త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jairam Ramesh | ఈ20 సుర‌క్షిత‌మేన‌ని ప్ర‌భుత్వం నిరూపించ‌లేక‌పోతోంది : జైరామ్ రమేశ్‌

Jairam Ramesh | దేశ‌వ్యాప్తంగా అమ‌లు చేస్తున్న ఈ20 ఇంధ‌నం సుర‌క్షిత‌మేన‌ని కేంద్ర ప్ర‌భుత్వం నిరూపించ‌లేక‌పోతోంద‌ని కాంగ్రెస్ నేత జైరామ్ ర‌మేశ్ (Jairam Ramesh) వ్యాఖ్యానించారు. ఈ20 వాడ‌టం వ‌ల్ల వాహ‌నాల‌పై ప‌డుతున్న ప్ర‌భావం గురించిన డేటాను, నివేదిక‌ల‌ను అందించ‌డంలో మోదీ ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌ని ఆరోపించారు. ఈ20 వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రజల్లో ఆగ్రహం పెరుగుతోందని చెప్పారు.

D

National | Published On Aug 3, 2026, 2.09 pm IST

Jairam Ramesh | ఈ20 సుర‌క్షిత‌మేన‌ని ప్ర‌భుత్వం నిరూపించ‌లేక‌పోతోంది : జైరామ్ రమేశ్‌
Advertisement

Jairam Ramesh | త్రినేత్ర‌.న్యూస్ : కేంద్రం ప్ర‌తిష్టాత్మ‌కంగా అమ‌లు చేస్తున్న‌ ఇథనాల్ బ్లెండింగ్ (Ethanol Blending) కార్యక్రమంపై కాంగ్రెస్ పార్టీ మ‌రోసారి తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించింది. ఈ20 వాడ‌టం వ‌ల్ల వాహ‌నాల‌పై ప‌డుతున్న ప్ర‌భావం గురించిన డేటాను, నివేదిక‌ల‌ను అందించ‌డంలో మోదీ ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌ని ఆరోపించింది. E20 పై జులై 29న పార్ల‌మెంట్‌లో కేంద్ర రోడ్డు ర‌వాణా శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీ ఇచ్చిన స‌మాధానం అనేక ప్ర‌శ్న‌ల‌ను లేవ‌నెత్తుతోంద‌ని కాంగ్రెస్ జ‌న‌ర‌ల్ కెక్ర‌ట‌రీ జైరామ్ ర‌మేశ్ (Jairam Ramesh) అన్నారు. E20 ఇంధన విధానాన్ని (E20 Petrol Rollout) దేశవ్యాప్తంగా అమలు చేయడంపై ఆయ‌న తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. ఈ విధానం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రజల్లో ఆగ్రహం పెరుగుతోందని పేర్కొన్నారు. ఈ మేర‌కు ఎక్స్ వేదిక‌గా పోస్టు పెట్టారు.

సంవ‌త్స‌రాల త‌ర‌బ‌డి శాస్త్రీయ ప‌రీక్ష‌ల త‌ర్వాతే ఈ20 ఇంధ‌నాన్ని ప్ర‌వేశ‌పెట్టిన‌ట్లు గ‌డ్క‌రీ తెలిపిన విష‌యం తెలిసిందే. ఈ ఇంధ‌నం వల్ల వాహ‌నాలు దెబ్బ‌తిన్న‌ట్లు ఎలాంటి ఆధారాలూ, ఫిర్యాదులూ అంద‌లేద‌ని పేర్కొన్నారు. అయితే, దేశ‌వ్యాప్తంగా ఉన్న వినియోగ‌దారులు, మెకానిక్‌లు ఈ ఇంధ‌నం వాడ‌టం వ‌ల్ల వాహ‌నం మైలేజ్ త‌గ్గుతోంద‌ని, ఇంజిన్ ప‌నితీరు మందగించింద‌ని, చ‌లికాలంలోవాహ‌నం స్టార్ట్ కావ‌డంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న‌ట్లు జైరామ్‌ ర‌మేశ్‌ చెప్పారు. ముఖ్యంగా 2023కి ముందు త‌యారైన వాహ‌నాల‌పై దీర్ఘ‌కాలిక ప్ర‌భావాల గురించి ఆందోళ‌న‌లు వ్య‌క్తం చేస్తున్నార‌ని వెల్ల‌డించారు. పాత వాహనాల్లో ఫ్యూయల్ ఇంజెక్టర్లు జామ్ కావడం, ఇంధన పైపులు తుప్పు పట్టడం, రబ్బరు విడిభాగాలు దెబ్బతిన్నట్లు వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న‌ట్లు చెప్పారు.

దేశ‌వ్యాప్తంగా ఈ20 పెట్రోలే స‌ర‌ఫ‌రా అవుతుండ‌టంతో వినియోగ‌దారుల‌కు వేరే ఆప్ష‌న్ లేకుండా పోయింద‌ని చెప్పారు. 2023కి ముందు తయారైన పెట్రోల్ వాహన యజమానులపై జూన్ 2026లో నిర్వ‌హించిన ఓ స్వ‌తంత్ర స‌ర్వేను ఈ సంద‌ర్భంగా జైరామ్‌ ర‌మేశ్ ఉద‌హ‌రించారు. ఈ-20 ప్రవేశపెట్టిన తర్వాత దాదాపు 44 వేల మందికిపైగా తమ వాహ‌నాల్లో ప్ర‌తికూల ప్ర‌భావాల‌ను ఎదుర్కొన్న‌ట్లు వివ‌రించారు. అదే స‌మ‌యంలో బ‌యో ఫ్యూయ‌ల్ వ‌ల్ల వాహ‌నాలు దెబ్బ‌తింటున్నాయ‌నే ఫిర్యాదుల‌ను పెట్రోలియం శాఖ మంత్రి హ‌ర్దీప్ సింగ్‌పురి బుల్‌షిట్ అంటూ కొట్టిపారేయ‌డాన్ని జైరామ్‌ ర‌మేశ్ తీవ్రంగా త‌ప్పుబట్టారు.

నీతి ఆయోగ్ 2021 ఇథనాల్ పాలసీ రోడ్‌మ్యాప్, ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ARAI) నివేదికను ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ నేత ప్ర‌స్తావించారు. పాల‌సీ ప‌త్రాలు, నివేదికల్లో స్పష్టమైన విషయాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం వాటిని విస్మరిస్తూనే ఉందని ఆరోపించారు. E10 ఇంధనం కోసం రూపొందించిన వాహనాల్లో E20 వాడకం వల్ల రబ్బర్ విడిభాగాలు (హోస్‌లు, సీల్స్, గ్యాస్కెట్లు) త్వరగా పాడైపోతాయని, ఇంజిన్లలో తుప్పు పట్టే ప్రమాదం ఉందని ఆరోపించారు. పాత ఫోర్-వీలర్లలో ఇంధన సామర్థ్యం 6-7% వరకు, పాత టూ-వీలర్లలో 3-4% , ఈ-20కి అనుకూలంగా ఉండే ఫోర్-వీలర్ వాహ‌నాల్లో 1-2% వరకు తగ్గే అవకాశం ఉందని జైరామ్ రమేశ్‌ వివ‌రించారు.

Also Read..

వేణు కుమార్ రాసింది సూసైడ్ నోట్ కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఛార్జ్‌షీట్

రామ్‌ల‌ల్లా ఊయ‌ల కోసం 150 కిలోల వెండి వ‌స్తే.. 85 కిలోల‌తోనే దాన్ని త‌యారు చేశారు

రాష్ట్రం స‌ర్వ‌నాశ‌నం కావాల‌ని కోరుతున్నారు.. హ‌రీశ్ రావుపై సామ రామ్మోహ‌న్ రెడ్డి ఆగ్ర‌హం

Advertisement
Advertisement