త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ukrainian Drones | ర‌ష్యాపై అతిపెద్ద దాడి.. వంద‌లాది డ్రోన్ల‌తో విరుచుకుప‌డ్డ ఉక్రెయిన్‌

Ukrainian Drones | ర‌ష్యాపై ఉక్రెయిన్ అతి పెద్ద దాడి చేసింది. మాస్కోలోని ఆయిల్‌ రిఫైనరీకి సమీపంలోని ప్రాంతాల‌పై వంద‌లాది డ్రోన్ల‌తో (Ukrainian Drones) విరుచుకుప‌డింది. దీంతో మంట‌లు పెద్ద ఎత్తున  ఎగ‌సిప‌డ్డాయి. ఆ ప్రాంతాన్ని న‌ల్ల‌టి పొగ క‌మ్మేసింది. అప్ర‌మ‌త్త‌మైన అధికారులు విమాన‌రాక‌పోక‌ల‌పై ఆంక్ష‌లు విధించారు. 

D

International | Published On Jun 18, 2026, 3.35 pm IST

Ukrainian Drones | ర‌ష్యాపై అతిపెద్ద దాడి.. వంద‌లాది డ్రోన్ల‌తో విరుచుకుప‌డ్డ ఉక్రెయిన్‌
Advertisement

Ukrainian Drones | ర‌ష్యాపై ఉక్రెయిన్ అతి పెద్ద దాడి చేసింది. మాస్కోలోని ఆయిల్‌ రిఫైనరీకి సమీపంలోని ప్రాంతాల‌పై వంద‌లాది డ్రోన్ల‌తో (Ukrainian Drones) విరుచుకుప‌డింది. కీవ్ (Kyiv) దాడుల‌తో అప్ర‌మ‌త్త‌మైన క్రెమ్లిన్ మాస్కోలోని అన్ని ఎయిర్‌పోర్టుల‌ను మూసివేసింది. మాస్కో ల‌క్ష్యంగా ఉక్రెయిన్ దాడి చేయ‌డం వారం రోజుల్లో ఇది రెండోసారి కావ‌డం గ‌మ‌నార్హం.

ఇటీవ‌లే కీవ్‌లో ర‌ష్యా జ‌రిపిన వైమానిక దాడుల‌కు ప్ర‌తీకారంగా ఉక్రెయిన్ ఈ దాడికి పాల్ప‌డింది. మాస్కో, దాని ప‌రిస‌ర‌ ప్రాంతాలే ల‌క్ష్యంగా విరుచుకుప‌డింది. కీవ్ ప్ర‌యోగించిన డ్రోన్లు ప‌లు భ‌వ‌నాలు, షాపింగ్ కాంప్లెక్స్‌ను తాకాయి. మాస్కోలోని ఓ చ‌మురు శుద్ధి క‌ర్మాగారం స‌మీపంలో కూడా దాడులు జ‌ర‌గ‌డంతో అక్క‌డ భారీగా మంట‌లు చెల‌రేగాయి. దీంతో మంట‌లు పెద్ద ఎత్తున  ఎగ‌సిప‌డ్డాయి. ఆ ప్రాంతాన్ని న‌ల్ల‌టి పొగ క‌మ్మేసింది. అప్ర‌మ‌త్త‌మైన అధికారులు విమాన‌రాక‌పోక‌ల‌పై ఆంక్ష‌లు విధించారు.

మాస్కోలోని అన్ని ఎయిర్‌పోర్టుల‌ను మూసివేశారు. త‌దుప‌రి ఆదేశాలు వ‌చ్చే వ‌ర‌కూ విమాన కార్య‌క‌లాపాల‌పై ఆంక్ష‌లు కొన‌సాగుతాయ‌ని ర‌ష్యా ర‌వాణా మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. మ‌రోవైపు ఉక్రెయిన్ నుంచి త‌మ దేశంవైపు దూసుకొచ్చిన 555 డ్రోన్ల‌ను కూల్చివేసిన‌ట్లు ర‌ష్యా అధికారులు తెలిపారు. మాస్కో వైపు వ‌స్తున్న 200 డ్రోన్ల‌ను అడ్డుకున్న‌ట్లు చెప్పారు. రెండేళ్ల‌లో మాస్కోపై జ‌రిగిన అతిపెద్ద దాడి ఇదే అని అక్క‌డి మీడియా నివేదించింది. అయితే, ప్రాణ‌, ఆస్తి న‌ష్టానికి సంబంధించి ఇప్ప‌టి వ‌ర‌కూ ఎలాంటి స‌మాచారం లేదు.

ఇక ఈ దాడుల‌ను ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్‌స్కీ స‌మ‌ర్థించుకున్నారు. "మా నగరాలు, గ్రామాలపై రష్యా జరిపిన దాడులకు ఇది పూర్తిగా సమర్థించదగిన ప్రతిస్పందన" అని పేర్కొన్నారు. ఈ మేర‌కు దాడుల‌కు సంబంధించిన వీడియోల‌ను ఎక్స్‌లో పోస్టు చేశారు. కాగా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కజాన్ నగరంలో ఆగ్నేయాసియా దేశాల కూటమి (ఆసియాన్) సదస్సుకు ఆతిథ్యం ఇవ్వడానికి కొన్ని గంటల ముందు ఈ దాడి జరగ‌డం గ‌మ‌నార్హం.

Also Read..

స‌భ్య‌దేశం కాదు.. అయినా భార‌త్‌కు రెడ్ కార్పెట్ ప‌రుస్తున్న జీ7 దేశాలు.. న్యూఢిల్లీకి ఎందుకంత ప్రాధాన్యం..?

వందేమాత‌రాన్ని ప‌క్క‌న పెట్టిన విజ‌య్ ప్ర‌భుత్వం.. తమిళ గేయంతో అసెంబ్లీ ప్రారంభం

రోబో వాక్యూమ్ లేదా సాధారణ వాక్యూమ్? రెండింటిలో ఏది బెస్ట్?

Advertisement
Advertisement