Jantar Mantar | జంతర్ మంతర్ వద్ద నిరసనలు వద్దు.. వేదిక మార్చండి
Jantar Mantar | జంతర్ మంతర్ (Jantar Mantar) నిరసనలకు అనువైన ప్రాంతం కాదంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court)లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. నిరసనలకు జంతర్ మంతర్‌కు బదులు మరో అనువైన స్థలిని కేటాయించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ పిటిషనర్ కోరారు.
Jantar Mantar | త్రినేత్ర.న్యూస్ : నిరసనలు, ఆందోళనలు అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది ఢిల్లీ జంతర్ మంతర్ (Jantar Mantar). ఇది నిరసనలకు ప్రధాన వేదికగా (protest venue) ఉంది. అయితే, నిరసనలకు ఆ ప్రాంతం అనువైంది కాదంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court)లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.
జంతర్ మంతర్ వద్ద ధర్నాలు, నిరసనల వల్ల ప్రజలు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సతీష్ చాంద్ కౌశిక్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ముఖ్యంగా అత్యవసర సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని వాదించారు. నిరసనలకు జంతర్ మంతర్‌కు బదులు మరో అనువైన స్థలిని కేటాయించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టియ్ జాయ్ మాల్య బాగ్చి, జస్టిస్ వి.మోహనలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.
రాకపోకలు, అత్యవసర వైద్య సేవలకు సంబంధించి పిటిషన్‌లో లేవనెత్తిన అంశాలు ముఖ్యమైనవిగా సీజేఐ ధర్మాసనం అభిప్రాయడింది. ఈ మేరకు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన సూచనలు, అభిప్రాయాలు తీసుకోవాలంటూ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు ధర్మాసనం సూచించింది. విచారణ సమయంలో రాజకీయ నాయకులు పిలుపునిచ్చిన ర్యాలీలు, గత సంఘటనలను పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రస్తావించగా.. రాజకీయ నిరసనలపై స్పందించేందుకు ధర్మాసనం నిరాకరించింది. అలాంటివి జరిగినప్పుడు ఎలా వ్యవహరించాలో భద్రతా సిబ్బందికి తెలుసునని వ్యాఖ్యానించింది.
Also Read..
ఈ20 సురక్షితమేనని ప్రభుత్వం నిరూపించలేకపోతోంది : జైరామ్ రమేశ్
రామ్‌లల్లా ఊయల కోసం 150 కిలోల వెండి వస్తే.. 85 కిలోలతోనే దాన్ని తయారు చేశారు
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వద్ద భూనిర్వాసితుల ఆందోళన.. వీర్లపాలెంలో ఉద్రిక్తత
సంబంధిత వార్తలు

Vaddiraju Ravichandra | ట్రిబ్యునల్స్ రిఫార్మ్స్ బిల్లు సంస్కరణలు ఓకే.. కానీ సరిగా అమలు చేస్తేనే ఫలితం ఉంటుంది
ఆగస్టు 11, 2026

Missing Cases | మిస్సింగ్ కేసుల్లో వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి.. సుప్రీంకోర్టు స్పష్టీకరణ
ఆగస్టు 11, 2026

Sonia Gandhi | మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను చరిత్ర ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది : సోనియా గాంధీ
ఆగస్టు 11, 2026
తాజావార్తలు
- ●Bank Account | కేవైసీ చేయకపోతే బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అవుతుందా..? సోషల్ మీడియా ప్రచారంలో నిజమెంత..?
- ●Harish Rao | రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ నిలదీస్తే గానీ సోయి రాదా..?
- ●Amit Shah | చర్చకు నేను సిద్ధం.. విపక్షాలకు అమిత్ షా సవాల్
- ●KTR | ‘ఏఐ హబ్-స్విట్జర్లాండ్’ వచ్చేసింది.. ఇక సమాచార లోడ్‌ను నియంత్రించొచ్చు
- ●SpaceXAI | స్పేస్ఎక్స్ఏఐ నుంచి గ్రోక్ బాట్.. ఇక పనులన్నింటినీ ఏఐ ఏజెంట్లే చేస్తాయి..
- ●Post Office RD | రోజుకు రూ.300తో పోస్టాఫీస్ ద్వారా రూ.15 లక్షలు.. ఇలా చేస్తే సాధ్యం..

Bank Account | కేవైసీ చేయకపోతే బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అవుతుందా..? సోషల్ మీడియా ప్రచారంలో నిజమెంత..?

Harish Rao | రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ నిలదీస్తే గానీ సోయి రాదా..?

Amit Shah | చర్చకు నేను సిద్ధం.. విపక్షాలకు అమిత్ షా సవాల్

KTR | ‘ఏఐ హబ్-స్విట్జర్లాండ్’ వచ్చేసింది.. ఇక సమాచార లోడ్‌ను నియంత్రించొచ్చు



