BJP Leader Burnt Alive | ఫార్చ్యూనర్ కారును ట్రక్కుల మధ్య ఇరికించి నిప్పు.. బీజేపీ నేత సజీవదహనం
BJP Leader Burnt Alive | ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ ఫార్చ్యూనర్ కారును ట్రక్కుల మధ్య ఇరికించి.. దానిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో బీజేపీ నేత సజీవదహనమయ్యారు (BJP Leader Burnt Alive).
BJP Leader Burnt Alive | ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కొరియా (Koriya) జిల్లాలో ఇసుక తవ్వకాలపై (sand mining) చాలా కాలంగా నడుస్తున్న వివాదం ముగ్గురు ప్రాణాలను బలితీసుకుంది. ఓ ఫార్చ్యూనర్ కారును ట్రక్కుల మధ్య ఇరికించి.. దానిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో బీజేపీ నేత సజీవదహనమయ్యారు (BJP Leader Burnt Alive).
ప్రాథమిక నివేదికల ప్రకారం.. ఆ ప్రాంతంలోని ఇసుక క్వారీ కాంట్రాక్ట్ బీజేపీ నేత, మాజీ పంచాయతీ ప్రెసిడెంట్ భరత్ సింగ్ (Bharat Singh) కుటుంబానికి లభించింది. సోన్‌హట్, కైలాష్‌పూర్, తేలిముడ, బెలియా, ఛింగురా ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలు, రవాణాపై వివాదం నెలకొంది. మైనింగ్ కార్యకలాపాలకు సంబంధించిన అక్రమ వసూళ్లపై నియంత్రణ కోసం భరత్ సింగ్ వర్గానికి, మరో బీజేపీ నేత మనోజ్ త్రిపాఠి కుటుంబానికి మధ్య తీవ్రమైన ఘర్షణ నడుస్తోంది. ఈ క్రమంలో త్రిపాఠి కుటుంబం ముందస్తు ప్రణాళికతో మంగళవారం రాత్రి భరత్ సింగ్ వాహనంపై దాడి చేసింది.
భరత్ సింగ్ ఫార్చ్యూనర్ ఎస్‌యూవీ కారును ట్రక్కుల మధ్య ఇరికించి పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘోర ఉదంతం మంగళవారం అర్ధరాత్రి సోన్‌హట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నౌగైన్ గ్రామంలో జరిగింది. ఈ ఘటనలో భరత్ సింగ్‌తోపాటూ వీరేంద్ర సింగ్, నాగేంద్ర సింగ్ సజీవదహనమయ్యారు. ఇసుక క్వారీ నిర్వహణకు సంబంధించిన వివాదాన్ని పరిష్కరించుకోవడానికి, రాజీ చర్చల కోసం భరత్ సింగ్ అక్కడికి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే, ఓ పథకం ప్రకారం భరత్ సింగ్‌ను హతమార్చినట్లు ఆరోపించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అక్షత్ త్రిపాఠి, విశాల్ త్రిపాఠి, సత్యప్రకాష్ త్రిపాఠి, మన్ను త్రిపాఠిలను అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మొత్తం తొమ్మిది మంది నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. భారీగా పోలీసులు మోహరించారు.
Also Read..
బంగారం ధర రూ.2.13 లక్షలకా? జేపీ మోర్గాన్ షాకింగ్ అంచనా!
రష్యాపై అతిపెద్ద దాడి.. వందలాది డ్రోన్లతో విరుచుకుపడ్డ ఉక్రెయిన్
సంబంధిత వార్తలు

Uttamkumar Reddy | సమ్మక్క-సారక్క ఎత్తిపోతల పథకానికి NOC ఇవ్వండి
జూన్ 12, 2026

Chhattisgarh | “రోడ్లు వేయలేకపోతే.. మాకు హెలికాప్టర్లు ఇవ్వండి”.. అమిత్ షాకు ఛత్తీస్‌గఢ్ గిరిజనుల వినూత్న లేఖ
మే 26, 2026

Manne Krishank | ఇసుక తవ్వకాల ఆదాయంపై తప్పుదోవ పట్టించేలా ప్రభుత్వ గణాంకాలు: మన్నె క్రిశాంక్
ఏప్రిల్ 3, 2026
తాజావార్తలు
- ●RS Praveen Kumar | నన్ను గుండోడా అంటే.. మందు గుండునై మీ గుండెల్లో నిద్రపోతా
- ●Rayadurgam Land Auction | రాయదుర్గం ఎస్బీఐ భూముల వేలంపై హైకోర్టు స్టే
- ●Suhasini Mulay | అరవై ఏళ్ల వయసులో ప్రేమ పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి - ఫేస్బుక్ ద్వారా లవ్‌స్టోరీ మొదలు
- ●Hisense E8S | హైసెన్స్ కొత్త ఈ8ఎస్ మినీ-ఎల్ఈడీ టీవీలు.. 144హెడ్జ్ గేమింగ్‌తో అదిరిపోయిన ఫీచర్లు..
- ●Indigenous Hovercraft India | సముద్ర జలాల్లో మరింత పటిష్టంగా ఇండియన్ కోస్ట్‌గార్డ్.. తొలి స్వదేశీ 'హోవర్‌క్రాఫ్ట్' ఎంట్రీ!
- ●TGPSC | డైట్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

RS Praveen Kumar | నన్ను గుండోడా అంటే.. మందు గుండునై మీ గుండెల్లో నిద్రపోతా

Rayadurgam Land Auction | రాయదుర్గం ఎస్బీఐ భూముల వేలంపై హైకోర్టు స్టే

Suhasini Mulay | అరవై ఏళ్ల వయసులో ప్రేమ పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి - ఫేస్బుక్ ద్వారా లవ్‌స్టోరీ మొదలు

Hisense E8S | హైసెన్స్ కొత్త ఈ8ఎస్ మినీ-ఎల్ఈడీ టీవీలు.. 144హెడ్జ్ గేమింగ్‌తో అదిరిపోయిన ఫీచర్లు..



