KTR | మిస్టర్ రేవంత్.. నువ్ సొంతంగా ఎలక్షన్ ఫామ్ నింపుతవా? నింపితే నేన్ దేనికైనా రెడీ
KTR | గోడల మీద సున్నాలేసుకొని బతికినోడివి.. నీకే అంతుంటే ఇక ఇంజినీర్లకు ఇంకెంతుండాలని సీఎం రేవంత్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఎవరి సాయం లేకుండా నీ ఎలక్షన్ ఫామ్ నింపగలుగుతావా అని ఎద్దేవా చేశారు. ఒకవేళ నింపితే ఏ చాలేంజ్‌కైనా నేన్ రెడీ అన్ని సవాల్ విసిరారు. రాహుల్ గాంధీ, రేవంత్ కలిసి ప్రకటించిన 13 డిక్లరేషన్లు క్రిమినల్ వేస్ట్ అని ఫైరయ్యారు.
- రాహుల్, రేవంత్ కలిసి ప్రకటించిన 13 డిక్లరేషన్లే క్రిమినల్ వేస్ట్
- అసలు తెలంగాణకు రేవంత్ అనే సన్నాసి ముఖ్యమంత్రిగా ఉండడమే పెద్ద క్రిమినల్ వేస్ట్
- గోడల మీద సున్నాలేసుకొని బతికినోడివి.. నీకే అంతుంటే ఇంజినీర్లకు ఇంకెంతుండాలి?
- ఇంజినీర్లకు కట్టడం తెలుసు.. మీ పార్టీకి సమాధి కట్టడం తెలుసు
- మీడియా సమావేశంలో రేవంత్‌పై విరుచుకుపడిన కేటీఆర్
KTR | త్రినేత్ర.న్యూస్: గోడల మీద సున్నాలేసుకొని బతికినోడివి.. నీకే అంతుంటే ఇక ఇంజినీర్లకు ఇంకెంతుండాలని సీఎం రేవంత్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఎవరి సాయం లేకుండా నీ ఎలక్షన్ ఫామ్ నింపగలుగుతావా అని ఎద్దేవా చేశారు. ఒకవేళ నింపితే ఏ చాలేంజ్‌కైనా నేన్ రెడీ అన్ని సవాల్ విసిరారు. రాహుల్ గాంధీ, రేవంత్ కలిసి ప్రకటించిన 13 డిక్లరేషన్లు క్రిమినల్ వేస్ట్ అని ఫైరయ్యారు. అసలు తెలంగాణకు రేవంత్ అనే సన్నాసి ముఖ్యమంత్రిగా ఉండడం పెద్ద క్రిమినల్ వేస్ట్ అని విరుచుకుపడ్డారు. సోమవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రేవంత్, రాహుల్‌పై ధ్వజమెత్తారు.
తెలంగాణకు మాత్రం రాడు..
ఇంజినీర్లు క్రిమినల్ వేస్ట్ అని రేవంత్ చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు. రాహుల్ గాంధీ ప్రధాని ఇంటిముందు ఏదో ధర్నాలు చేసినట్టు బిల్డప్‌లు కొడుతుండు. మీ ముఖ్యమంత్రేమో ఇంజినీరింగ్ విద్యార్థులను క్రిమినల్ వేస్ట్ అని మాట్లాడుతుండు. పిల్లల ముందుకు వచ్చి మాట్లాడే దమ్ము మీకు లేదు. వేరే రాష్ట్రాల్లో లాఠీచార్జిలు జరిగితే వెంటనే రాహుల్ పోతడు. కానీ కాంగ్రెస్ పాలిస్తున్న తెలంగాణకు మాత్రం రాడు. ఆయనలో చలనం లేదు అని ఎద్దేవా చేశారు.
అత్యధిక క్రిమినల్ కేసులు 89 ఉన్న వ్యక్తిని సీఎం చేయడమే క్రిమినల్ వేస్ట్. ఎంతోమంది బిడ్డలు విదేశాల్లో ఇంజినీర్లుగా రాణిస్తున్నరు. రాహుల్, రేవంత్ కలిసి పంచిన గ్యారంటీ కార్డులు క్రిమినల్ వేస్ట్. వారు కలిసి ప్రకటించిన 13 డిక్లరేషన్లు క్రిమినల్ వేస్ట్. కరవు టైంలో వందల టీఎంసీల నీళ్లను కిందకు వదలడం క్రిమినల్ వేస్ట్. ప్రగతి భవన్ ఉండంగా జూబ్లీహిల్స్‌లో బోడి బిల్డింగ్ ఏదో కట్టిండు కదా.. దటీజ్ క్రిమినల్ వేస్ట్. పథకాలకు పంగనామం బెట్టి అందాల పోటీలకు 200 కోట్లు ఖర్చు పెట్టుడు దటీజ్ క్రిమినల్ వేస్ట్. మెస్సీతో ఫుట్‌బాల్ మ్యాచ్ అని చెప్పి రూ.100 కోట్లు తగలబెట్టడం దటీజ్ క్రిమినల్ వేస్ట్. కేసీఆర్‌ను తిట్టడానికి మాత్రమే ప్రజల సొమ్ము ఖర్చు పెడుతూ బహిరంగ సభలు పెట్టడం క్రిమినల్ వేస్ట్. రాష్ట్రానికి రేవంత్ అనే పెద్ద సన్నాసిని ముఖ్యమంత్రిని చేయడమే పెద్ద క్రిమినల్ వేస్ట్ అంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు.
ఈ రేవంత్ ఏం చదివిండో నాకైతే డౌటే. నకల్ కొట్టి పాసైన బాపతే అయ్యింటుంది. మిస్టర్ రేవంత్.. ఎవరి సహాయం లేకుండా నీ ఎలక్షన్ ఫామ్ నింపుగలుగుతవా? నీ జీవితంలో ఒక్క పోటీ పరీక్ష అయినా రాసినవా? ఎప్పుడైనా ఒక్క ఇంటర్వ్యూకు హాజరైనవా? మేం కష్టపడి చదివినం.. గొప్పగొప్ప యూనివర్సిటీల్లో చదివినం. గోడల మీద సున్నాలేసుకొని బతికినోడివి నువ్వు. నీకే అంతుంటే.. ఇంజనీర్లకు ఇంకెంతుండాలి? హైదరాబాద్లో ఫ్లై ఓవర్లు కట్టిందెవరు? ఇంజనీర్లు కాదా? ఎల్లంపల్లి నుంచి రివర్స్ పంపింగ్ చేస్తున్నది ఇంజనీర్లు కాదా? నువ్వు కూసునే కమాండ్ కంట్రోల్ సెంటర్, సచివాలయం కట్టింది ఇంజినీర్లు కాదా? ఇంజినీర్లకు కట్టడం తెలుసు.. మీ పార్టీకి సమాధి కట్టడం కూడా తెలుసు అని ఆరోపించారు.
అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు నడపాల్సిందే..
అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు నడపాల్సిందే. నిరుద్యోగుల తరఫున అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం. నిరుద్యోగులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని నా ప్రార్థన. విద్యార్థులకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకో రేవంత్. ముందు నీ చేతిలో ఉన్న పని చేయి.. జరిగే పని చేయి. బీసీ రిజర్వేషన్లు మోడీ ఆపారని రేవంత్ రెడ్డి బుకాయిస్తున్నడు. నువ్వు చేసిన తీర్మానం చిత్తు కాగితం. విద్యా హక్కు చట్టాన్ని తుంగలో తొక్కేలా రేవంత్ వ్యాఖ్యలు ఉన్నాయి. విద్యా హక్కు చట్టాన్ని సోనియా గాంధీ తీసుకువస్తే.. ఆ చట్టాన్ని మీరే తుంగలో తొక్కుతారా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రశ్నించారు.
150 మంది విద్యార్థులను చంపడం సక్సెసా?
గురుకులాల్లో 150 మంది విద్యార్థులను చంపడం కాంగ్రెస్ సక్సెసా? నిరుద్యోగులను ఎండ్రిన్ తాగి చావండని తిట్టడం సక్సెసా? కాంగ్రెస్ వచ్చాక తెలంగాణలో టెక్ ఉద్యోగాలు తగ్గిపోయాయి. దాదాపు ఏడు వేల ఐటీ ఉద్యోగాలు తగ్గిపోయాయి. ఎందుకు పోయాయో ఈ దిక్కుమాలిన కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. విద్యా శాఖగా మంత్రిగా ఈ రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్. తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే రేవంత్ అర్థం లేని మాటలు. జూలై నెల అంతా గోదావరిలో నీళ్లు పోతున్నా.. ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. నీళ్లు ఎత్తకుండా రైతాంగాన్ని ఎండబెట్టిన వేస్ట్, క్రిమినల్ గవర్నమెంట్ ఇది అని కేటీఆర్ మండిపడ్డారు.
నాలుగు టీఎంసీలు రాగానే.. హెలికాప్టర్ వేసుకొని వెళ్లి ఉత్తమ్ కుమార్ పోజులు కొట్టిండు. ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరుకు నీళ్లెలా వస్తున్నాయి? గాయత్రి పంప్ హౌస్, నందిమేడారం పంప్ హౌస్ నుంచి కాదా? కాళేశ్వరంపై ఉత్తమ్ కుమార్‌కు అవగాహన ఉందా? రైతులకు నీళ్లిచ్చే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని రైతులకు అర్థమైంది. నిన్న బోనాల సందర్భంగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని.. రాష్ట్రంలో మంచి వర్షాలు పడాలని మొక్కుకున్నాం అని ఆయన తెలిపారు.
కేంద్ర మంత్రులను తీసుకొచ్చి ఒకసారి ఆ ట్రాఫిక్‌లో వదిలేయాలి..
రేవంత్ రెడ్డి చేసే ప్రతి స్కీం వెనక.. పక్కా ఒక స్కామ్ ఉంటది. మెట్రోను ఎందుకు టేకోవర్ చేశాడు? రూ.200 కోట్లు కొట్టేయడానికి రేవంత్, ఆయన సోదరులు స్కెచ్ వేశారు. బీఆర్ఎస్ పాలనలో మెట్రోను అడ్డుకున్నదే ఈ కాంగ్రెస్, బీజేపీలే. లక్డీకాపూల్ నుంచి బీహెచ్ఈఎల్ వరకు ట్రాఫిక్ ఉండదని అబద్ధం చెప్పారు. చిన్న చిన్న లక్నో, మీరట్ సిటీలకు కూడా మెట్రో ఇచ్చి, హైదరాబాద్ నగరంలో మాత్రం ట్రాఫిక్ లేదని అన్నారు. కేంద్ర మంత్రులను తీసుకొచ్చి ఒకసారి ఆ ట్రాఫిక్‌లో వదిలేస్తే సరిపోతుంది. కాంగ్రెస్ దొంగల స్కామ్‌లను ఎప్పటికప్పుడు ఎండగడుతున్నామని, కాంగ్రెస్ అబద్ధాలను చీల్చిచెండాడుతున్నామనే బీఆర్ఎస్ నాయకులను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తుంది అని కేటీఆర్ ఆరోపించారు.
పెద్దిని ఇబ్బంది పెట్టారు....
పెద్ది సుదర్శన్ రెడ్డిపై ప్రభుత్వం ఒత్తిడి చేయడం వాస్తవం. నా దగ్గరికి వచ్చి అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు అని చెప్తే, న్యాయవాదులకు చెప్పి పరిష్కరించమని కోరాను. విద్యాశాఖలో జరిగిన అవినీతిపై పెద్ది సుదర్శన్ రెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లాడు. కానీ పెద్ది సుదర్శన్ రెడ్డి చనిపోయిన మరుసటి రోజే, ఆ కేసులో సుప్రీంకోర్టు ఈ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది.
ఈ మీడియా సమావేశంలో మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్ నాయకులు రాకేశ్ రెడ్డి పాల్గొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

