త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tollywood | తెలంగాణ యాస వ‌చ్చినోళ్ల‌కు సినిమా ఛాన్స్ – జ‌మ్మికుంట క‌థ‌తో రాజు వెడ్స్ రాంబాయి మేక‌ర్స్ కొత్త మూవీ

రాజువెడ్స్ రాంబాయి బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత ఈ బ్యాన‌ర్ నుంచి మ‌రో సినిమా రాబోతుంది. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో జ‌మ్మికుంట ఊరి క‌థ‌తో ఈ మూవీ తెర‌కెక్క‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. తెలంగాణ యాస వ‌చ్చిన కొత్త న‌టీన‌టుల‌కు ఈ సినిమాలో ఛాన్స్ ఇవ్వ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ వెల్ల‌డించారు.

N

Entertainment | Published On Jun 2, 2026, 4.49 pm IST

Tollywood | తెలంగాణ యాస వ‌చ్చినోళ్ల‌కు సినిమా ఛాన్స్ – జ‌మ్మికుంట క‌థ‌తో రాజు వెడ్స్ రాంబాయి మేక‌ర్స్ కొత్త మూవీ
Advertisement

Tollywood | గ‌త ఏడాది చిన్న సినిమాగా రిలీజైన రాజు వెడ్స్ రాంబాయి బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది. కేవ‌లం రెండున్న‌ర కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ ఇర‌వై కోట్ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. తెలంగాణ యాస‌, భాష‌ల‌తో పాటు సంస్కృతికి పెద్ద‌పీట వేస్తూ ద‌ర్శ‌కుడు సాయిలు కంపాటి ఈ సినిమాను తెర‌కెక్కించారు. తాజాగా రాజు వెడ్స్ రాంబాయి నిర్మాత‌ల నుంచి మ‌రో సినిమా రాబోతుంది. ఈ సినిమా కూడా తెలంగాణ నేప‌థ్యంలోనే రానుంద‌ట‌. జ‌మ్మికుంట బ్యాక్‌డ్రాప్‌లో రూపొంద‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

అన్న‌ద‌మ్ముల పంచాయితీ...

ఇద్దరు అన్నదమ్ముల పంచాయితీ తెలంగాణలోని జమ్మికుంట అనే ఊరు రాతనే ఎలా మార్చింది?, వారిలో ఎవరు గెల్చినా ఊరు మాత్రం ఎందుకు ఓడిపోయింది?, రామాయణంలో రామలక్ష్మణుల్లా కలిసి ఉండాల్సిన అన్నదమ్ములు మహాభారతంలో సోదరుల్లా ఎందుకు యుద్ధం చేశారు? ఏ ఇంట్లోనూ జరగకూడని ఈ కథలో అసలు ఏం జరిగింది? అనే అంశాల‌తో ఈ మూవీ రూపొంద‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. . తెలంగాణలో పుట్టిన మరో మట్టి కథ పరిమళాన్ని ప్రేక్షకులకు అందించ‌బోతున్న‌ట్లు చెప్పారు.

వీడియోలు పెట్టుర్రి...

ఈ తెలంగాణ మూవీలో నటించేందుకు ఔత్సాహిక నటీనటులు కావాలంటూ మేక‌ర్స్ పేర్కొన్నారు. 'తెలంగాణ యాస బాస అచ్చిన తెలుగోళ్ళంతా ఈడియోలు పెట్టుర్రిస అంటూ ప్రకటించారు. నటన పట్ల ప్యాషన్, ప్రతిభ ఉన్న వారికి ఇదొక మంచి అవకాశమ‌ని అన్నారు.ఈ సినిమాను సంధ్య భాను చల్లా తో క‌లిసి డైరెక్ట‌ర్ వేణు ఊడుగుల నిర్మిస్తున్నారు. మధుకర్ రెడ్డి కోమిరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.

 

Advertisement
Advertisement