త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Devi Prasad | డీలిమిటేషన్ బిల్లుకు వాళ్లెందుకు మద్దతిస్తున్నారో అద్దంకి చెప్పాలి

Devi Prasad | ఇండియా బ్లాక్ పక్షాలు డీలిమిటేషన్ బిల్లు (Delimitation Bill)కు ఎందుకు మద్దతు ఇస్తున్నాయో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ (Addanki Dayakar) చెప్పాలని బీఆర్ఎస్ నేత‌, కార్పొరేష‌న్ మాజీ చైర్మ‌న్ దేవీప్ర‌సాద్ (Devi Prasad) డిమాండ్ చేశారు.

S

Telangana | Published On Nov 28, 2026, 3.35 pm IST

Devi Prasad | డీలిమిటేషన్ బిల్లుకు వాళ్లెందుకు మద్దతిస్తున్నారో అద్దంకి చెప్పాలి
Advertisement
  • విభజన చట్టం ప్రకారం తెలంగాణలో సీట్లు పెంచాల్సి ఉన్నా బీజేపీ పెంచలేదు.. కాంగ్రెస్ కనీసం ప్రశ్నించలే
  • బీఆర్ఎస్‌ను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్, బీజేపీలు రహస్య ఒప్పందంతో పని చేస్తున్నయ్‌
  • కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ ఫైర్‌

Devi Prasad |  త్రినేత్ర న్యూస్‌: ఇండియా బ్లాక్ పక్షాలు డీలిమిటేషన్ బిల్లు (Delimitation Bill)కు ఎందుకు మద్దతు ఇస్తున్నాయో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ (Addanki Dayakar) చెప్పాలని బీఆర్ఎస్ నేత‌, కార్పొరేష‌న్ మాజీ చైర్మ‌న్ దేవీప్ర‌సాద్ (Devi Prasad) డిమాండ్ చేశారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణలో సీట్లు పెంచాల్సి ఉన్నా బీజేపీ పెంచలేదన్నారు. దీన్ని కాంగ్రెస్ కనీసం ప్రశ్నించలేదని మండిప‌డ్డారు. బీజేపీ ఎంపీలు తెలంగాణను అవమానించేలా మాట్లాడినా కాంగ్రెస్ ఎంపీలు నోరు మెదపలేదని దుయ్య‌బ‌ట్టారు. బీఆర్ఎస్ ను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్, బీజేపీలు రహస్య ఒప్పందంతో పని చేస్తున్నాయని ఆరోపించారు. ఈమేర‌కు శ‌నివారం తెలంగాణ భ‌వ‌న్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

బీజేపీ మెడ‌లు వంచినం

డీలిమిటేషన్ బిల్లుపై బీఆర్ఎస్ పార్టీకి స్పష్టమైన అభిప్రాయం ఉంది. గతంలో బిల్లు ఎందుకు ఆమోదం పొందలేదో అందరికీ తెలుసు. తెలంగాణకు అన్యాయం జరిగితే సహించేది లేదని కేటీఆర్ గతంలోనే స్పష్టంగా చెప్పారు. గతంలో వివిధ సందర్భాల్లో చేసినట్లే బీజేపీ డీలిమిటేషన్ బిల్లులో మార్పులు చేసింది. బీజేపీ మెడలు వంచింది బీఆర్ఎస్ లాంటి పార్టీలే.

బీజేపీతో రహస్య ఒప్పందం చేసుకున్న పార్టీ కాంగ్రెస్. నదీ జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా కాంగ్రెస్, బీజేపీ నోరు మెదపడం లేదు. ఇండియా కూటమిలోని పార్టీల మనోభావాలను కాంగ్రెస్ తెలుసుకునే ప్రయత్నం చేస్త‌లేదు అని దేవీప్ర‌సాద్ విమ‌ర్శించారు.

Advertisement
Advertisement