Karnataka | తమిళనాడు-కర్నాటక మధ్య కావేరీ జలాల వివాదం.. డీకే ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం..
Karnataka | కావేరి జలాల పంపిణీ అంశంలో తమిళనాడుతో వివాదం మళ్లీ ముదురుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ అంశంపై రాష్ట్ర అధికారిక నివాసంలో ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అధ్యక్షతన ఆదివారం అఖిలపక్ష సమావేశం జరిగింది.
Karnataka | కావేరి జలాల పంపిణీ అంశంలో తమిళనాడుతో వివాదం మళ్లీ ముదురుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ అంశంపై రాష్ట్ర అధికారిక నివాసంలో ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అధ్యక్షతన ఆదివారం అఖిలపక్ష సమావేశం జరిగింది. వివాదానికి సంబంధించి రాష్ట్రం అనుసరించాల్సిన వ్యూహం, న్యాయపరమైన చర్యలపై నేతలు విస్తృతంగా చర్చించారు. సమావేశంలో మాజీ ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య, బసవరాజ్ బొమ్మై, కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి, సీనియర్ కాంగ్రెస్ నేత ఎం వీరప్ప మొయిలీ, మంత్రి ఎంబీ పాటిల్, కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు బీకే హరిప్రసాద్ పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జీ పరమేశ్వర, కేంద్ర మంత్రులు వీ సోమన్న, శోభా కరంద్లాజే, రాష్ట్ర మంత్రులు రామలింగారెడ్డి, కేజే జార్జ్, కృష్ణ బైరెగౌడ, ఢిల్లీలో రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధి టీబీ జయచంద్ర, ప్రతిపక్ష నేతలు ఆర్ అశోక్, చలవాడి నారాయణస్వామి, అడ్వకేట్ జనరల్ శశికిరణ్ శెట్టి తదితరులు హాజరయ్యారు.
కావేరి వివాదం ఏంటి?
కావేరి నది కర్ణాటకలో పుట్టి తమిళనాడు మీదుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ నది జలాల పంపిణీపై దశాబ్దాలుగా రెండు రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతోంది. సమస్య పరిష్కారానికి కావేరి జల వివాద ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేయగా, అనంతరం కావేరి జల నిర్వహణ ప్రాధికార సంస్థ (సీడబ్ల్యూఎంఏ) ఏర్పాటైంది. వర్షాభావం, జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గిన సందర్భాల్లో ఈ వివాదం తరచూ తెరపైకి వస్తుంటుంది. తాజాగా కర్ణాటక నీటిని విడుదల చేయడానికి నిరాకరించడంతో తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది. రాష్ట్రానికి రావాల్సిన వాటా నీటి కోసం న్యాయపోరాటం చేస్తామని తమిళనాడు న్యాయశాఖ మంత్రి ఆర్ నిర్మల్ కుమార్ ఇప్పటికే స్పష్టం చేశారు. దీంతో ఈ వివాదం మరోసారి న్యాయ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయం, ఇరు రాష్ట్రాల వైఖరిపై ఈ వివాదం తదుపరి పరిణామాలు ఆధారపడి ఉండనున్నాయి.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●MGKLIP | ఎల్లూరు, నార్లాపూర్ పంపులు వెంటనే ప్రారంభించాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
- ●DC Review | డీసీ రివ్యూ - మోడ్రన్ దేవదాసుగా లోకేష్ కనగరాజు మెప్పించాడా? - హీరోగా హిట్టు కొట్టాడా?
- ●స్కాచ్ విస్కీ రచ్చ! అసలు విస్కీ వేరు... స్కాచ్ వైబ్ వేరు!
- ●Uttam Kumar Reddy | ఎల్‌నినో నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండి
- ●Jupally Krishna Rao | కృష్ణా జలాల్లో రాష్ట్ర హక్కులను సాధించి తీరుతాం : మంత్రి జూపల్లి
- ●BJP OBC Morcha | బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుల నియామకం

MGKLIP | ఎల్లూరు, నార్లాపూర్ పంపులు వెంటనే ప్రారంభించాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

DC Review | డీసీ రివ్యూ - మోడ్రన్ దేవదాసుగా లోకేష్ కనగరాజు మెప్పించాడా? - హీరోగా హిట్టు కొట్టాడా?

స్కాచ్ విస్కీ రచ్చ! అసలు విస్కీ వేరు... స్కాచ్ వైబ్ వేరు!

Uttam Kumar Reddy | ఎల్‌నినో నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండి




