త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | హైకోర్టు తీర్పుతో రేవంత్ రెడ్డి నిజస్వరూపం బ‌య‌ట‌ప‌డింది..: హ‌రీశ్ రావు

Harish Rao | ఎవ‌రు ఎన్ని కుట్ర‌లు చేసినా ధ‌ర్మం జ‌యించింద‌ని బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హ‌రీశ్ రావు (Harish Rao) అన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) ప్రజా సమస్యలు పక్కనపెట్టి డ్రామాలాడార‌ని, హైకోర్టు తీర్పుతో (High Court) ఆయ‌న‌ నిజ స్వరూపం బయటపడింద‌ని విమ‌ర్శించారు.

G

Telangana | Published On Apr 22, 2026, 12.26 pm IST

Harish Rao | హైకోర్టు తీర్పుతో రేవంత్ రెడ్డి నిజస్వరూపం బ‌య‌ట‌ప‌డింది..: హ‌రీశ్ రావు
Advertisement

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్‌: ఎవ‌రు ఎన్ని కుట్ర‌లు చేసినా ధ‌ర్మం జ‌యించింద‌ని బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హ‌రీశ్ రావు (Harish Rao) అన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) ప్రజా సమస్యలు పక్కనపెట్టి డ్రామాలాడార‌ని, హైకోర్టు తీర్పుతో (High Court) ఆయ‌న‌ నిజ స్వరూపం బయటపడింద‌ని విమ‌ర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయ కుట్రలు బట్టబయలయ్యాయని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్‌ కక్ష సాధింపులు ఆపాల‌ని హిత‌వు ప‌లికారు. వెంటనే రెండు పిల్లర్ల మరమ్మతులు పూర్తి చేసి తెలంగాణ రైతుల ప్రయోజనాలు కాపాడాలన్నారు. ముమ్మాటికీ కాళేశ్వరం తెలంగాణకు ప్రాణేశ్వర‌మేన‌ని స్ప‌ష్టం చేశారు.

కాళేశ్వ‌రం ప్రాజెక్టు కేసులో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, హరీశ్‌ రావుకు హైకోర్టులో ఊరట లభించింది. జస్టిస్ పీసీ ఘోష్‌ కమిషన్‌ రిపోర్టును రాష్ట్ర అత్యున్న‌త న్యాయ‌స్థౄనం నిలిపివేసింది. రిపోర్టు ఆధారంగా చర్చలు తీసుకోవద్దని తీర్పు వెలువ‌రించింది. ఈ నేపథ్యంలో హరీశ్‌ రావు ఎక్స్ వేదిక‌గా సత్యమేవ జయతే అంటూ ట్వీట్‌ చేశారు.

`ఎవరెన్ని కుట్రలు చేసినా న్యాయస్థానాల్లో అంతిమంగా ధర్మం జయిస్తుందని, సత్యం నినదిస్తుందని ఈరోజు మరోసారి నిరూపితమైంది. ప్రాథమిక హక్కులు, సహజ న్యాయ సూత్రాలను విస్మరిస్తూ నడిపిన విచారణను ఉన్నత న్యాయస్థానం తప్పుబట్టింది. వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా కమిషన్ చేసిన వ్యాఖ్యలు చెల్లవని, ఆ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోరాదని స్పష్టంగా తీర్పునిచ్చింది.

దీంతో కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయ కుట్రలు బట్టబయలయ్యాయి. ప్రజా సమస్యలు పక్కనపెట్టి డ్రామాలు ఆడిన రేవంత్ రెడ్డి నిజస్వరూపం హైకోర్టు తీర్పుతో తేటతెల్లం అయ్యింది. ఇప్పటికైనా కక్షసాధింపులు, రాజకీయ దుష్ప్రచారం మానేసి వెంటనే రెండు పిల్లర్ల మరమ్మతులు పూర్తి చేసి తెలంగాణ రైతుల ప్రయోజనాలు కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరు ఔనన్నా కాదన్నా.. ముమ్మాటికీ కాళేశ్వరం తెలంగాణకు ప్రాణేశ్వరం..` అంటూ హ‌రీశ్ రావు ట్వీట్ చేశారు.

Advertisement
Advertisement