Teenmar Mallanna | సనత్‌నగర్ టిమ్స్‌కు మర్రి చెన్నారెడ్డి పేరెందుకు? పండుగ సాయన్న పేరు పెట్టాల్సిందే
Teenmar Mallanna | హైదరబాద్‌లోని సనత్‌నగర్ టిమ్స్‌కు మర్రి చెన్నారెడ్డి పేరు పెట్టొద్దని.. తెలంగాణ వీరులైన పండుగ సాయన్న లేదా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెట్టాలని ఎమ్మెల్సీ, టీఆర్పీ చీఫ్ తీన్మార్ మల్లన్న డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ సంస్థలకు, ప్రాజెక్టులకు వరుసగా 'రెడ్ల' పేర్లు పెడుతుండటంపై ఆయన రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
- బీసీల ప్రభుత్వం వచ్చాక రెడ్ల పేర్లన్నీ తొలగిస్తం
- తెలంగాణ ఉద్యమ ద్రోహి చెన్నారెడ్డి
- రైతుల నోట్లో మట్టి కొట్టిన వారి పేర్లు పెట్టడం ఎంతవరకు సమంజసం
- తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా?
- తెలంగాణకు రేవంతే ఆఖరి ఓసీ సీఎం
- టీఆర్పీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న డిమాండ్
Teenmar Mallanna | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్‌లోని సనత్‌నగర్ టిమ్స్‌కు మర్రి చెన్నారెడ్డి పేరు పెట్టొద్దని.. తెలంగాణ వీరులైన పండుగ సాయన్న లేదా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెట్టాలని ఎమ్మెల్సీ, టీఆర్పీ చీఫ్ తీన్మార్ మల్లన్న డిమాండ్ చేశారు. వెంటనే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ సంస్థలకు, ప్రాజెక్టులకు వరుసగా 'రెడ్ల' పేర్లు పెడుతుండటంపై ఆయన రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో బీసీ ప్రభుత్వం వచ్చాక రెడ్ల పేర్లన్నింటిని తొలగిస్తామని హెచ్చరించారు. తెలంగాణ సమాజంలో మెజారిటీగా ఉన్న బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. ఈమేరకు సోమవారం ఆయన ఒక ప్రకటనలో మాట్లాడుతూ రేవంత్ తీరుపై మండిపడ్డారు.
రెడ్ల పేర్లకే ప్రాధాన్యమా?
తెలంగాణలో ఏ ప్రాజెక్టు చూసినా, ఏ ఫ్లైఓవర్ చూసినా రెడ్ల పేర్లే కనిపిస్తున్నాయని మల్లన్న విమర్శించారు. ఎలిమినేటి మాధవరెడ్డి, జయపాల్ రెడ్డి, పి.జనార్ధన్ రెడ్డి, కాసు బ్రహ్మానంద రెడ్డి.. ఇలా ప్రతిదానికీ రెడ్ల పేర్లు పెట్టడానికి తెలంగాణ ఏమైనా వారి "అయ్య జాగీరా?" అని ప్రశ్నించారు.
సనత్‌నగర్‌లో నిర్మిస్తున్న తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (TIMS)కు మర్రి చెన్నారెడ్డి పేరు పెట్టడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. TIMS నిర్మించడం కోసం తెచ్చిన అప్పులో బీసీల పేరు మీద 601 కోట్ల రూపాయలు ఉంటే, ఓసీల (రెడ్ల) పేరు మీద కేవలం 40 కోట్లు మాత్రమే ఉందని ఆయన పేర్కొన్నారు. "సొమ్మేమో బీసీలది.. సోకులేమో రెడ్లదా?" అంటూ కడిగిపారేశారు.
తెలంగాణ ఉద్యమ ద్రోహులకు గౌరవమా?: తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసిన వారి పేర్లు, రైతుల నోట్లో మట్టి కొట్టిన వారి పేర్లు సంస్థలకు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మర్రి చెన్నారెడ్డి, కొండా వెంకట రంగారెడ్డి వంటి వారు తెలంగాణ ద్రోహులని, పేదలకు భూములు దక్కకుండా చేసిన దొంగల పేర్లు ప్రాజెక్టులకు, రోడ్లకు, భవనలకు, విశ్వవిద్యాలయాలకు ఎలా పెడతారని మండిపడ్డారు.
కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహాన్ని అవతల పారేస్తం..
రేవంత్ రెడ్డి తెలంగాణకు "ఆఖరి ఓసీ ముఖ్యమంత్రి" అని, 2028 తర్వాత రాష్ట్రంలో బీసీల ప్రభుత్వం వస్తుందని మల్లన్న జోస్యం చెప్పారు. బీసీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ రెడ్ల పేర్లన్నింటినీ తొలగిస్తామని, కేబీఆర్ పార్క్ ముందున్న కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహాన్ని కూడా జేసీబీలతో పీకించి అవతల పారేస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల పట్ల అనుసరిస్తున్న వివక్షను సహించేది లేదని, బీసీ మహనీయుల పేర్లు పెట్టే వరకు తమ పోరాటం ఆపబోమని తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●'మక్కా' వేదికగా పాక్-సౌదీ-టర్కీల సంచలన రక్షణ ఒప్పందం: భారత్‌పై పాక్ కయ్యానికి కాలుదువ్వితే ఏం జరుగుతుంది?
- ●Supreme Court | గుడ్లు విసురుతారన్న భయంతో మినహాయింపా? మహువా పిటిషన్‌పై సుప్రీం ఘాటు వ్యాఖ్యలు
- ●POCSO Judgment | 12 ఏండ్ల బాలికపై అఘాయిత్యం చేశాడు.. 10 ఏండ్ల జైలు శిక్ష వేశారు
- ●Minister Sridhar Babu | గ్రామీణ ప్రాంతాలకు హై-స్పీడ్ డిజిటల్ కనెక్టివిటీ
- ●TGCSB | సైబర్ నేరాల నియంత్రణలో దేశంలోనే తెలంగాణకు అగ్రస్థానం
- ●Sreeleela | ప్రియుడి కోసం జాన్వీకపూర్‌తో శ్రీలీల ఫైట్ - ఒకే అబ్బాయితో ఇద్దరు ప్రేమలో పడ్డారా?

'మక్కా' వేదికగా పాక్-సౌదీ-టర్కీల సంచలన రక్షణ ఒప్పందం: భారత్‌పై పాక్ కయ్యానికి కాలుదువ్వితే ఏం జరుగుతుంది?

Supreme Court | గుడ్లు విసురుతారన్న భయంతో మినహాయింపా? మహువా పిటిషన్‌పై సుప్రీం ఘాటు వ్యాఖ్యలు

POCSO Judgment | 12 ఏండ్ల బాలికపై అఘాయిత్యం చేశాడు.. 10 ఏండ్ల జైలు శిక్ష వేశారు

Minister Sridhar Babu | గ్రామీణ ప్రాంతాలకు హై-స్పీడ్ డిజిటల్ కనెక్టివిటీ




