Sharad Pawar | మళ్లీ ఆసుపత్రిలో చేరిన శరద్ పవార్
Sharad Pawar | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar) మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రి (Mumbais Breach Candy Hospital)లో చేరారు. ఈ విషయాన్ని పవార్ కుమార్తె సుప్రియా సూలే వెల్లడించారు.
Sharad Pawar | త్రినేత్ర న్యూస్ : నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar) మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ముంబై (Mumbai)లోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రి (Breach Candy Hospital)లో చేరారు. ఆయనలో డీహైడ్రేషన్ సమస్య ఉన్నట్లు కనిపిస్తోందని కుమార్తె, ఎంపీ సుప్రియా సూలే (Supriya Sule) తెలిపారు. 85 ఏళ్ల శరద్ పవార్ పనిభారం తగ్గించుకుని విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని తెలిపారు. అయినప్పటికీ ఆయన ఎవరిమాటా వినకుండా తీరికలేకుండా గడుపుతున్నారని చెప్పుకొచ్చారు.
ఛాతి, శ్వాసకోస ఇన్‌ఫెక్షన్ కారణంగా పవార్ నవంబర్ 5న కూడా ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందిన విషయం తెలిసిందే. అంతకముందు నవంబర్ 2న ఛాతీ నొప్పితో ఇబ్బంది పడుతూ పుణెలోని రూబి హాల్ క్లినిక్‌లో ఆయన చికిత్స పొందారు. ఆ తర్వాత నవంబర్ 4న డిశ్చార్జ్ అయ్యారు. అదేరోజు రాత్రి మెరుగైన చికిత్స కోసం ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చేరారు. మూడు రోజులుగా చికిత్స పొందిన పవార్.. నవంబర్ 7న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కేవలం 20 రోజుల వ్యవధిలోనే మరోసారి ఆసుపత్రిలో చేరడంతో పార్టీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
Also Read..
పాకిస్థాన్ కంటెంట్‌ను భారత్‌లో ప్రసారం చేయొద్దు.. నెట్‌ఫ్లిక్స్‌కు కేంద్రం కీలక ఆదేశాలు
రన్‌వేపై నాలుగు విమానాలు ల్యాండింగ్.. భారత సైన్యం అసాధారణ ఫీట్..!
సంబంధిత వార్తలు

26/11 Terror Attacks | 26/11 ముంబై ఉగ్రదాడి.. అమరులకు ప్రముఖుల నివాళులు
నవంబర్ 26, 2026

Sridhar Babu | తెలంగాణకు రండి.. ఇక్కడే ఉత్పత్తి చేయండి
నవంబర్ 18, 2026

SpiceJet Flight Delay Mumbai | ముంబై ఎయిర్‌పోర్టులో స్పైస్‌జెట్ ప్రయాణికుల ఆగ్రహం.. రాత్రి 7 గంటల నుంచి నిలిచిపోయిన విమానాలు
నవంబర్ 18, 2026
తాజావార్తలు
- ●Dasoju Sravan | భవిష్యత్ తరాలకు మంచి దేశాన్నివ్వాలి.. అందుకు రాజ్యాంగం చదవాలి
- ●Sai Pallavi | రామాయణకు అమిత్‌షా అభినందనలు - కేంద్రమంత్రిని కలిసిన రణబీర్, సాయిపల్లవి
- ●Web Series | పాకిస్థాన్ కంటెంట్‌ను భారత్‌లో ప్రసారం చేయొద్దు.. నెట్‌ఫ్లిక్స్‌కు కేంద్రం కీలక ఆదేశాలు
- ●FII Buying | నవంబర్‌లో ఎఫ్ఐఐల రికార్డు కొనుగోళ్లు.. రూ.1.22 లక్షల కోట్ల పెట్టుబడులు..
- ●High Court | కోర్టు ధిక్కరణ కేసు.. సీపీ రమేశ్‌రెడ్డి, డీసీపీ కోటిరెడ్డికి జైలు శిక్ష
- ●Indian Army microlight aircraft | రన్‌వేపై నాలుగు విమానాలు ల్యాండింగ్.. భారత సైన్యం అసాధారణ ఫీట్..!

Dasoju Sravan | భవిష్యత్ తరాలకు మంచి దేశాన్నివ్వాలి.. అందుకు రాజ్యాంగం చదవాలి

Sai Pallavi | రామాయణకు అమిత్‌షా అభినందనలు - కేంద్రమంత్రిని కలిసిన రణబీర్, సాయిపల్లవి

Web Series | పాకిస్థాన్ కంటెంట్‌ను భారత్‌లో ప్రసారం చేయొద్దు.. నెట్‌ఫ్లిక్స్‌కు కేంద్రం కీలక ఆదేశాలు

FII Buying | నవంబర్‌లో ఎఫ్ఐఐల రికార్డు కొనుగోళ్లు.. రూ.1.22 లక్షల కోట్ల పెట్టుబడులు..



