Siddaramaiah | నా కుమారుడికి కీలక మంత్రిత్వ శాఖను కేటాయించండి.. హైకమాండ్‌ను కోరిన సిద్ధరామయ్య
Siddaramaiah | సిద్ధరామయ్య (Siddaramaiah) నేడు కాంగ్రెస్ పెద్దలను కలిశారు. ఈ సందర్భంగా పలు డిమాండ్లను అధిష్టానం ముందు ఉంచినట్లు తెలిసింది. డీకే (DK Shivakumar) నేతృత్వంలో ఏర్పడబోయే కేబినెట్‌లో తన కుమారుడు యతీంద్రకు (Yathindra) కీలకమైన శాఖలను కేటాయించాలని సిద్ధరామయ్య హైకమాండ్‌ను కోరినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది.
Siddaramaiah | ముఖ్యమంత్రి (Karnataka Chief Minister) పదవికి సిద్ధరామయ్య (Siddaramaiah) గురువారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన ఢిల్లీ వెళ్లారు. ఈ నేపథ్యంలో నేడు కాంగ్రెస్ పెద్దలను కలిశారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ (Rahul Gandhi)తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు డిమాండ్లను అధిష్టానం ముందు ఉంచినట్లు తెలిసింది.
రాజ్యసభ, ఎమ్మెల్సీ నియామకాలకు సంబంధించిన జాబితాతోపాటూ డీకే (DK Shivakumar) నేతృత్వంలో ఏర్పడబోయే కేబినెట్‌లో తన కుమారుడు యతీంద్రకు (Yathindra) కీలకమైన శాఖలను కేటాయించాలని సిద్ధరామయ్య హైకమాండ్‌ను కోరినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. యతీంద్రకు వైద్య విద్య, సంక్షేమ శాఖ, పరిశ్రలు లేదా నీటి వనరులు వంటి కీలక శాఖలను కేటాయించాలని విజ్ఞప్తి చేసినట్లు సదరు వర్గాలు తెలిపాయి. సిద్ధూ విజ్ఞప్తికి హైకమాండ్ కూడా సానుకూలంగా స్పందించినట్లుగా తెలిసింది.
ఇదిలా ఉండగా.. సిద్ధరామయ్య (Siddaramaiah) రాజీనామాను గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్ (Thawar Chand Gehlot) ఆమోదించారు. పార్టీ అధిష్టానం ఆదేశాలతో గురువారం తన ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే గవర్నర్ మధ్యప్రదేశ్ పర్యటనలో ఉండటంతో లోక్‌భవన్‌కు వెళ్లిన ఆయన గవర్నర్ ప్రత్యేక కార్యదర్శి ప్రభుశంకర్‌కు రాజీనామా పత్రం సమర్పించారు. అర్ధరాత్రి బెంగళూరు చేరుకున్న గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్ శుక్రవారం ఉదయం రాజీనామాను ఆమోదించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరారు.
Also Read..
చాలా ప్రత్యేకం.. సీఎం విజయ్‌తో ఎయిర్ హోస్టెస్ ఫొటో వైరల్
ఎల్ఈడీ బల్బును మింగేసిన చిన్నారి.. ఎలా బయటకు తీశారంటే..?
న్యాయవాది ఖాజా మొహిజుద్దీన్ హత్య కేసు.. ఐదుగురు నిందితుల అరెస్టు
సంబంధిత వార్తలు

Satyam Srirangam | జ్ఞానేశ్ కుమార్ అక్రమాలపై రేపు రాష్ట్రవ్యాప్త ఆందోళనలు
సెప్టెంబర్ 26, 2026

DK Shivakumar | బెంగళూరుకు వచ్చే ఎమ్మెల్యేలకు రెండు పెళ్లిళ్లు.. డీకే సంచలన వ్యాఖ్యలు
సెప్టెంబర్ 26, 2026

Uttam Kumar Reddy | ఈసీ స్వతంత్రతే ప్రజాస్వామ్య పరిరక్షణకు పునాది: మంత్రి ఉత్తమ్
సెప్టెంబర్ 26, 2026
తాజావార్తలు
- ●Devi Prasad | దసరా లోపు పీఆర్సీ ప్రకటించాలి
- ●Trains Cancelled | రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఆరు రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే..
- ●Jagadeesh Reddy | నల్లగొండలో పవర్ ప్లాంట్ వద్దనేవాడిని చెప్పుతో కొట్టాలి
- ●Ntr | సర్జరీ తర్వాత ఫస్ట్ టైమ్ మీడియా ముందుకు ఎన్టీఆర్ - రాజమౌళి కొడుకు సినిమాకు గెస్ట్‌గా
- ●KTR | పాలిచ్చే బర్రెను వదులుకుని.. తన్నే దున్నపోతును తెచ్చుకున్నారు
- ●Baanganga Gold & Diamonds | ఇన్వెస్టర్లకు అలర్ట్.. రూ.720 కోట్లకు ప్రముఖ కంపెనీ ఐపీఓ..

Devi Prasad | దసరా లోపు పీఆర్సీ ప్రకటించాలి

Trains Cancelled | రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఆరు రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే..

Jagadeesh Reddy | నల్లగొండలో పవర్ ప్లాంట్ వద్దనేవాడిని చెప్పుతో కొట్టాలి

Ntr | సర్జరీ తర్వాత ఫస్ట్ టైమ్ మీడియా ముందుకు ఎన్టీఆర్ - రాజమౌళి కొడుకు సినిమాకు గెస్ట్‌గా



