High Blood Pressure | 30లలో ఉన్నవారికి వైద్యుల అలర్ట్.. బ్లడ్ ప్రెషర్ కాస్త ఎక్కువ ఉన్నా జాగ్రత్త వహించాల్సిందే..
High Blood Pressure | హై బ్లడ్ ప్రెషర్ లేదా హైపర్‌టెన్షన్.. చాలా సాధారణంగా కనిపించే సమస్యగా ఉన్నప్పటికీ చాలామంది దాన్ని పెద్దగా ప్రమాదకరంగా భావించరు. అయితే ఎవరైనా తమ 30లలో ఉంటే తాము పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నట్టు అనిపించినా, బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంటే దాని ప్రభావాలు వెంటనే కనిపించవు.
High Blood Pressure | హై బ్లడ్ ప్రెషర్ లేదా హైపర్‌టెన్షన్.. చాలా సాధారణంగా కనిపించే సమస్యగా ఉన్నప్పటికీ చాలామంది దాన్ని పెద్దగా ప్రమాదకరంగా భావించరు. అయితే ఎవరైనా తమ 30లలో ఉంటే తాము పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నట్టు అనిపించినా, బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంటే దాని ప్రభావాలు వెంటనే కనిపించవు. 10 లేదా 20 సంవత్సరాల తరువాత ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీసే అవకాశం ఉంటుంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఈపీఐ, లైఫ్‌స్టైల్ సైంటిఫిక్ సెషన్స్ 2026లో ప్రదర్శించిన ప్రాథమిక పరిశోధన ప్రకారం యుక్త వయస్సులో అధిక బ్లడ్ ప్రెషర్ ఉండటం భవిష్యత్తులో గుండె వ్యాధులు, మూత్రపిండాల వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుందని వెల్లడైంది. దీని వల్ల చిన్న వయస్సు నుంచే ఆరోగ్యకరమైన బ్లడ్ ప్రెషర్‌ను నిర్వహించాల్సిన అవసరం ఏర్పడిందని నిపుణులు చెబుతున్నారు.
3 లక్షల మందిపై అధ్యయనం..
సాధారణంగా యువత గుండెపోటు లేదా కిడ్నీ ఫెయిల్యూర్ గురించి పెద్దగా ఆలోచించరు, ఎందుకంటే ఇవి పెద్దవారి సమస్యలుగా భావిస్తారు. వారి తక్షణ ప్రమాదం తక్కువగా ఉండటం వల్ల 30లలో స్వల్పంగా ఉన్న హై బ్లడ్ ప్రెషర్‌ను తరచూ నిర్లక్ష్యం చేస్తారు. అయితే దాదాపు 3 లక్షల మందిని పరిశీలించిన ఈ అధ్యయనం బ్లడ్ ప్రెషర్‌ను నెమ్మదిగా పనిచేసే సూచికగా పేర్కొంది. 30లలో బ్లడ్ ప్రెషర్ కొద్దిగా పెరిగినా, అది ఎక్కువకాలం కొనసాగితే శరీరాన్ని ముందుగానే దెబ్బతీస్తుంది. ముందు ఆరోగ్యంగా అనిపించినా, ఆ దశాబ్దం పాటు ఉన్న అధిక ఒత్తిడి రక్తనాళాలు, అవయవాలపై నష్టం కలిగిస్తుంది. దీని ఫలితంగా 40లు, 50లలో తీవ్రమైన వ్యాధుల ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది.
దీర్ఘకాలం పాటు బీపీ ఎక్కువ ఉంటే..
కాగా పరిశోధకులు తమ అధ్యయనంలో పాల్గొన్న వారి బ్లడ్ ప్రెషర్‌ను 30 నుండి 40 ఏళ్ల మధ్య 10 సంవత్సరాల పాటు గమనించి, 40 ఏళ్ల తర్వాత వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. సిస్టోలిక్ (పై సంఖ్య) రీడింగ్ సగటు కంటే కేవలం 10 పాయింట్లు ఎక్కువగా ఒక దశాబ్దం పాటు ఉంటే గుండె వ్యాధుల ప్రమాదం 27 శాతం పెరిగిందని, కిడ్నీ వ్యాధుల ప్రమాదం 22 శాతం పెరిగిందని తేల్చారు. అలాగే డయాస్టోలిక్ (కింద సంఖ్య) రీడింగ్ కేవలం 5 పాయింట్లు ఎక్కువగా ఉన్నా గుండె వ్యాధుల ప్రమాదం 20 శాతం, కిడ్నీ వ్యాధుల ప్రమాదం 16 శాతం పెరిగినట్లు తేల్చారు. 30లలో అత్యధిక సమిష్టి బ్లడ్ ప్రెషర్ ఉన్న వ్యక్తులు, తక్కువ స్థాయిలున్న వారితో పోలిస్తే గుండె సమస్యలు ఎదుర్కొనే అవకాశం 3.5 రెట్లు ఎక్కువగా ఉండగా, కిడ్నీ వ్యాధులు వచ్చే ప్రమాదం 3 రెట్లు ఎక్కువగా ఉందని గుర్తించారు.

