhi | నా త‌ల్లిదండ్రులు క‌లుసుకున్న రెస్టారెంట్‌కు గ‌ర్ల్‌ఫ్రెండ్‌తో వెళ్లా : రాహుల్ గాంధీ
Advertisement

Rahul Gandhi | త్రినేత్ర న్యూస్ : ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) త‌న వ్య‌క్తిగ‌త జీవితానికి సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర విష‌యాన్ని పంచుకున్నారు. త‌న త‌ల్లిదండ్రులు రాజీవ్ గాంధీ (Rajiv Gandhi), సోనియా గాంధీ (Sonia Gandhi) విద్యార్థి ద‌శ‌లో తొలిసారిగా క‌లుసుకున్న కేంబ్రిడ్జ్‌లోని రెస్టారెంట్‌కు గ‌ర్ల్‌ఫ్రెండ్ (Girlfriend)తో వెళ్లాల‌ని తెలిపారు. ఆమె ఇప్పుడు త‌న‌కు స్నేహితురాలు మాత్ర‌మేన‌ని స్ప‌ష్టం చేశారు.

సోనియా గాంధీ ఆత్మ‌క‌థ 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్' (Belonging: A Journey of Love) పుస్త‌కావిష్క‌ర‌ణ వేడుక ఢిల్లీలో నిన్న ఘ‌నంగా జ‌రిగింది. ఈవెంట్‌కు హాజ‌రైన రాహుల్‌.. తాను చ‌దువుకున్న‌ రోజుల నాటి జ్ఞాప‌కాల‌ను గుర్తు చేసుకున్నారు. నా త‌ల్లిదండ్రుల గురించి ఎన్నో క‌థ‌లు ప్ర‌చారంలో ఉన్నాయి. అందులో వారిద్ద‌రూ వ‌ర్సిటీ రెస్టారెంట్‌లో (Varsity Restaurant) క‌లుసుకున్నార‌నేది కూడా ఒక‌టి. మా అమ్మనాన్నలు ఎక్కడ కలుసుకున్నారో చూడాలనిపించింది. అందుకే చాలా ఏళ్ల తర్వాత నేను కేంబ్రిడ్జ్ (Cambridge)లో ఉన్నప్పుడు నా గ‌ర్ల్‌ఫ్రెండ్‌తో క‌లిసి వర్సిటీ రెస్టారెంట్‌కు వెళ్లా. నా తల్లిదండ్రులు ఇక్కడే తొలిసారి కలుసుకున్నారని అక్కడి సిబ్బందికి చెప్పాను. వారు వెంట‌నే గుర్తు ప‌ట్టారు. "ఓహ్, వాళ్లా! నాకు వాళ్లు బాగా తెలుసు" అని బదులిచ్చారు" అని రాహుల్ గాంధీ వివరించారు.

ఈ సంద‌ర్భంగా ఆ రెస్టారెంట్‌లో భోజ‌నం గురించి రాహుల్ స‌ర‌దా వ్యాఖ్య‌లు చేశారు. తన తల్లిదండ్రులు ఆ రెస్టారెంట్‌లో ఆహారం అద్భుతంగా ఉండేదని గుర్తుచేసుకుంటారని, కానీ తనకు మాత్రం అక్కడి భోజనం ఏమాత్రం నచ్చలేదని రాహుల్ చమత్కరించారు. "మీరు ఎవరితోనైనా ప్రేమలో పడాలనుకుంటే వర్సిటీ రెస్టారెంట్‌కు వెళ్లండి. కానీ అక్కడ చికెన్ ఛాసర్ (Chicken Chasseur) మాత్రం ఎప్పుడూ ట్రైచేయ‌కండి" అంటూ సభలో నవ్వులు పూయించారు. ఇక కార్య‌క్ర‌మం అనంత‌రం ఇప్పుడు మీ గ‌ర్ల్‌ఫ్రెండ్ ఎక్క‌డ అని రాహుల్‌ను విలేక‌రులు ప్ర‌శ్నించారు. దీనికి ఆయ‌న బ‌దులిస్తూ.. "ఆమె ఇప్పుడు నాకు స్నేహితురాలు" అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. రాహుల్ కామెంట్స్ ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారాయి.

Also Read..

లోయ‌లోప‌డిన బ‌స్సు.. 8 మంది మృతి

ఢిల్లీలో కుప్ప‌కూలిన భ‌వ‌నం పైక‌ప్పు.. చిన్నారి స‌హా ఇద్ద‌రు మృతి

టాలీవుడ్‌కు అందుకే గ్యాప్ - ఆ త‌ప్పు వ‌ల్లే ఫ్లాపులొచ్చాయి - శ్రీలీల కామెంట్స్ వైర‌ల్‌

Advertisement
Advertisement