Supreme Court | సుప్రీంకోర్టు జడ్జిల పెంపు బిల్లుకు లోక్‌సభ గ్రీన్ సిగ్నల్
Supreme Court | సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 34 (సీజేఐతో కలిపి) నుంచి 38కి పెంచేందుకు ఉద్దేశించిన సుప్రీంకోర్టు (నంబర్ ఆఫ్ జడ్జెస్) అమెండ్‌మెంట్ బిల్ 2026కు లోక్‌సభ ఆమోదం తెలిపింది.
Supreme Court | త్రినేత్ర.న్యూస్ : సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 34 (సీజేఐతో కలిపి) నుంచి 38కి పెంచేందుకు ఉద్దేశించిన సుప్రీంకోర్టు (నంబర్ ఆఫ్ జడ్జెస్) అమెండ్‌మెంట్ బిల్ 2026కు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఆ బిల్లుపై కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ (arjunram meghwal ) చర్చను ప్రారంభించారు. అయితే, రామ్ మందిరం విరాళాల చోరీ, నీట్ అంశంపై ప్రతిపక్ష సభ్యులు పదేపదే నినాదాలు చేస్తూ సభలో ఆందోళనకు దిగడంతో సభా కార్యకలాపాలకు తీవ్ర ఆటంకం కలిగింది. అత్యంత కీలకమైన ఆ బిల్లుపై సభ్యులందరూ చర్చలో పాల్గొనాలని స్పీకర్ పదేపదే కోరినప్పటికీ వారు వెనక్కి తగ్గలేదు. ప్రతిపక్షాల నిరసనల మధ్యే ఎలాంటి చర్చా లేకుండానే ఈ బిల్లును దిగువ సభ ఆమోదించింది.
1950 జనవరి 26న సుప్రీంకోర్టు ప్రారంభమైనప్పుడు ప్రధాన న్యాయమూర్తితో కలిపి కేవలం 8 మంది న్యాయమూర్తులు మాత్రమే ఉండేవారు. ఆ తర్వాత కేసుల సంఖ్యను బట్టి పార్లమెంటు జడ్జిల సంఖ్యను పెంచుతూ వచ్చింది. 1956, 1960, 1977, 1986, 2008, 2019 ఈ సంఖ్యను సవరించింది. చివరిసారిగా 2019లో జడ్జిల సంఖ్యను 31 నుంచి 34కు పెంచారు. ఆ తర్వాత ఇప్పుడు మళ్లీ జడ్జిల సంఖ్యను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టులో పెరుగుతున్న కేసుల సంఖ్య, న్యాయమూర్తులపై అధిక పని భారం, పెండింగ్ కేసులను వేగంగా పరిష్కరించాల్సిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును తీసుకువచ్చింది.
పెండింగ్‌లో 92,000 కేసులు
ప్రస్తుతం సుప్రీంకోర్టులో దాదాపు 92,000 కంటే ఎక్కువ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌కు తెలిపింది. వీటిలో పదేళ్లకు పైగా పెండింగ్‌లో ఉన్న కేసులు 10,000కు పైగా ఉండగా, 26 కేసులు 30 ఏళ్లకు పైగా పెండింగ్‌లో ఉన్నాయని, 558 కేసులు 20 ఏళ్లకు పైగా పరిష్కారం కోసం వేచి ఉన్నాయని లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తెలిపారు. దేశంలోని వివిధ హైకోర్టుల్లో 80,660 కేసులు 30 సంవత్సరాలకు పైగా పరిష్కారం కాకుండా మిగిలిపోయాయని వివరించారు.
Also Read..
జంతర్ మంతర్ వద్ద నిరసనలు వద్దు.. వేదిక మార్చండి
ఈ20 సురక్షితమేనని ప్రభుత్వం నిరూపించలేకపోతోంది : జైరామ్ రమేశ్
రామ్‌లల్లా ఊయల కోసం 150 కిలోల వెండి వస్తే.. 85 కిలోలతోనే దాన్ని తయారు చేశారు
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Keralam | కేరళ పేరు మార్పు బిల్లుకు లోక్‌సభ ఆమోదం
ఆగస్టు 11, 2026

Parliament Monsoon Session | రివర్స్ ఎటాక్.. జార్ఖ్ండ్ నిరసనలపై రాహుల్ సమాధానం చెప్పాలి.. ఎన్డీయే ఎంపీల నిరసన
ఆగస్టు 11, 2026

Om Birla | సభ సజావుగా సాగేందుకు సహకరించండి.. రాజకీయ పార్టీలకు స్పీకర్ ఓం బిర్లా భావోద్వేగ విజ్ఞప్తి
ఆగస్టు 10, 2026
తాజావార్తలు
- ●N Chandrasekaran | టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ సంచలన నిర్ణయం.. ఇక కొనసాగనని ప్రకటన..
- ●E Visa Facility | శ్రీవారి దర్శనం కోసం తిరుమల వచ్చే విదేశీ భక్తులకు గుడ్ న్యూస్
- ●CM Vijay | మహిళా బిల్లుకు ఓకే.. డీలిమిటేషన్‌కు ఒప్పుకునేదే లేదు.. తమిళనాడు అసెంబ్లీలో తీర్మానం
- ●Lord Uday Nagaraju | తెలంగాణ మట్టిలో మొదలైన ఒక ప్రయాణం.. బ్రిటన్ పార్లమెంట్ చరిత్రలో స్థానం సంపాదించింది: వాసుదేవరెడ్డి
- ●Mutual Funds | మ్యుచువల్ ఫండ్స్‌లో జోరుగా పెట్టుబడులు.. జూలైలో భారీ మార్పులు..
- ●Prajwal Revanna | జైల్లో ఫోన్‌తో అడ్డంగా దొరికిపోయిన మాజీ ఎంపీ

N Chandrasekaran | టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ సంచలన నిర్ణయం.. ఇక కొనసాగనని ప్రకటన..

E Visa Facility | శ్రీవారి దర్శనం కోసం తిరుమల వచ్చే విదేశీ భక్తులకు గుడ్ న్యూస్

CM Vijay | మహిళా బిల్లుకు ఓకే.. డీలిమిటేషన్‌కు ఒప్పుకునేదే లేదు.. తమిళనాడు అసెంబ్లీలో తీర్మానం

Lord Uday Nagaraju | తెలంగాణ మట్టిలో మొదలైన ఒక ప్రయాణం.. బ్రిటన్ పార్లమెంట్ చరిత్రలో స్థానం సంపాదించింది: వాసుదేవరెడ్డి



