TCL CSOT | ప్రపంచంలోనే తొలి 27 ఇంచుల 4కె ఐజేపీ ఓఎల్ఈడీ మానిటర్.. పవర్‌ఫుల్ డిస్‌ప్లే క్వాలిటీ..
TCL CSOT | టీసీఎల్ సీఎస్ఓటీ, కంప్యూటింగ్ హార్డ్‌వేర్ బ్రాండ్ ఎంఎస్‌ఐ కలిసి చైనాజాయ్ 2026 ప్రదర్శనలో ప్రపంచంలోనే తొలి 27 ఇంచుల 4కె 120 హెడ్జ్ ఇంక్‌జెట్ ప్రింటెడ్ (ఐజేపీ) ఓఎల్ఈడీ ప్రొఫెషనల్ డెస్క్‌టాప్ మానిటర్ ప్రొ మ్యాక్స్ ఓఎల్ఈడీ 271యూపీజేడబ్ల్యూ12ను ఆవిష్కరించాయి.
Technology | Published On Aug 3, 2026, 3.47 pm IST
TCL CSOT | టీసీఎల్ సీఎస్ఓటీ, కంప్యూటింగ్ హార్డ్‌వేర్ బ్రాండ్ ఎంఎస్‌ఐ కలిసి చైనాజాయ్ 2026 ప్రదర్శనలో ప్రపంచంలోనే తొలి 27 ఇంచుల 4కె 120 హెడ్జ్ ఇంక్‌జెట్ ప్రింటెడ్ (ఐజేపీ) ఓఎల్ఈడీ ప్రొఫెషనల్ డెస్క్‌టాప్ మానిటర్ ప్రొ మ్యాక్స్ ఓఎల్ఈడీ 271యూపీజేడబ్ల్యూ12ను ఆవిష్కరించాయి. ఇప్పటివరకు మెడికల్ పరికరాల కోసం ఐజేపీ ఓఎల్ఈడీ ప్యానెల్‌లను భారీ స్థాయిలో ఉత్పత్తి చేసిన టీసీఎల్ సీఎస్ఓటీ, ఇప్పుడు ఇదే సాంకేతికతతో మధ్యస్థాయి వినియోగదారుల డెస్క్‌టాప్ డిస్‌ప్లే మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. ఈ కొత్త మానిటర్‌ను కార్యాలయ పనులు, కంటెంట్ క్రియేషన్, ప్రొఫెషనల్ వర్క్‌ఫ్లోలు, అలాగే వినోద అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. అధిక పిక్సల్ సాంద్రత, అత్యుత్తమ రంగుల కచ్చితత్వం, ఆధునిక ఓఎల్ఈడీ తయారీ సాంకేతికతలను ఇందులో అందించారు.
ఫీచర్లు ఇవే..
ఈ మానిటర్‌లో 27 ఇంచుల 4కె యూహెచ్‌డీ రిజల్యూషన్, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, 164 పీపీఐ పిక్సల్ డెన్సిటీ ఉన్నాయి. టెక్స్ట్ చుట్టూ కనిపించే కలర్ ఫ్రింజింగ్‌ను తగ్గించేందుకు ప్రత్యేకంగా ఆప్టిమైజ్ చేసిన ఆర్‌జీబీ స్ట్రైప్ సబ్‌పిక్సల్ లేఅవుట్‌ను ఉపయోగించారు. రంగుల నాణ్యత పరంగా ఈ డిస్‌ప్లే 99 శాతం డీసీఐ-పీ3 కలర్ గామట్ కవరేజ్‌ను అందిస్తుంది. డెల్టా ఈ ≤ 2 స్థాయి కలర్ అక్యూరసీతో ప్రొఫెషనల్ ఫొటో, వీడియో ఎడిటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. హెచ్‌డీఆర్ కోసం వెసా డిస్‌ప్లేహెచ్‌డీఆర్ ట్రూ బ్లాక్ 500 సర్టిఫికేషన్‌తోపాటు గరిష్ఠంగా 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. అలాగే 3హెచ్ హార్డ్‌నెస్ రేటింగ్ కలిగిన యాంటీ గ్లేర్ కోటింగ్‌ను కూడా అందించారు. ఓఎల్ఈడీ డిస్‌ప్లేల్లో కనిపించే బర్న్ ఇన్ సమస్యను తగ్గించేందుకు ఎంఎస్‌ఐ తన ఓఎల్ఈడీ ఆటో కేర్ టెక్నాలజీని ఇందులో అందించింది. సంప్రదాయ పద్ధతుల్లో మానిటర్‌ను కొంతసేపు ఉపయోగించకుండా ఉంచాల్సి వస్తే, ఈ సాంకేతికతలో డేటా కౌంటింగ్ కంపెన్సేషన్ (డీసీసీ) బ్యాక్‌గ్రౌండ్‌లోనే నిరంతరం పనిచేస్తూ ప్యానెల్‌ను రక్షిస్తుంది. దీంతో వినియోగదారుల పనికి ఎలాంటి అంతరాయం ఉండదు.
కళ్లకు సేఫ్..
కంటి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కూడా పలు ప్రత్యేక ఫీచర్లు అందించారు. ఎంఎస్‌ఐ ఐస్‌ఎర్గో టెక్నాలజీ ద్వారా టీయూవీ ధ్రువీకరించిన లో బ్లూ లైట్, ఫ్లికర్ ఫ్రీ డిస్‌ప్లేను అందించారు. ఐస్‌సేఫ్ 3.0 సర్టిఫికేషన్‌తో హానికరమైన బ్లూ లైట్‌ను 20 శాతం లేదా అంతకంటే తక్కువ స్థాయిలో పరిమితం చేస్తుంది. మల్టీ డివైస్ వర్క్‌ఫ్లోలను సులభతరం చేయడానికి ఈ మానిటర్‌లో ఇంటిగ్రేటెడ్ కేవీఎం స్విచ్, పిక్చర్ ఇన్ పిక్చర్ (పీఐపీ), పిక్చర్ బై పిక్చర్ (పీబీపీ) మోడ్‌లు, 15వాట్ల పవర్ డెలివరీతో యూఎస్‌బీ టైప్ సి కనెక్టివిటీ, అలాగే ఎత్తు, కోణం మార్చుకునే ఎర్గోనామిక్ స్టాండ్‌ను కూడా అందించారు. అయితే ఈ మానిటర్ ధరను మాత్రం ఇంకా వెల్లడించలేదు. కానీ అతి త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నారు.
తాజావార్తలు
- ●MGKLIP | ఎల్లూరు, నార్లాపూర్ పంపులు వెంటనే ప్రారంభించాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
- ●DC Review | డీసీ రివ్యూ - మోడ్రన్ దేవదాసుగా లోకేష్ కనగరాజు మెప్పించాడా? - హీరోగా హిట్టు కొట్టాడా?
- ●స్కాచ్ విస్కీ రచ్చ! అసలు విస్కీ వేరు... స్కాచ్ వైబ్ వేరు!
- ●Uttam Kumar Reddy | ఎల్‌నినో నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండి
- ●Jupally Krishna Rao | కృష్ణా జలాల్లో రాష్ట్ర హక్కులను సాధించి తీరుతాం : మంత్రి జూపల్లి
- ●BJP OBC Morcha | బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుల నియామకం

MGKLIP | ఎల్లూరు, నార్లాపూర్ పంపులు వెంటనే ప్రారంభించాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

DC Review | డీసీ రివ్యూ - మోడ్రన్ దేవదాసుగా లోకేష్ కనగరాజు మెప్పించాడా? - హీరోగా హిట్టు కొట్టాడా?

స్కాచ్ విస్కీ రచ్చ! అసలు విస్కీ వేరు... స్కాచ్ వైబ్ వేరు!

Uttam Kumar Reddy | ఎల్‌నినో నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండి





