DK Shivakumar | జూన్ 3న సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం
DK Shivakumar | కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రి ( Karnataka CM)గా డీకే శివకుమార్ (DK Shivakumar) ప్రమాణ స్వీకారోత్సవానికి ముహూర్తం ఖరారైంది. జూన్ 3న డీకే సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలిసింది. కొత్త నాయకుడిని అధికారికంగా ఎన్నుకునేందుకు కాంగ్రెస్ శాసనసభా పక్షం (CLP) ఇవాళ విధాన సౌధలో సమావేశం కానుంది.
DK Shivakumar | సిద్ధరామయ్య (Siddaramaiah) రాజీనామాను గవర్నర్ ఆమోదించడంతో.. తదుపరి ప్రభుత్వ ఏర్పాటు కోసం కాంగ్రెస్ పార్టీ (Karnataka Congress) చకచకా ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. వచ్చేనెల అంటే జూన్ 3వ తేదీన ఆ రాష్ట్ర 25వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ (DK Shivakumar) ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. లోక్‌భవన్‌లో ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. పార్టీ సీనియర్ నేతలు, మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నట్లు తెలుస్తోంది.
ఇక కొత్త నాయకుడిని అధికారికంగా ఎన్నుకునేందుకు కాంగ్రెస్ శాసనసభా పక్షం (CLP) శనివారం సమావేశం కానుంది. ఇవాళ సాయంత్రం విధాన సౌధలో సీఎల్పీ సమావేశం జరగనుంది. ఈ భేటీలో డీకే శివకుమార్‌ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోనున్నారు. కొత్త ప్రభుత్వంలో సిద్ధరామయ్య కుమారుడు యతీంద్రకు చోటుదక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై కాంగ్రెస్ హైకమాండ్‌తో సిద్ధూ ఇప్పటికే చర్చలు కూడా జరిపారు. తన కుమారుడికి కీలక శాఖలు కేటాయించాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సిద్ధరామయ్య విజ్ఞప్తి చేశారు.
Also Read..
స్టార్ నటుడు అజిత్ ఇంట తీవ్ర విషాదం
వారం రోజుల్లో 'ఈవినింగ్ బీటెక్ కోర్సు'లకు నోటిఫికేషన్.. వివరాలివే..!
హైటెక్స్ వేదికగా.. జూన్ 5 నుంచి 7 వరకు పోచంపల్లి ఇక్కత్ వస్త్రాల ఎగ్జిబిషన్..!
సంబంధిత వార్తలు

DK Shivakumar | 1971 జనాభా లెక్కల ఆధారంగానే డీలిమిటేషన్ చేపట్టాలి : డీకే శివకుమార్
ఆగస్టు 20, 2026

Lord Uday Nagaraju | కర్ణాటక సీఎంతో లార్డ్ ఉదయ్ నాగరాజు భేటీ..
ఆగస్టు 8, 2026

DK Shivakumar | రాజీనామా చేస్తే.. క్షణం ఆలోచించకుండా ఆమోదిస్తా.. అసమ్మతి ఎమ్మెల్యేలకు డీకే స్ట్రాంగ్ వార్నింగ్
ఆగస్టు 4, 2026
తాజావార్తలు
- ●CM Revanth Reddy | గాయత్రి గోపీచంద్, ట్రీసా జాలీలను అభినందించిన సీఎం రేవంత్
- ●HYDRAA | విద్యార్థుల భద్రతే ముఖ్యం.. ఫేక్ ఫైర్ ఎన్వోసీలపై కాలేజీలకు హైడ్రా దిశానిర్దేశం
- ●Irrigation Projects | భూసేకరణకు రూ.6 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ
- ●Ganesh Festival | గణేష్ ఉత్సవాల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
- ●Harish Rao | జీవో 97 రద్దు చేయకపోతే.. లక్ష మందితో సచివాలయం ముట్టడి
- ●Rahul Ramakrishna | కట్టె కాలే వరకు కేసీఆర్ వెంటే.. రాహుల్ ఎమోషన్ ట్వీట్

CM Revanth Reddy | గాయత్రి గోపీచంద్, ట్రీసా జాలీలను అభినందించిన సీఎం రేవంత్

HYDRAA | విద్యార్థుల భద్రతే ముఖ్యం.. ఫేక్ ఫైర్ ఎన్వోసీలపై కాలేజీలకు హైడ్రా దిశానిర్దేశం

Irrigation Projects | భూసేకరణకు రూ.6 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ

Ganesh Festival | గణేష్ ఉత్సవాల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు



