Green Asha | 15,400 టన్నుల LPGతో భారత్‌కు చేరుకున్న గ్రీన్ ఆశా
Green Asha | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ భారత ఇంధన సరఫరా వ్యవస్థలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. గ్రీన్ ఆశా (Green Asha) అనే నౌక సురక్షితంగా భారత పోర్టుకు చేరుకుంది.
Green Asha | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ భారత ఇంధన సరఫరా వ్యవస్థలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. గ్రీన్ ఆశా (Green Asha) అనే నౌక సురక్షితంగా భారత పోర్టుకు చేరుకుంది. దాదాపు 15,400 టన్నుల లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్‌తో నవీ ముంబై (Navi Mumbai)లోని జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీకి (JNPA) చేరుకుంది. నవీ ముంబైలోని నవశేవా పోర్టులో ఉన్న బీపీసీఎల్-ఐఓసీఎల్ (BPCL-IOCL) లిక్విడ్ బెర్త్ వద్ద ఈ నౌక విజయవంతంగా లంగరు వేసింది.
ఇరాన్‌తో అమెరికా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ప్రారంభమైన తర్వాత జేఎన్‌పీఏకు చేరుకున్న తొలి నౌక ఇదే కావడం విశేషం. నౌకలోని సిబ్బంది, కార్గో అంతా సురక్షితంగా ఉన్నట్లు జేఎన్‌పీఏ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. క్లిష్టమైన భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లోనూ దేశానికి అవసరమైన నిత్యావసర సరకుల సరఫరాను నిరంతరాయంగా కొనసాగించే భారత సముద్ర రవాణా సామర్థ్యానికి ఈ సంఘటన నిదర్శనమని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నౌక రాకతో దేశీయంగా ఎల్‌పీజీ కష్టాలు తీరనున్నాయి. ఇక పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మొదలైనప్పటి నుంచి హర్మూజ్ జలసంధిని (Strait of Hormuz) సురక్షితంగా దాటిన ఎనిమిదో నౌకగా గ్రీన్ ఆశా నిలిచింది.

#WATCH | Navi Mumbai, Maharashtra: Green Asha, an India-flagged LPG vessel that has successfully crossed the Strait of Hormuz, has moored at JNPA's liquid berth operated by BPCL-IOCL today. It is the first such vessel to reach JNPA since the onset of the war between Iran, the… pic.twitter.com/195jKsk61l
— ANI (@ANI) April 9, 2026
Also Read..
బెంగాల్ అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ అవసరం : ప్రధాని మోదీ
11 వేల లీటర్ల పాలతో నర్మదా నదికి అభిషేకం.. నెట్టింట తీవ్ర చర్చ
అప్పటి వరకూ టెహ్రాన్ చుట్టూనే అమెరికా సైన్యం.. ఇరాన్‌కు ట్రంప్ తాజా హెచ్చరికలు
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!
- ●Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో నయా రికార్డ్.. దేశంలోనే తొలిసారిగా మీడియాకు స్పెషల్ ఆఫీస్
- ●Ayodhya Ram Mandir Trust | రామ జన్మభూమి ట్రస్ట్‌లో భారీ ప్రక్షాళన: చంపత్ రాయ్ రాజీనామా.. విరాళాల లెక్కలు పక్కా!
- ●Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే
- ●SLBC tunnel project | 2028 జూన్ నాటికి ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి.. 4 లక్షల ఎకరాలకు సాగునీరు: మంత్రి ఉత్తమ్
- ●OTT | సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన సింగర్ సునీత కొడుకు మూవీ

POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!

Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో నయా రికార్డ్.. దేశంలోనే తొలిసారిగా మీడియాకు స్పెషల్ ఆఫీస్

Ayodhya Ram Mandir Trust | రామ జన్మభూమి ట్రస్ట్‌లో భారీ ప్రక్షాళన: చంపత్ రాయ్ రాజీనామా.. విరాళాల లెక్కలు పక్కా!

Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే






