Jayam Ravi | 40 లక్షలు అందుకే అడిగాం – దళపతి విజయ్‌ని చూసి నేర్చుకో – జయం రవిపై ఆర్తి తల్లి కామెంట్లు
జయం రవి, ఆర్తి విడాకుల వ్యవహారం కోలీవుడ్ నాట చర్చనీయాంశంగా మారింది. జయం రవి అబద్దాలు చెబుతున్నాడంటూ ఆర్తి తల్లి నిర్మాత సుజాత విజయ్ కుమార్ అన్నారు. పిల్లల ఫీజులు కూడా కట్టకుండా తప్పించుకుంటున్నాడని చెప్పింది.
Entertainment | Published On Aug 3, 2026, 2.59 pm IST
జయం రవి, ఆర్తి మధ్య విడాకుల వ్యవహారం రోజుకో మలుపుతిరుగుతోంది. జయం రవి నుంచి నెలకు నలభై లక్షలు తాత్కాలిక భరణం కోరుతూ ఆర్తి పిటీషన్ వేసింది, ఆ పిటీషన్‌ను ఇటీవల కోర్టు కోర్టు కొట్టేసింది. కోర్టు తీర్పుపై ఆర్తి తల్లి కోలీవుడ్ ప్రొడ్యూసర్ సుజాత విజయ్ కుమార్ రియాక్ట్ అయ్యారు. జయం రవి అబద్దాల కోరు అంటూ కామెంట్లు చేసింది. జయం రవిని హీరోగా నిలబెట్టడం కోసం అతడి సినిమాల్లో వంద కోట్ల వరకు పెట్టుబడులు పెట్టినట్లు సూజత చెప్పారు. ఆ సినిమాలు ఫెయిలవ్వడంతో అప్పులే మిగిలాయని అన్నారు.
కోటి రూపాయలు ఫీజు...
"ఆర్తి పిల్లలు అమెరికన్ స్కూల్‌లో చదువుతున్నారు. వారి ఏడాది ఫీజు ఖర్చులు కలుపుకొని 86 లక్షల నుంచి కోటి వరకు అవుతుంది. రెండు సంవత్సరాలుగా వారి ఫీజులు నేనే భరిస్తున్నాను. తండ్రిగా జయం రవి నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం అందడం లేదు. అందుకే నలభై లక్షలు తాత్కాలిక భరణంగా అడగాల్సివచ్చింది. నిజానిజాలు తెలుసుకోకుండా ఆర్తిదే తప్పంటూ చాలా మంది విమర్శిస్తున్నారు. మాపై నిందలు వేస్తున్నారు. అవన్నీ చూస్తుంటే బాధగా ఉంది" అని సుజాత అన్నారు. .
ఆస్తుల కోసం కాదు...
"పిల్లలను కలవకుండా చేస్తున్నామంటూ జయం రవి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అందులో ఎలాంటి నిజం లేదని సుజాత అన్నారు. ప్రతి వీకెండ్స్‌లో పిల్లలను కలవవచ్చు. కోర్టు కూడా ఉత్తర్వులు జారీ చేసింది. కానీ జయం రవి రావడం లేదు. జయం రవితో ఆర్తి పెళ్లి సీక్రెట్‌గా జరగలేదు. 10 వేల మంది సమక్షంలో గ్రాండ్‌గా పెళ్లి జరిపించాం. భర్తతో కలిసి ఉండాలనే ఆర్తి కోరుకుంది. వైవాహిక బంధంలోకి ఏర్పడిన సమస్యలను సామరస్య పూర్వకంగానే పరిష్కరించుకోవాలని అనుకుంది. కానీ కుదరకపోవడంతోనే తన హక్కుల కోసం ఆర్తి పోరాడుతోంది. అంతే కానీ జయం రవి ఆస్తుల కోసం కాదు" అని సుజాత అన్నారు.
జాసన్ సంజయ్
"ఆర్తి కొడుకు అరవ్ ఫిల్మ్ మేకింగ్ కోర్సు చేయడానికి విదేశాలకు వెళ్లాలని అనుకున్నాడు. కానీ పాస్‌పోర్ట్ రెన్యువల్ కోసం తండ్రి సంతకం కావాల్సివచ్చింది. సంతకం పెట్టమని ఎన్ని సార్లు అడిగినా పట్టించుకోవడం లేదు. దళపతి విజయ్ కూడా విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ విడాకులతో సంబంధం లేకుండా తండ్రితో ఏదో ఒక రోజు సినిమా చేయాలన్నది తన కల అని గర్వంగా జాసన్ సంజయ్ చెప్పాడు. తమ తల్లిదండ్రుల గురించి గొప్పగా చెప్పుకోవాలని ప్రతి పిల్లలు అనుకుంటారు. ఫ్యామిలీ విషయాలను పబ్లిక్‌లో బహిర్గతం చేయడం వల్ల ఓరిగేది ఏమిటో జయం రవికే తెలియాలి " అంటూ సూజత అన్నది. ఆమె కామెంట్లు వైరల్ అవుతోన్నాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Jayam Ravi | నెలకు నలభై లక్షలు ఇవ్వాల్సిందే – జయం రవి నుంచి భరణం కోరిన భార్య – తెరపైకి అగ్ర హీరో పేరు…
మే 19, 2026

Jayam Ravi | బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకుంది – నాపై చేతబడి చేయించింది – భార్యపై కోలీవుడ్ హీరో ఆరోపణలు
మే 16, 2026

Jayam Ravi | తిరుమలలో ప్రియురాలితో జయం రవి – ఓటు వేయకుండా రావడంపై నెటిజన్ల ట్రోలింగ్
ఏప్రిల్ 23, 2026
తాజావార్తలు
- ●MGKLIP | ఎల్లూరు, నార్లాపూర్ పంపులు వెంటనే ప్రారంభించాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
- ●DC Review | డీసీ రివ్యూ - మోడ్రన్ దేవదాసుగా లోకేష్ కనగరాజు మెప్పించాడా? - హీరోగా హిట్టు కొట్టాడా?
- ●స్కాచ్ విస్కీ రచ్చ! అసలు విస్కీ వేరు... స్కాచ్ వైబ్ వేరు!
- ●Uttam Kumar Reddy | ఎల్‌నినో నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండి
- ●Jupally Krishna Rao | కృష్ణా జలాల్లో రాష్ట్ర హక్కులను సాధించి తీరుతాం : మంత్రి జూపల్లి
- ●BJP OBC Morcha | బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుల నియామకం

MGKLIP | ఎల్లూరు, నార్లాపూర్ పంపులు వెంటనే ప్రారంభించాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

DC Review | డీసీ రివ్యూ - మోడ్రన్ దేవదాసుగా లోకేష్ కనగరాజు మెప్పించాడా? - హీరోగా హిట్టు కొట్టాడా?

స్కాచ్ విస్కీ రచ్చ! అసలు విస్కీ వేరు... స్కాచ్ వైబ్ వేరు!

Uttam Kumar Reddy | ఎల్‌నినో నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండి



