Kangana Ranaut | మేడం జాగ్రత్త.. సాయోని వస్తోంది.. కంగనా రనౌత్‌పై ఎస్పీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
Kangana Ranaut | బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, మండి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ (Kangana Ranaut)పై ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌కు చెందిన రాణిగంజ్ అసెంబ్లీ నియోజకవర్గ సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే (SP MLA) రాకేష్ కుమార్ వర్మ (Rakesh Kumar Verma) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Kangana Ranaut | బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, మండి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ (Kangana Ranaut)పై ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌కు చెందిన రాణిగంజ్ అసెంబ్లీ నియోజకవర్గ సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే (SP MLA) రాకేష్ కుమార్ వర్మ (Rakesh Kumar Verma) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. "కంగనా మేడం జాగ్రత్తగా ఉండండి. పూర్తి అప్రమత్తతతో ఉండండి. మీ స్థానాన్ని ఈ సాయోని ఘోష్ లాగేసుకోగలదు" అంటూ ఎక్స్ వేదికగా సంచలన పోస్టు పెట్టారు. ఆయన ట్వీట్ రాజకీయ దుమారం రేపింది. దీనిపై పలువురు బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు రాకేష్ కుమార్ వర్మపై భారతీయ జనతా యువమోర్చా జిల్లా అధ్యక్షుడు అన్హుమాన్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడి ఫిర్యాదు మేరకు పోలీసులు పలు సెక్షన్ల కింద ఎస్పీ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు.
టీఎంసీలో తీవ్ర సంక్షోభం కొనసాగుతున్న విషయం తెలిసిందే. పలువురు ఎంపీలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారు. సుమారు 20 మంది లోక్‌సభ ఎంపీలు ఆ పార్టీ నాయకత్వంతో విభేదించి రెబల్స్‌గా మారారు. వారంతా ఎన్డీయేకి మద్దతు ఇస్తూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాసినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తమ వర్గాన్ని 'నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ' విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ రెబల్ ఎంపీల్లో మమతా బెనర్జీకి అత్యంత విధేయురాలిగా పేరున్న జాదవ్‌పూర్ లోక్‌సభ ఎంపీ (Trinamool MP) సాయోని ఘోష్ (Saayoni Ghosh) కూడా ఉండటం గమనార్హం. గతంలో సాయోని, కంగన మధ్య లోక్‌సభ వేదికగా పలు అంశాలపై మాటల యుద్ధం కొనసాగిన విషయం తెలిసిందే. అయితే, సాయోని టీఎంసీ నుంచి విడిపోవడంతో ఎస్పీ ఎమ్మెల్యే పై విధంగా వ్యాఖ్యానించారు.
Also Read..
అది నేషనల్ డిఫెక్టర్స్ అలయన్స్.. ఎన్డీయేకి 2/3 మెజారిటీ రాదు : జైరామ్ రమేష్
ఫార్చ్యూనర్ కారును ట్రక్కుల మధ్య ఇరికించి నిప్పు.. బీజేపీ నేత సజీవదహనం
రష్యాపై అతిపెద్ద దాడి.. వందలాది డ్రోన్లతో విరుచుకుపడ్డ ఉక్రెయిన్
సంబంధిత వార్తలు

Samajwadi Party | తృణమూల్, శివసేన అయిపోయింది.. ఇప్పుడు ఎస్పీ వంతు.. అఖిలేష్ పార్టీలో భారీ చీలిక..?
జూన్ 17, 2026

Raghava Lawrence | డిప్యూటీ సీఎంగా రాఘవ లారెన్స్.. సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఫొటో
జూన్ 17, 2026

Mamata Banerjee | సువేందు చేతిలో ఓటమి.. భవానీపూర్ ఫలితాలపై హైకోర్టును ఆశ్రయించిన మమతా బెనర్జీ
జూన్ 16, 2026
తాజావార్తలు
- ●OU Students | ఓయూలో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం
- ●Traffic Restrictions | బీ అలర్ట్.. రేపు ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
- ●NABARD Telangana | తెలంగాణ వ్యవసాయంలో భారీ మార్పులు: రైతుల ఆదాయం పెంచేందుకు నాబార్డ్ 'క్లైమేట్ స్మార్ట్' ప్లాన్!
- ●Stamps and Registration services | రిజిస్ట్రేషన్ సేవలకు సెలవ్.. ఏయే తేదీల్లో అంటే
- ●CM Revanth Reddy | ఫ్యూచర్ లేనోడళ్ల ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తాడట.. హరీశ్‌రావుపై నిప్పులు చెరిగిన సీఎం రేవంత్
- ●Telangana | రైతులకు పిడుగులాంటి వార్త.. పాత పద్ధతిలో పంట కొనుగోళ్లకు ఇక నుంచి స్వస్తి

OU Students | ఓయూలో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం

Traffic Restrictions | బీ అలర్ట్.. రేపు ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

NABARD Telangana | తెలంగాణ వ్యవసాయంలో భారీ మార్పులు: రైతుల ఆదాయం పెంచేందుకు నాబార్డ్ 'క్లైమేట్ స్మార్ట్' ప్లాన్!

Stamps and Registration services | రిజిస్ట్రేషన్ సేవలకు సెలవ్.. ఏయే తేదీల్లో అంటే