లక్ష్యం 120/80..
బ్లడ్ ప్రెషర్ అధికారికంగా హైపర్‌టెన్షన్‌గా నిర్ధారణ కాలేదు కానీ కొద్దిగా పెరిగి ఉన్నా కూడా, అది కొన్ని సంవత్సరాల తరువాత గుండె వైఫల్యం లేదా కిడ్నీ పనితీరు తగ్గుదల రూపంలో నష్టాన్ని కలిగిస్తుంది. చాలా సందర్భాల్లో వైద్యులు స్వల్పంగా ఉన్న హై బ్లడ్ ప్రెషర్ కు చికిత్స చేయకరు. కానీ ఈ అధ్యయనం ద్వారా పరిశోధకులు వైద్యులు పాటించే ఆ విధానాన్ని పొరపాటుగా పేర్కొన్నారు. దీర్ఘకాల ప్రభావమే ప్రధాన ప్రమాదానికి కారణమని చెప్పారు. పురుషులు, మహిళలు అనే తేడా లేకుండా, అలాగే స్మోకింగ్ లేదా బరువు వంటి ఇతర జీవనశైలి అంశాలకు సంబంధం లేకుండా ఈ ఫలితాలు ఒకే విధంగా కనిపించాయి. 120/80 లక్ష్యం, దీనికంటే పైగా ఉన్న ఏ స్థాయి అయినా, ప్రీ-హైపర్‌టెన్షన్ అయినా సరే, నిర్లక్ష్యం చేయకూడదు. 30లలో బ్లడ్ ప్రెషర్‌ను నియంత్రించడం అంటే ఇప్పటి ఆరోగ్యం కోసం మాత్రమే కాదు, 50లలో గుండె లేదా కిడ్నీ సమస్యలను నివారించేందుకు కూడా అవసరమని భావించాలి.
లక్షణాల కోసం వేచి చూడొద్దు..
లక్షణాల కోసం వేచి ఉండకుండా ముందుగానే స్పందించాలి. హై బ్లడ్ ప్రెషర్‌ను సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు, ఎందుకంటే ఇది లక్షణాలు లేకుండానే గుండె లేదా కిడ్నీలకు నష్టం కలిగిస్తుంది. బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉన్నప్పుడు గుండె శరీరం మొత్తానికి రక్తాన్ని పంపించడానికి ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది. ఈ అదనపు ఒత్తిడి వల్ల గుండె కండరాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. దీని వల్ల గుండె సమర్థవంతంగా పనిచేయడం కష్టమవుతుంది. దీర్ఘకాలంగా హై బ్లడ్ ప్రెషర్ ఉంటే గుండె వైఫల్యం వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాగే రక్తనాళాలు దెబ్బతిని అవి గట్టిపడటం, ఇరుకుగా మారడం వల్ల గుండె వ్యాధులు, గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాలు పెరుగుతాయి. ఇక కిడ్నీలలో చిన్న చిన్న రక్తనాళాలు ఉంటాయి, ఇవి రక్తంలో వ్యర్థాలను వడబోస్తాయి. హై బ్లడ్ ప్రెషర్ ఈ నాళాలను దెబ్బతీసి వడబోత సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. దీని వల్ల శరీరంలో వ్యర్థాలు పేరుకుపోతాయి. కాలక్రమేణా ఇది క్రానిక్ కిడ్నీ డిసీజ్ (సీకేడీ) కి దారి తీస్తుంది. చివరికి కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చి డయాలసిస్ లేదా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ అవసరం అవుతుంది. ఇది కిడ్నీల ద్రవాలు, ఎలెక్ట్రోలైట్ సమతౌల్యాన్ని నియంత్రించే సామర్థ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది, దీని వల్ల ఎడిమా (వాపు), పొటాషియం వంటి ముఖ్యమైన ఖనిజాల అసమతౌల్యం ఏర్పడుతుంది.
బ్లడ్ ప్రెషర్‌ను నియంత్రించడం గుండె, కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అత్యంత కీలకం. క్రమం తప్పకుండా చెకప్‌లు, సమతుల్య ఆహారం, వ్యాయామం, అవసరమైతే మందులు తీసుకోవడం ద్వారా హైపర్‌టెన్షన్‌ను నియంత్రించి ఈ ప్రమాదాలను తగ్గించుకోవచ్చు. దీంతో 40లు, 50లలోనూ గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హఠాన్మరణం లేదా కార్డియాక్ అరెస్ట్, గుండె పోటు సంభవించకుండా ముందుగానే జాగ్రత్త పడవచ్చు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Heat Stroke | ఎండల్లో జాగ్రత్త.. హీట్ స్ట్రోక్ వస్తే ఈ 10 లక్షణాలు కనిపిస్తాయి.. లైట్ తీసుకుంటే ప్రాణాలకే ప్రమాదం..
మే 21, 2026

Upper Body Strength Yoga | జిమ్ వద్దు.. బరువులూ ఎత్తొద్దు: మీ ‘అప్పర్ బాడీ’ని ఐరన్‌లా మార్చే బెస్ట్ యోగాసనాలు ఇవే!
మే 17, 2026

Eyes Health | కంటి చూపు స్పష్టంగా ఉన్నంత మాత్రాన కళ్లు ఆరోగ్యంగా ఉన్నట్లు కాదు.. వైద్యులు ఏమంటున్నారు..?
మే 16, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



