త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Silk saree | రూ.150కే ప‌ట్టుచీర‌.. ఈ హోల్‌సేల్ మార్కెట్ల గురించి తెలుసా..?

Silk saree | షోరూమ్‌లలో ఖరీదైన బనారసి, కాంచీవరం, డిజైనర్ చీరలు హోల్‌సేల్ మార్కెట్ల‌లో సగం కంటే తక్కువ ధరలకే లభిస్తున్నాయి. మ‌రి ఆ హోల్‌సేల్ మార్కెట్లు (Saree Wholesale Market) ఎక్క‌డున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ప‌దండి..

D

National | Published On Apr 22, 2026, 1.00 pm IST

Silk saree | రూ.150కే ప‌ట్టుచీర‌.. ఈ హోల్‌సేల్ మార్కెట్ల గురించి తెలుసా..?
Advertisement

Silk saree | ప్రపంచ వస్త్రధారణలో చీర (Saree) స్థానం ఎప్పటికీ పై మెట్టే. ప్రపంచానికి చీర అందం పరిచయం చేసిన ఘనత మన దేశానికే దక్కుతుంది. అందంగా కనిపించేందుకు రకరకాల దుస్తులు ధరిస్తుంటాం. ఎన్ని రకాల దుస్తులు ధరించినా.. చీర ఇచ్చే అందం మరేవీ ఇవ్వలేవు. ఈవెంట్‌ ఏదైనా భారతీయ మహిళలు చీర కట్టులో మెరవాల్సిందే. అందుకే పెళ్లిళ్లు, శుభకార్యాలు వచ్చాయంటే చాలు.. మ‌హిళ‌ల చూపు చీర‌ల‌పైనే ఉంటుంది.

అయితే, ఆధునిక ఫ్యాషన్ యుగానికి త‌గ్గ‌ట్టు ట్రెండీగా, రిచ్ లుక్‌లో క‌నిపించాలంటే వేలు, ల‌క్ష‌ల్లో పెట్టి చీర‌ల‌ను కొగులోలు చేయాల్సి వ‌స్తోంది. దీంతో చాలా మంది అంత ఖ‌ర్చు చేయ‌లేక త‌క్కువ ధ‌ర‌కే చీర‌ల కోసం వెతుకుతుంటారు. అలాంటి వారి కోస‌మే ఈ వార్త‌. మ‌న దేశంలో చాలా హోల్‌సేల్ మార్కెట్స్ ఉన్నాయి. అక్క‌డ చీర‌లు చాలా త‌క్కువ ధ‌ర‌కే మ‌నం కొనుగోలు చేయొచ్చు. షోరూమ్‌లలో ఖరీదైన బనారసి, కాంచీవరం, డిజైనర్ చీరలు హోల్‌సేల్ మార్కెట్ల‌లో సగం కంటే తక్కువ ధరలకే లభిస్తున్నాయి. మ‌రి ఆ హోల్‌సేల్ మార్కెట్లు (Saree Wholesale Market) ఎక్క‌డున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ప‌దండి..

చాందినీ చౌక్‌.. ఆసియాలోనే అతిపెద్ద టోకు మార్కెట్ల‌లో ఒక‌టి..

దేశ రాజ‌ధాని ఢిల్లీ (Delhi)లో షాపింగ్ చేయాలంటే అంద‌రికీ ముందుగా గుర్తొచ్చేది చాందినీ చౌక్ (Chandni Chowk) మార్కెటే. చీరలు, నగలు, సుగంధ ద్రవ్యాలు, ఎలక్ట్రానిక్స్, పెళ్లి బ‌ట్ట‌ల‌కు ఇది ప్ర‌సిద్ధి. ఇది ఆసియాలోనే అతిపెద్ద టోకు మార్కెట్లలో ఒకటి. ఇక్క‌డ దొర‌క‌నివంటూ ఏవీ ఉండ‌వు. ఢిల్లీని సంద‌ర్శించే వారు క‌చ్చితంగా ఇక్క‌డ షాపింగ్ చేయాల్సిందే. అందుకే ఆ ప్రాంత‌మంతా నిత్యం ర‌ద్దీగా ఉంటుంది.

మ‌హిళ‌ల‌కు ఇక్క‌డికి వెళ్తే పండ‌గ‌నే చెప్పాలి. ఎందుకంటే బనారసి, పట్టు, కాటన్, రోజువారీ వాడే చీరల నుంచి సెల‌బ్రిటీలు క‌ట్టుకునే డిజైన‌ర్ చీర‌ల వ‌ర‌కూ అన్నీ ఇక్క‌డ ల‌భిస్తాయి. అది కూడా కేవ‌లం రూ.500 నుంచే ధ‌ర‌లు ప్రారంభ‌మ‌వుతాయి. ఈ మార్కెట్ ఎర్ర‌కోట‌కు స‌మీపంలో ఉంటుంది. ప్ర‌తి రోజూ ఉద‌యం 10 గంట‌ల నుంచి రాత్రి 9 గంట‌ల వర‌కూ షాప్‌లు ఓపెన్‌లోనే ఉంటాయి. ఆదివారం మాత్రం సెల‌వు ఉంటుంది.

కోల్‌కతా బుర్రా బజార్.. రూ.150కే చీర‌

బెంగాలీ చేనేత చీరలు లేదా నిత్యం ఆఫీసు వేర్ కోసం చీరలు కావాలంటే కోల్‌కతా (Kolkata)లోని బుర్రా బజార్ (Burra Bazaar) బెస్ట్‌. ఇది దేశంలోని అతిపెద్ద, పురాత‌న హోల్‌సేల్ మార్కెట్ల‌లో ఒక‌టి. ఇక్క‌డ బ‌ట్ట‌లు, ఇత‌ర వ‌స్తువులు అతి త‌క్కువ ధ‌ర‌కే ల‌భిస్తాయి. కాటన్, సిల్క్, హ్యాండ్లూమ్, సింథటిక్, బంధాని, సంప్రదాయ బెంగాలీ కాటన్ చీరలు, పార్టీవేర్‌, వెడ్డింగ్ చీర‌లు హోల్‌సేల్ ధ‌ర‌ల‌కే ల‌భిస్తాయి. రూ.150 నుంచి రూ.3000 మధ్యలోనే రోజువారీ, పార్టీ వేర్ చీరలు దొరుకుతాయి. ఇక ఈ మార్కెట్ రోజూ ఉద‌యం 10 గంట‌ల‌కు ఓపెన్ అవుతుంది. రాత్రి 9 గంట‌ల వ‌ర‌కూ అందుబాటులో ఉంటుంది. ఆదివారం మాత్రం మార్కెట్ క్లోజ్ చేస్తారు.

100 ఏళ్ల చ‌రిత్ర‌గ‌ల‌.. మంగళదాస్ మార్కెట్

ముంబై (Mumbai)లోని లోహార్ చాల్ ఉన్న మంగళదాస్ మార్కెట్‌ (Mangaldas Market)కు వందేళ్ల చ‌రిత్ర ఉంది. ఇది ఇండో-వెస్ట్రన్, లేటెస్ట్ ప్రింటెడ్ చీరలకు పెట్టింది పేరు. ఇక్కడ ఒకే సందులో పదుల సంఖ్యలో దుకాణాలు ఉంటాయి. ఈ దుకాణాలు నిత్యం కిట‌కిట‌లాడుతుంటాయి. ఇక్క‌డ సిల్క్, కాటన్, ఎంబ్రాయిడరీ వంటి వివిధ రకాల వస్త్రాలు, చీరలు హోల్‌సేల్ ధరకే లభిస్తాయి. ఈ మార్కెట్‌లోని దుకాణదారులు ఎప్పటికప్పుడు కొత్త డిజైన్లతో పోటాపోటీగా త‌క్కువ ధ‌ర‌ల‌కే చీర‌ల‌ను అమ్ముతూ క‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ర్షిస్తుంటారు. అందుకే మ‌హిళ‌ల‌కు ఈ మార్కెట్‌కు పోటెత్తుతుంటారు. పెళ్లిళ్లు, పండ‌గ‌లు వంటి సంద‌ర్భాల్లో ఆ ప్రాంతం ఇసుకేస్తే రాల‌నంత జ‌నంతో కిక్కిరిపోతుంటుంది.

సీరియ‌ల్ యాక్ట‌ర్స్ మెచ్చిన సూర‌త్‌..

వీటితోపాటూ మ‌రికొన్ని హోల్‌సేల్ మార్కెట్లు కూడా ఉన్నాయి. గుజ‌రాత్‌లోని సూర‌త్ కూడా చీర‌లు ,ఇత‌ర వ‌స్త్రాల‌కు ప్ర‌సిద్ధి. కొత్త‌గా వ్యాపారం పెట్టాల‌నుకునేవారు, పెళ్లిళ్లు, ఇత‌ర శుభ‌కార్యాల‌కు రిట‌ర్న్‌గిఫ్ట్‌గా ఇవ్వాల‌నుకునేవారు ఇక్క‌డే ఎక్కువ‌గా షాపింగ్ చేస్తుంటారు. ఇక మ‌న సీరియ‌ల్ సెలబ్రిటీలు కూడా ఎక్కువ‌గా సూర‌త్ టెక్స్‌టైల్స్ మార్కెట్‌నే సంద‌ర్శిస్తుంటారు. సీరియ‌ల్‌లో త‌మ క్యారెక్ట‌ర్‌కు త‌గ్గ‌ట్టు ర‌క‌ర‌కాల చీర‌ల‌ను త‌క్కువ ధ‌ర‌కే కొనుగోలు చేస్తుంటారు.

Also Read..

నెల నెలా చెల్లించే SIPలు ఫెయిలైతే న‌ష్ట‌మే.. బ్యాలెన్స్ ఉండ‌డం త‌ప్పనిస‌రి..

హైకోర్టు తీర్పుతో రేవంత్ రెడ్డి నిజస్వరూపం బ‌య‌ట‌ప‌డింది..: హ‌రీశ్ రావు

30ల‌లో ఉన్న‌వారికి వైద్యుల అల‌ర్ట్‌.. బ్ల‌డ్ ప్రెష‌ర్ కాస్త ఎక్కువ ఉన్నా జాగ్ర‌త్త వ‌హించాల్సిందే..

Advertisement
Advertisement