Pooja Hegde | ప్రియుడిని పెళ్లాడనున్న బుట్టబొమ్మ – రూమర్లపై పూజా హెగ్డే టీమ్ క్లారిటీ
బుట్టబొమ్మ పూజా హెగ్డే పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రియుడు రోహన్ మెహ్రాతో ఈ ఏడాదే ఏడడుగులు వేయబోతున్నట్లు చెబుతున్నారు. చాలా కాలంగా సాగుతోన్న తమ ప్రేమ బంధాన్ని పెళ్లి పీటలపైకి తీసుకెళ్లేందుకు ఈ జంట రెడీ అయ్యినట్లు చెబుతున్నారు. ఈ వెడ్డింగ్ రూమర్లపై పూజా హెగ్డే టీమ్ క్లారిటీ ఇచ్చింది.
Entertainment | Published On Aug 3, 2026, 3.42 pm IST
Pooja Hegde | బుట్ట బొమ్మ పూజా హెగ్డే పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. కెరీర్‌లో ఆశించిన స్థాయిలో విజయాలు లేకపోవడంతో ఈ మంగుళూరు బ్యూటీ వ్యక్తిగత జీవితంపై ఫోకస్ పెట్టినట్లు సమాచారం. కీర్తి సురేష్, కాజల్‌తో పాటు చాలా మంది హీరోయిన్లు ప్రస్తుతం పెళ్లి చేసుకొని కూడా సినిమాలను కంటిన్యూ చేస్తోన్నారు. వారి బాటలోనే బుట్టబొమ్మ అడుగులు వేయబోతున్నట్లు చెబుతున్నారు. ఈ ఏడాదే పెళ్లి కబురు వినిపించడానికి రెడీ అయ్యిందంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.
ప్రియుడితో...
బాలీవుడ్ సీనియర్ యాక్టర్ వినోద్ మెహ్రా తనయుడు రోహన్ మెహ్రాతో పూజా హెగ్డే ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో పలుమార్లు వీరిద్దరు చట్టాపట్టాలేసుకొని రెస్టారెంట్లు, వెకేషన్లలో కనిపించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రోహన్‌తోనే పూజా హెగ్డే ఏడడుగులు వేయబోతున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. వీరి ప్రేమాయణానికి ఇరు కుటుంబసభ్యులు ఓకే చెప్పినట్లు సమాచారం.
అవన్నీ అవాస్తవాలే...
ఈ పెళ్లి రూమర్లపై పూజా హెగ్డే టీమ్ క్లారిటీ ఇచ్చింది. పెళ్లి వార్తల్లో నిజం లేదని అన్నారు. ఈ రూమర్లు ఎలా వచ్చాయో, ఎవరూ క్రియేట్ చేశారో తెలియదు. కానీ అవన్నీ అవాస్తవాలే. నిరాధారమైన వార్తలను ప్రచారం చేయద్దు. పూజా హెగ్డే పెళ్లికి ఇంకా చాలా టైమ్ ఉంది. ఆ రోజు వస్తే తనే స్వయంగా అందరితో ఆ గుడ్‌న్యూస్‌ను పంచుకుంటుంది అని చెప్పారు.
శ్రీశ్రీ...కాంచన 4
ఇటీవలే జననాయగన్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది పూజా హెగ్డే. తమిళనాడు సీఎం దళపతి విజయ్ హీరోగా నటించిన ఈ మూవీ నెగెటివ్ టాక్‌తో మూడు వందల కోట్ల వసూళ్లను దక్కించుకుంది. ప్రస్తుతం తెలుగులో శ్రీశ్రీ అనే సినిమా చేస్తోంది. దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తోన్న ఈ మూవీ షూటింగ్ తుది దశకు చేరుకుంది. తమిళంలో హారర్ మూవీ కాంచన 4లో మెయిన్ హీరోయిన్‌గా కనిపించబోతుంది. ఈ రెండు సినిమాలు ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Bhagyashri Borse | పూజా హెగ్డే ఛాన్స్ కొట్టేసిన భాగ్యశ్రీ బోర్సే – బ్లడీ రోమియోతో రొమాన్స్
ఆగస్టు 4, 2026

Hero Nani | అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ – ఇప్పుడు ప్రొడ్యూసర్ – నాని, నితిన్ అలియాస్ రుక్మిణి మూవీ ఓపెనింగ్ ఫొటోలు!
ఆగస్టు 3, 2026

Keerthy Suresh | ప్యారడైజ్ కోసం కీర్తి సురేష్ రెండు రోజులు నిద్రకు దూరం – మహానటిపై నెటిజన్ల ప్రశంసలు
ఆగస్టు 3, 2026
తాజావార్తలు
- ●GST Income | జీఎస్టీ లోపాలకు ఏఐతో చెక్
- ●MGKLIP | ఎల్లూరు, నార్లాపూర్ పంపులు వెంటనే ప్రారంభించాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
- ●DC Review | డీసీ రివ్యూ - మోడ్రన్ దేవదాసుగా లోకేష్ కనగరాజు మెప్పించాడా? - హీరోగా హిట్టు కొట్టాడా?
- ●స్కాచ్ విస్కీ రచ్చ! అసలు విస్కీ వేరు... స్కాచ్ వైబ్ వేరు!
- ●Uttam Kumar Reddy | ఎల్‌నినో నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండి
- ●Jupally Krishna Rao | కృష్ణా జలాల్లో రాష్ట్ర హక్కులను సాధించి తీరుతాం : మంత్రి జూపల్లి

GST Income | జీఎస్టీ లోపాలకు ఏఐతో చెక్

MGKLIP | ఎల్లూరు, నార్లాపూర్ పంపులు వెంటనే ప్రారంభించాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

DC Review | డీసీ రివ్యూ - మోడ్రన్ దేవదాసుగా లోకేష్ కనగరాజు మెప్పించాడా? - హీరోగా హిట్టు కొట్టాడా?

స్కాచ్ విస్కీ రచ్చ! అసలు విస్కీ వేరు... స్కాచ్ వైబ్ వేరు!



