త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rashmika Mandanna | ర‌ష్మిక గ్లామ‌ర్ ర‌చ్చ – లెస్బియ‌న్ ల‌వ్‌స్టోరీపై క్లారిటీ – కాక్‌టెయిల్ 2 ట్రైల‌ర్ రిలీజ్

ర‌ష్మిక మంద‌న్న బాలీవుడ్ మూవీ కాక్‌టెయిల్ 2 ట్రైల‌ర్ మంగ‌ళ‌వారం రిలీజైంది. ఈ ట్రైల‌ర్‌లో ర‌ష్మిక మంద‌న్న‌, కృతి స‌న‌న్ గ్లామ‌ర్‌తో ర‌చ్చ చేశారు. ట్రైల‌ర్‌లోని బోల్డ్ డైలాగ్స్‌, రొమాంటిక్ సీన్లు ఫ్యాన్స్‌ను ఆక‌ట్టుకుంటున్నాయి.

N

Entertainment | Published On Jun 2, 2026, 4.13 pm IST

Rashmika Mandanna | ర‌ష్మిక గ్లామ‌ర్ ర‌చ్చ – లెస్బియ‌న్ ల‌వ్‌స్టోరీపై క్లారిటీ – కాక్‌టెయిల్ 2 ట్రైల‌ర్ రిలీజ్
Advertisement

Rashmika Mandanna | ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టించిన బాలీవుడ్ మూవీ కాక్‌టెయిల్ 2 జూన్ 19న థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. షాహిద్ క‌పూర్ హీరోగా న‌టించిన ఈ సినిమాలో ర‌ష్మిక మంద‌న్న‌తో పాటు కృతి స‌న‌న్ మ‌రో క‌థానాయిక‌గా క‌నిపించ‌బోతుంది. హోమీ అద్జానియా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ బాలీవుడ్ మూవీ ట్రైల‌ర్‌ను మేక‌ర్స్ మంగ‌ళ‌వారం రిలీజ్ చేశారు. స్నేహం, ప్రేమ‌, రొమాన్స్, కామెడీ అంశాల‌తో ఈ ట్రైల‌ర్ క‌ల‌ర్‌ఫుల్‌గా సాగింది.
ఒకే అబ్బాయిని ప్రేమించిన ఇద్ద‌రు ప్రాణ స్నేహితురాళ్ల క‌థ‌తో ద‌ర్శ‌కుడు ఈ సినిమాను తెర‌కెక్కించిన‌ట్లు ట్రైల‌ర్‌లో చూపించారు. ఇందులో కునాల్ పాత్ర‌లో షాహిద్ క‌నిపించ‌గా...దియాగా ర‌ష్మిక‌, అల్లీగా కృతి స‌న‌న్ న‌టించ‌బోతున్న‌ట్లు చూపించారు. జెన్ జీ ఆడియెన్స్‌ను మెప్పించేలా విజువ‌ల్స్‌, డైలాగ్స్‌, సాంగ్స్ ఉన్నాయి. ఈ ట్రైల‌ర్‌లో ర‌ష్మిక మంద‌న్న‌, కృతి స‌న‌న్ గ్లామ‌ర్‌తో రెచ్చిపోయారు. పోటీప‌డి మ‌రీ అందాల ప్ర‌ద‌ర్శ‌న చేశారు.
ర‌ష్మిక కెరీర్‌లోనే మోస్ట్ గ్లామ‌ర‌స్ రోల్ ఇద‌ని నెటిజ‌న్లు కామెంట్లు పెడుతోన్నారు. కొంద‌రు నెటిజ‌న్లు మాత్రం ర‌ష్మిక క్యారెక్ట‌ర్‌ను ట్రోల్ చేస్తోన్నారు. మోడ్ర‌న్ క్యారెక్ట‌ర్‌కు సూట్ కాలేద‌ని, రాంగ్ ఛాయిస్ అంటూ కామెంట్లు పెడుతోన్నారు.

బోల్డ్‌గా...

సైఫ్ అలీఖాన్‌, దీపికా ప‌డుకోణ్ జంట‌గా న‌టించిన కాక్‌టెయిల్ మూవీకి సీక్వెల్‌గా కాక్‌టెయిల్ 2 తెర‌కెక్కుతోంది. పార్ట్ వ‌న్‌తో పోలిస్తే ఈ సీక్వెల్‌ను మ‌రింత బోల్డ్‌గా తెర‌కెక్కించారు. కాక్‌టెయిల్‌లోని తుమ్ హీ హో అనే సాంగ్‌ను ఈ సీక్వెల్ కోసం రీక్రియేట్ చేశారు. కాక్‌టెయిల్ 2 ట్రైల‌ర్ ట్రెండ్ అవుతోంది.

లెస్బియ‌న్ ల‌వ్‌స్టోరీ కాదు...

కాక్‌టెయిల్ 2 లెస్బియ‌న్ ల‌వ్‌స్టోరీ అంటూ గ‌త కొద్ది రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇందులో ర‌ష్మిక మంద‌న్న‌, కృతి స‌న‌న్ స్వ‌లింగ సంప‌ర్కులుగా క‌నిపించ‌బోతున్న‌ట్లు రూమ‌ర్లు వినిపించాయి. ఈ రూమ‌ర్ల‌పై ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్‌లో ఇద్ద‌రు హీరోయిన్లు రియాక్ట్ అయ్యారు. రెండు ప్రేమ‌క‌థ‌ల‌తో కాంటేంప‌ర‌రీ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా సాగుతుంద‌ని అన్నారు.

Advertisement
Advertisement