KTR | వేణు కుమార్ రాసింది సూసైడ్ నోట్ కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఛార్జ్‌షీట్
ఆగస్టు 3, 2026

Etala Rajendar | కార్మికులు కంపెనీలకు వ్యతిరేకం కాదు.. వారి సంక్షేమాన్ని కంపెనీలు మరవొద్దు
ఆగస్టు 3, 2026

Sama Ramnohan Reddy | రాష్ట్రం సర్వనాశనం కావాలని కోరుతున్నారు.. హరీశ్ రావుపై సామ రామ్మోహన్ రెడ్డి ఆగ్రహం
ఆగస్టు 3, 2026
తాజావార్తలు
- ●Jantar Mantar | జంతర్ మంతర్ వద్ద నిరసనలు వద్దు.. వేదిక మార్చండి
- ●Jayam Ravi | 40 లక్షలు అందుకే అడిగాం - దళపతి విజయ్‌ని చూసి నేర్చుకో - జయం రవిపై ఆర్తి తల్లి కామెంట్లు
- ●UPI | ఒక్క Yes తో యూపీఐ మోసాలకు చెక్.. కొత్త భద్రతా వ్యవస్థపై ఆర్బీఐ పరిశీలన..
- ●Jairam Ramesh | ఈ20 సురక్షితమేనని ప్రభుత్వం నిరూపించలేకపోతోంది : జైరామ్ రమేశ్
- ●KTR | వేణు కుమార్ రాసింది సూసైడ్ నోట్ కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఛార్జ్‌షీట్
- ●Etala Rajendar | కార్మికులు కంపెనీలకు వ్యతిరేకం కాదు.. వారి సంక్షేమాన్ని కంపెనీలు మరవొద్దు

Jantar Mantar | జంతర్ మంతర్ వద్ద నిరసనలు వద్దు.. వేదిక మార్చండి

Jayam Ravi | 40 లక్షలు అందుకే అడిగాం - దళపతి విజయ్‌ని చూసి నేర్చుకో - జయం రవిపై ఆర్తి తల్లి కామెంట్లు

UPI | ఒక్క Yes తో యూపీఐ మోసాలకు చెక్.. కొత్త భద్రతా వ్యవస్థపై ఆర్బీఐ పరిశీలన..

Jairam Ramesh | ఈ20 సురక్షితమేనని ప్రభుత్వం నిరూపించలేకపోతోంది : జైరామ్ రమేశ్



