త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jairam Ramesh | అది నేష‌న‌ల్ డిఫెక్ట‌ర్స్ అల‌య‌న్స్‌.. ఎన్డీయేకి 2/3 మెజారిటీ రాదు : జైరామ్ రమేష్

Jairam Ramesh | లోక్‌స‌భ‌లో మూడింట రెండు వంతుల మెజారిటీని (two thirds majority) సాధించేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌న‌వి కాంగ్రెస్ సీనియ‌ర్ నేత జైరామ్ రమేష్ (Jairam Ramesh) పేర్కొన్నారు.

D

National | Published On Jun 18, 2026, 4.27 pm IST

Jairam Ramesh | అది నేష‌న‌ల్ డిఫెక్ట‌ర్స్ అల‌య‌న్స్‌.. ఎన్డీయేకి 2/3 మెజారిటీ రాదు : జైరామ్ రమేష్
Advertisement

Jairam Ramesh | ప్ర‌తిప‌క్షాల నుంచి పార్టీ ఫిరాయింపులు కొన‌సాగుతున్న వేళ కాంగ్రెస్ సీనియ‌ర్ నేత జైరామ్ రమేష్ (Jairam Ramesh) కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఈమేర‌కు ఎన్డీయే (NDA) కూటమిని 'నేషనల్ డిఫెక్టర్స్ అలయన్స్' (National Defectors Alliance)గా అభివర్ణించారు. లోక్‌స‌భ‌లో మూడింట రెండు వంతుల మెజారిటీని (two thirds majority) సాధించేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌న‌వి పేర్కొన్నారు. షా దుష్ట ప్ర‌య‌త్నాల‌ను తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ నాయ‌క‌త్వం మిత్ర‌ప‌క్షాల‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ట్లు తెలిపారు.

ఈ ఏడాది ఏప్రిల్‌లో నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌కు సంబంధించిన రాజ్యాంగ స‌వ‌ర‌ణ బిల్లు లోక్‌స‌భ‌లో వీగిపోవ‌డంతో అమిత్ షా అవ‌మానాన్ని ఎదుర్కొన్నార‌ని కాంగ్రెస్ నేత వ్యాఖ్యానించారు. దానికి ప్ర‌తీకారం తీర్చుకునేందుకు ఆయ‌న ఇప్పుడు అత్యంత నీచ‌మైన చ‌ర్య‌లకు పాల్ప‌డుతున్నారంటూ విమ‌ర్శ‌లు గుప్పించారు. రాజ్యాంగంపై, ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్నారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

Also Read..

ఫార్చ్యూన‌ర్ కారును ట్ర‌క్కుల మ‌ధ్య ఇరికించి నిప్పు.. బీజేపీ నేత స‌జీవద‌హ‌నం

ర‌ష్యాపై అతిపెద్ద దాడి.. వంద‌లాది డ్రోన్ల‌తో విరుచుకుప‌డ్డ ఉక్రెయిన్‌

హైదరాబాద్‌లో పనీర్ తింటున్నారా? జాగ్రత్త.. అసలది పనీరే కాదు..!

Advertisement
Advertisement