Prabhas Spirit | స్పిరిట్‌పై కొత్త అప్‌డేట్ – ప్రభాస్ సినిమాలో పవన్ కళ్యాణ్ అత్త
ప్రభాస్ స్పిరిట్‌పై మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చేసింది. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ నదియా ఓ కీలక పాత్రలో నటించనుందట. స్పిరిట్ షూటింగ్ లొకేషన్ వీడియోను నదియా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియో వైరల్ అవుతోంది.
Entertainment | Published On Jun 2, 2026, 2.18 pm IST
Prabhas Spirit | ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతోన్న స్పిరిట్ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రభాస్‌తో పాటు ప్రధాన తారాగణంపై దర్శకుడు సందీప్ వంగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
సోషల్ మీడియాలో...
స్పిరిట్ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ నదియా ఓ కీలక పాత్రలో నటించనుందట. హైదరాబాద్ హైటెక్ సిటీలో షూటింగ్ లొకేషన్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. మూడో రోజు షూటింగ్ అంటూ ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది. ఈ షూటింగ్ లోకేషన్ స్పిరిట్‌దేనని అభిమానులు అంటున్నారు. ఈ మూవీలో నదియా ఓ ఇంపార్టెంట్ రోల్‌లో నటించబోతుందని చెబుతున్నారు.
మిర్చిలో ప్రభాస్ తల్లిగా...
మిర్చి తర్వాత మరోసారి ప్రభాస్ సినిమాలో నదియా కీలక పాత్రలో కనిపించబోతుండటం గమనార్హం. మిర్చిలో ప్రభాస్ తల్లిగా కనిపించింది. స్పిరిట్‌లో నదియా రోల్ ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో తెలుగులో ఇప్పటివరకు చేసిన సినిమాలకు భిన్నమైన క్యారెక్టర్‌లో ఈ సీనియర్ హీరోయిన్‌ను సందీప్ వంగా చూపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
టాప్ హీరోయిన్లలో ఒకరిగా...
ఒకప్పుడు మలయాళ తమిళ భాషల్లో టాప్ హీరోయిన్లలో ఒకరిగా పేరు తెచ్చుకుంది నదియా. కథానాయికగా తెలుగులోనూ బజారు రౌడీ, వింత దొంగలు, ఓ తండ్రి ఓ కొడుకుతో పాటు మరికొన్ని సినిమాలు చేసింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన నదియా అత్తారింటికి దారేదితో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. ఇందులో పవన్ కళ్యాణ్ అత్త పాత్రలో అద్భుత నటనతో అదరగొట్టింది. అత్తారింటికి దారేతి సక్సెస్ తో తెలుగులో బిజీగా మారింది. దృశ్యం, బ్రూస్‌లీ, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియాతో పాటు మరికొన్ని సినిమాలు చేసింది.కాగా ప్రభాస్ స్పిరిట్‌లో బాలీవుడ్ హాట్ బ్యూటీ త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తోంది. వచ్చే ఏడాది మార్చి 5న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
సంబంధిత వార్తలు

Rashmika Mandanna | సద్దుల బతుకమ్మ సంబరాల్లో విరోష్ జోడీ – రష్మికకు డిప్యూటీ సీఎం దంపతుల కానుక
అక్టోబర్ 17, 2026

Vijay Deverakonda | అఫీషియల్ – “మనం” డైరెక్టర్‌తో విజయ్ దేవరకొండ సినిమా – జానర్ ఇదే
అక్టోబర్ 16, 2026

Ranabaali Review | రణబాలి రివ్యూ … విమర్శలకు బదులిచ్చేందుకు విజయ్ చేసిన సినిమానా?
అక్టోబర్ 16, 2026
తాజావార్తలు
- ●US Shooting | అమెరికాలో నలుగురి ప్రాణాలు తీసిన దుండగుడు..
- ●Navaratri Brahmotsavams | తిరుమలలో గజవాహనంపై మలయప్పస్వామి దివ్యదర్శనం
- ●FSSAI | నెస్లే, హిందుస్థాన్ యూనిలీవర్‌కు FSSAI నోటీసులు!
- ●Ajay Devgn | అజయ్ దేవ్‌గణ్ నివాసంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత - క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్...
- ●ACB Raids | కీసర ఇన్స్పెక్టర్పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.. రూ.2.28 కోట్ల ఆస్తులు గుర్తింపు..
- ●Traffic Advisory | సద్దుల బతుకమ్మ.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

US Shooting | అమెరికాలో నలుగురి ప్రాణాలు తీసిన దుండగుడు..

Navaratri Brahmotsavams | తిరుమలలో గజవాహనంపై మలయప్పస్వామి దివ్యదర్శనం

FSSAI | నెస్లే, హిందుస్థాన్ యూనిలీవర్‌కు FSSAI నోటీసులు!

Ajay Devgn | అజయ్ దేవ్‌గణ్ నివాసంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత - క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్...



