PM Modi | బెంగాల్ అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ అవసరం : ప్రధాని మోదీ
PM Modi | పశ్చిమ బెంగాల్ (West Bengal) అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ (double engine government) అవసరమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అన్నారు.
PM Modi | పశ్చిమ బెంగాల్ (West Bengal) అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ (double engine government) అవసరమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అన్నారు. హల్దియా (Haldia)లో గురువారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
ప్రధాని, ముఖ్యమంత్రి కలిసి పనిచేసినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమని ప్రధాని మోదీ అన్నారు. అప్పుడే ప్రజలకు ప్రయోజనం ఉంటుందన్నారు. బెంగాల్‌లో బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం చాలా ముఖ్యమన్నారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం వస్తేనే మత్స్య సంపద, సీఫుడ్ రంగాల్లో బెంగాల్ స్వయం సమృద్ధి సాధిస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బెంగాల్ అభివృద్ధికి తృణమూల్ అడ్డుపడుతోందని ఆరోపించారు. ఈ సారి రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ఈసారి నందిగ్రామ్ ఫలితం ఖాయం..
2021లో నందిగ్రామ్‌లో మమతా బెనర్జీ ఓడిపోయిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రధాని గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రం అంతటా అదే ఫలితం వస్తుందని వ్యాఖ్యానించారు. "బంగాల్‌లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు సాధారణమైనవి కావు. అభివృద్ధికి, బెంగాల్ చరిత్రను తిరగరాయడానికి ఎంతగానో తోడ్పడతాయి. ఆ దిశగా సాగేందుకు రాష్ట్ర ప్రజలు వేయాల్సిన మొట్టమొదటి అడుగు టీఎంసీ ప్రభుత్వానికి గద్దె దించడమే. దేశంలోని అనేక రాష్ట్రాలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంటే.. ఈ ప్రభుత్వం మాత్రం బెంగాల్‌లో అభివృద్ధికి అడ్డుపడుతోంది. వికసిత్ బెంగాల్ సాధించాలంటే ఆ పార్టీని అధికారం నుంచి తొలగించడం అత్యవసరం. ఈసారి బెంగాల్ ప్రజలు ఎటువంటి ప్రతికూల పరిస్థితులనైనా అధిగమించాలని సంకల్పించారు. ఈ ఉత్సాహంలోనే బీజేపీ విజయం కనిపిస్తోంది. రాష్ట్ర యువతను ఈ దుర్మార్గమైన ప్రభుత్వం మోసం చేసింది. ఇక్కడ ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు లేవు. ఒకవేళ ఉన్నా వాటిని చొరబాటుదారులకు కట్టబెట్టారు. ఇక ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను టీఎంసీ మంత్రులే దోచుకుంటున్నారు" అని మోదీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
డబుల్ ఇంజిన్ సర్కార్ ఆరు హామీలు..
ఈ సందర్భంగా బెంగాల్ ప్రజలకు ప్రధాని మోదీ ఆరు హామీలు ప్రకటించారు. అందులో మొదటి హామీ.. భయానక వాతావరణాన్ని అంతం చేయడమేని ప్రధాని స్పష్టం చేశారు. బెంగాల్‌లో మళ్లీ చట్టంపై నమ్మకం కలిగిస్తామని తెలిపారు. గతంలో జరిగిన ప్రతి స్కామ్, అవినీతి కేసు ఫైళ్లను తిరిగి తెరుస్తామని హామీ ఇచ్చారు. దోషులు ఎంతటి వారైనా సరే.. అవినీతిపరులను జైలు ఊచలు లెక్కపెట్టిస్తామని హెచ్చరించారు. శరణార్థులకు రాజ్యాంగం ప్రకారం ప్రత్యేక హక్కులను కల్పిస్తామని, చొరబాటుదారులను మాత్రం దేశం నుంచి తరమికొడతామని హెచ్చరించారు. బీజేపీ అధికారంలోకి రాగానే 7వ వేతన కమిషన్‌ను అమల్లోకి తీసుకొస్తామని ఈ సందర్భంగా ప్రధాని హామీ ఇచ్చారు.
Also Read..
11 వేల లీటర్ల పాలతో నర్మదా నదికి అభిషేకం.. నెట్టింట తీవ్ర చర్చ
అప్పటి వరకూ టెహ్రాన్ చుట్టూనే అమెరికా సైన్యం.. ఇరాన్‌కు ట్రంప్ తాజా హెచ్చరికలు
ప్రతి బ్యారెల్‌కు ఒక డాలర్.. లేదంటూ ధ్వంసమే.. హర్మూజ్‌పై పట్టుకు ఇరాన్ కొత్త ప్లాన్
తాజావార్తలు
- ●POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!
- ●Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో నయా రికార్డ్.. దేశంలోనే తొలిసారిగా మీడియాకు స్పెషల్ ఆఫీస్
- ●Ayodhya Ram Mandir Trust | రామ జన్మభూమి ట్రస్ట్‌లో భారీ ప్రక్షాళన: చంపత్ రాయ్ రాజీనామా.. విరాళాల లెక్కలు పక్కా!
- ●Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే
- ●SLBC tunnel project | 2028 జూన్ నాటికి ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి.. 4 లక్షల ఎకరాలకు సాగునీరు: మంత్రి ఉత్తమ్
- ●OTT | సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన సింగర్ సునీత కొడుకు మూవీ

POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!

Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో నయా రికార్డ్.. దేశంలోనే తొలిసారిగా మీడియాకు స్పెషల్ ఆఫీస్

Ayodhya Ram Mandir Trust | రామ జన్మభూమి ట్రస్ట్‌లో భారీ ప్రక్షాళన: చంపత్ రాయ్ రాజీనామా.. విరాళాల లెక్కలు పక్కా!

Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే






