Siddaramaiah | డీకేకు రూట్ క్లియర్.. సిద్ధరామయ్య రాజీనామాకు గవర్నర్ ఆమోదం
Siddaramaiah | కర్ణాటక (Karnataka) తదుపరి సీఎంగా డీకే శివకుమార్‌కు (DK Shivakumar) మార్గం సుగమమైంది. సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah) రాజీనామాను గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్ (Thawar Chand Gehlot) ఆమోదించారు.
Siddaramaiah | త్రినేత్ర.న్యూస్: కర్ణాటక (Karnataka) తదుపరి సీఎంగా డీకే శివకుమార్‌కు (DK Shivakumar) మార్గం సుగమమైంది. సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah) రాజీనామాను గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్ (Thawar Chand Gehlot) ఆమోదించారు. పార్టీ అధిష్ఠానం ఆదేశాలతో గురువారం తన ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే గవర్నర్ మధ్యప్రదేశ్ పర్యటనలో ఉండటంతో లోక్‌భవన్‌కు వెళ్లిన ఆయన గవర్నర్ ప్రత్యేక కార్యదర్శి ప్రభుశంకర్‌కు రాజీనామా పత్రం సమర్పించారు. అర్ధరాత్రి బెంగళూరు చేరుకున్న గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్ శుక్రవారం ఉదయం రాజీనామాను ఆమోదించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరారు.
కాగా, సిద్ధరామయ్యతోపాటు డీకే శివకుమార్, కర్ణాటక కాంగ్రెస్ ముఖ్యనేతలు గురువారం సాయంత్రం ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్నారు. మరికాసేపట్లో రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనాయకులతో సిద్ధరామయ్య భేటీ కానున్నారు. కర్ణాటకలో తదుపరి ముఖ్యమంత్రి ఎంపిక, మంత్రివర్గ కూర్పుపై చర్చించే అవకాశం ఉంది. పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో డీకే శివకుమార్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.

తాజావార్తలు
- ●Japanese Walking Technique | 10,000 అడుగుల టార్గెట్ కష్టంగా ఉందా? అయితే ఈ 'జపనీస్ వాకింగ్ టెక్నిక్' మీ కోసమే!
- ●Kedarnath Mule Viral Video | కేదార్నాథ్ యాత్రలో మూగజీవికి నరకం: 140 కిలోల వ్యక్తి ప్రయాణం.. భక్తి పేరుతో ఇంత క్రూరత్వమా?
- ●Naga Chaitanya Samantha Divorce | సమంత కెరీర్ నాశనం చేశానా? ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నాగ చైతన్య
- ●Telangana Formation Day | రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధం.. జెండా ఎగురవేసే ప్రముఖుల జాబితా విడుదల
- ●Congress CLP Leader Karnataka | కర్ణాటక కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేతగా డీకే శివకుమార్ ఏకగ్రీవ ఎన్నిక
- ●TG Weather | తెలంగాణ వాసులకు ఎండల నుంచి ఉపశమనం.. నాలుగు రోజులు వర్షాలేనన్న ఐఎండీ..!

Japanese Walking Technique | 10,000 అడుగుల టార్గెట్ కష్టంగా ఉందా? అయితే ఈ 'జపనీస్ వాకింగ్ టెక్నిక్' మీ కోసమే!

Kedarnath Mule Viral Video | కేదార్నాథ్ యాత్రలో మూగజీవికి నరకం: 140 కిలోల వ్యక్తి ప్రయాణం.. భక్తి పేరుతో ఇంత క్రూరత్వమా?

Naga Chaitanya Samantha Divorce | సమంత కెరీర్ నాశనం చేశానా? ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నాగ చైతన్య

Telangana Formation Day | రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధం.. జెండా ఎగురవేసే ప్రముఖుల జాబితా విడుదల






